Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘వక్క’సారి నాటితే వందేళ్లు
ADVERTISEMENT 

‘వక్క’సారి నాటితే వందేళ్లు

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
coconut.jpg

కనీసం 60 ఏళ్లకు పైగా వక్క తోటలతో స్థిరమైన ఆదాయం 

కొబ్బరికి సమానంగా దీర్ఘకాలిక పంట  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 వేల ఎకరాల్లో సాగు 

ఇప్పుడిప్పుడే మొదలవుతున్న దిగుబడి

దీర్ఘకాలిక ఆదాయం వచ్చే కొబ్బరి తోటల జాబితాలో ‘వక్క’పంట కూడా నిలుస్తోంది. ఈ రెండు పంటలు కనీసం 60 నుంచి 100 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తున్నాయి. తద్వారా రెండు నుంచి మూడు తరాలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా వక్క సాగుకు అవకాశం ఉంది. ఒకవేళ వక్కపంటను నేరుగా సాగు చేస్తే కొన్నేళ్లపాటు అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా పొందొచ్చు.     – దమ్మపేట

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైన వక్క దిగుబడి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే తొలిసారి దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి తదితర మండలాల్లో రైతులు కొబ్బరి, ఆయిల్‌పామ్‌ క్షేత్రాల్లో వక్క పంటను అంతర పంటగా సుమారు 2 వేల ఎకరాలకు పైగానే సాగు చేశారు. అశ్వారావుపేట మండలం గంగారంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దమ్మపేట మండలం మందలపల్లిలో సేంద్రియ రైతు దేవరపల్లి హరికృష్ణ తమ కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసిన వక్క తోటల్లో ఇటీవల దిగుబడి మొదలైంది. తాజాగా పచ్చి వక్క గెలలను కోయగా ఎకరాకు టన్ను నుంచి రెండు టన్నుల వరకు దిగుబడి వచి్చంది. టన్ను రూ.45 వేల చొప్పున విక్రయించారు. వక్క పంట జీవితకాలం 60–100 ఏళ్ల వరకు ఉంటుందని, అయితే 80 ఏళ్ల తర్వాత మొక్కలు ఎత్తు పెరిగి కోత కష్టం కావడంతో అంతవరకే ఆపేస్తారని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆ వయస్సు తోటలు ఎక్కడా లేవు.  

టన్ను ధర రూ.48 వేలకు పైనే..  
ప్రస్తుతం పచ్చి వక్క టన్ను ధర రూ.48 వేల నుంచి రూ.52 వేల వరకు పలుకుతోంది. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండి దీర్ఘకాలం స్థిర ఆదాయాన్ని ఇచ్చే పంట కావడంతో రైతులు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. వక్క సాగుకు నీరు నిలవని పొడి, గట్టు, మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. తేమతో కూడిన మంచి ఉష్ణోగ్రతలు (14 డిగ్రీల నుంచి 36 డిగ్రీలు) మొక్క పెరుగుదల, దిగుబడికి దోహదం చేస్తాయి.

ఏపీలోని ఏలూరు జిల్లా నర్సరీల్లో రూ.50 అంతకన్నా కాస్త ఎక్కువ ధరలో మొక్కలు లభిస్తాయి. జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఎకరానికి 500’–700 మొక్కలు నాటుకోవచ్చు. కొబ్బరిలో అయితే అంతర పంటగా ఎకరాకు 400 మొక్కలు నాటొచ్చు. మొక్కల పెరుగుదల, కాలానుగుణంగా నీరు, పశువుల పేడ, సేంద్రియ, రసాయన ఎరువులను తగు మోతాదులో వాడాలి. మొదటి రెండేళ్లు అరటి, జాజి, మిరియాలు వంటివి అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. సాగుకు ఏటా పెట్టుబడి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది.  

దిగుబడి..ఆదాయం 
వక్కలకు మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోయే ప్రమాదం లేదు. ఈ మేరకు రైతులు నమ్మకంగా సాగు చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు. పంట దిగుబడి 5–6 ఏళ్లకు మొదలై తొలుత క్వింటా నుంచి రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత గరిష్టంగా ఎకరాకు 5– 8 క్వింటాళ్ల వరకు దిగుబడి రావొచ్చు. తద్వారా ఎకరా తోట నుంచి ఏటా రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల ఆదాయం సమకూరుతుంది.

ఆరో ఏట నుంచి దిగుబడి  
రెండెకరాల కొబ్బరి తోటలో అంతర పంటగా ఎకరాకు 400 వక్క మొక్కలు నాటి సేంద్రియ ఎరువులే వాడా. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు దాటలేదు. ఆరో ఏట ఎకరానికి టన్నుకు పైగానే దిగుబడి వచ్చింది. ఏపీలోని ఏలూరు జిల్లా సీతానగరంలో ఉన్న ప్రొసెసింగ్‌ యూనిట్‌ వారు టన్ను రూ.45 వేల చొప్పున కొనుగోలు చేశారు. 
– దేవరపల్లి హరికృష్ణ, రైతు, మందలపల్లి 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
coconut
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.