విజయవాడ: ఏపీలో క్రమేపీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురికి కోవిడ్-19 సోకగా, తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసు నమోదైంది. 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన తిరువూరుకు చెందిన బాలికకు టెస్టులు చేయగా కోవిడ్‌గా తేలింది. ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆ బాలికను కోవిడ్ వార్డుకు తరలించారు వైద్యులు.
కాగా, దేశంలో మళ్లీ కోవిడ్ వ్యాప్తి వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 340కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో జూన్ 26 నుంచి శుక్రవారం వరకు నలుగురు కోవిడ్‌తో మృతిచెందగా మొత్తం 13 కోవిడ్ యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. అయితే కోవిడ్ బారినపడిన రోగులంతా స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్‌లోనే కోలుకుంటున్నారని.. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నందునే ఏపీలో నలుగురు రోగులు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు.