Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. అరటి రైతు ఆక్రందన
ADVERTISEMENT 

అరటి రైతు ఆక్రందన

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 19, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
arati.jpg

వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల్లో అన్నదాత కుదేలు

పంటను తొలగించి పశువులకు మేతగా వాడుతున్న వైనం

ఈ రెండు జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో అరటి సాగు

ధరలు పతనం కావడంతో కోలుకోలేని విధంగా దెబ్బ

నెల రోజులుగా టన్ను రూ.2 వేలు కూడా పలకని పరిస్థితి

దళారీల పాలవుతున్న రైతు కష్టం.. చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

పెట్టుబడి కూడా దక్కక అన్నదాత గగ్గోలు.. కనీస మద్దతు ధర ప్రకటించని సర్కారు 

అనంతపురం అగ్రికల్చర్, కడప అగ్రికల్చర్‌/లింగాల: నాణ్యమైన అరటి పంటకు పేరుగాంచి, గల్ఫ్‌ దేశాలకు సైతం ఎగుమతులు చేసిన అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల రైతులు నేడు దీనావస్థ ఎదుర్కొంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. అయితే, పెట్టుబడులు కూడా దక్కని కనిష్ఠ స్థాయికి మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతుల ఆశలు నీరుగారాయి. గెలలను కొనేందుకు వ్యాపారులు రావడం లేదు. కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీదే వదిలేశారు. మరికొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. రూ.లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యామని వాపోతున్నారు. రూ.కోట్లలో నష్టపోతున్నా... చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. కరోనా లాంటి తీవ్ర విపత్తు తర్వాత తొలిసారి ధరలు పతనం అయ్యాయని పేర్కొంటున్నారు.  

కనీస మద్దతు ధర ప్రకటించని చంద్రబాబు సర్కారు 
వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల అరటి రైతుల కష్టాలు, కడగండ్లు పట్టించుకునే స్థితిలో చంద్రబాబు సర్కారు లేదు. కనీసం మద్దతు ధర కూడా ప్రకటించలేదు. అనంతపురం జిల్లాలో  40వేల ఎకరాల్లో అరటిసాగు అవుతుంది. లక్షన్నర టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ–క్రాప్‌ ప్రకారమే 32 మండలాల్లోని 13 వేల మంది రైతులు గ్రానైన్‌ రకం టిష్యూ కల్చర్‌ అరటి పండించారు. పుట్లూరు మండలంలో అత్యధికంగా 6,985 ఎకరాల్లో వేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో 700 ఎకరాల్లో అరటి సాగైంది. ఎకరాకు 22–25 టన్నుల దిగుబడి వచి్చనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది 8 లక్షల టన్నులపైగా అరటి పంట వస్తుందని అంచనా. 

⇒  వైఎస్సార్‌ కడప జిల్లాలో అరటి రైతు కుదేలయ్యాడు. జిల్లా వ్యాప్తంగా 20,231 ఎకరాల్లో అరటి సాగైంది. లింగాల, పులివెందుల, కాశినాయన, వేంపల్లి, వేముల, సింహాద్రిపురం మండలాల్లో అత్యధికంగా పంటను డోజర్‌లతో తీసేస్తున్నారు. లింగాల మండలంలో మార్చి, ఏప్రిల్‌­లో అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురు గాలులతో అరటి రైతులకు అపార నష్టం సంభవించింది. మార్చిలో తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, పార్నపల్లె, పెద్దకుడాల గ్రామాల్లో 567 హెక్టార్లలో పంట తుడిచిపెట్టుకుపోయింది. ఏప్రిల్‌లో లింగాల, చిన్నకుడాల, రామనూతనపల్లె, గుణకణపల్లె, మురారిచింతల తదితర గ్రామాల్లో 488 హెక్టార్లలో తోటలు కూలిపోయాయి. 9 నెలలైనా ఇంతవరకు ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ అందలేదని రైతులు వాపోతున్నారు.     

ధరలు నెలలోనే రూ.వెయ్యికి పతనం 
అరటిలో రెండేళ్లలో మూడు పంటలు తీస్తారు. మొక్క నాటిన తర్వాత ఏడు నెలలకు మొదటి గెల వస్తుంది. మొత్తంగా 10 నెలల కాలంలో మొదటి పంట పూర్తవుతుంది. తర్వాత 8 నెలలకు రెండో పంట పండిస్తారు. ఈ రెండు విడతలు కచి్చతం. కొందరు మూడో విడత కూడా సాగు చేస్తారు. ప్రస్తుతం రెండో మూడో విడత కోతలు జరగుతున్నాయి. నెల కిందట టన్ను రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు అమ్ముడవగా పెట్టుబడులు దక్కాయి. క్రమంగా టన్ను రూ.వెయ్యి, రూ.2 వేలకు పతనమైంది. దీంతో రైతులు తోటలు వదిలేస్తున్నారు. కాయలు మాగిపోతున్నా అడిగేవారు లేనందున  ట్రాక్టర్లతో పారబోస్తున్నారు. టన్ను కనీసం రూ.12 వేలైనా పలికితే కాని గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. డిసెంబర్‌ నుంచి మొదటి పంట కోతలు మొదలవుతాయని, ఇవే ధరలుంటే తమ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తుతున్నారు. అయినా చంద్ర బాబు సర్కారు చోద్యం చూస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కోర్టుకు వెళ్లే యోచనలో అరటి రైతులు 
మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్ట­పోయిన వైఎస్సార్‌ కడప జిల్లా అరటి రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో  పరిహారం ఇప్పించాలని కోరుతూ వీరు కోర్టును ఆశ్రయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.  

మాట నిలబెట్టుకున్న వైఎస్‌ జగన్‌
దెబ్బతిన్న రైతులకు ఆర్థిక సాయం
మార్చి 23న పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో అరటి తోటలు కూలిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆ మరుసటి రోజే తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామా­ల్లో ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డితో కలిసి పర్యటించారు. కూలిన తోటలను చూసి చలించిపోయా­రు. రైతులకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నెలలోపే నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.  వైఎస్‌ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు చెక్కులను అందజేశారు. 

ప్రభుత్వానిదంతా హడావుడే.. పైసా సాయం లేదు 
వైఎస్‌ జగన్‌ లింగాల మండలంలో పర్యటిస్తున్నారని తెలుసుకున్న వైఎస్సార్‌ కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అదే రోజు  పార్నపల్లె, కోమన్నూతల గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వం నుంచి అరటి రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి కూడా రైతులను ఆదుకుంటామని చెప్పారు. హెక్టార్‌కు రూ.30 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని గొప్పలు పోయారు. ఇంతవరకు చిల్లిగవ్వ అందలేదని అరటి రైతులు వాపోతున్నారు.  

పైసా రాలేదు.. 
మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా 4 ఎకరాల్లోని అరటి పంట పూర్తిగా కూలిపోయింది. ఆదుకుంటామని అధికార పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పైసా సాయం చేయలేదు. అరటి సాగుకు  సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాను. నష్టాల ఊబిలో కూరుకుపోయా. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. –వందలపల్లె కేశవ, అరటి రైతు, తాతిరెడ్డిపల్లె, వైఎస్సార్‌ కడప జిల్లా

ఎదురుచూపులే మిగిలాయి... 
చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు మాటలు చెప్పి వెళ్లిపోయారు. ఇంతవరకు నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించి రైతులకు  పరిహారం అందించారు. ఈ ప్రభుత్వంలో ఎదురుచూపులు తప్ప ఎలాంటి ఫలితం లేదు. 
– పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, వైఎస్సార్‌ కడప జిల్లా  

పెట్టుబడి కూడా కష్టమే.. 
మూడు ఎకరాల్లో అరటి సాగుకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశాను. పంట కోతకు వచి్చనా అడిగేవారు లేరు. కొట్టేవారు కనిపించడం లేదు. కాయలు మాగిపోతున్నాయి. ధర రూ.వెయ్యి అంటున్నా దానికీ  ముందుకురావడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. మొక్కలు, నాటడం, వేసవిలో కాపాడుకోవడం, కూలీ­లు, ఎరువులు, పురుగుమందుల ఖర్చు అన్నీ లెక్కేస్తే భయమేస్తోంది. 
– బండి శివనారాయణ, ముచ్చుకోట, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా

టన్ను రూ.400 చొప్పున ఇచ్చేశా 
15 ఎకరాల్లో అరటి సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చుపెట్టా. తెలంగాణ నుంచి లారీ కోడి పెంట రూ.60 వేలకు కొన్నాను. పంట చేతికొచ్చినా ధరల్లేక నష్టాలు భరిస్తున్నా. 5 ఎకరాల పంట మూడో విడత  కోతకు సిద్ధంగా ఉంది. ధర కోసం 15 రోజులుగా ఎదురుచూసినా ఫలితం లేదు. టన్ను రూ.400 ప్రకారం 10 టన్నులు ఇచ్చేసి దున్నేస్తున్నా. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు.      – బానా నాగేశ్వరరెడ్డి, కడవకల్లు,   పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Banana farmers
Chandrababu Naidu government
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.