Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Hyderabad: ప్యారడైజ్‌ నుంచి డైరీఫామ్‌ వరకు సొరంగ మార్గం..
ADVERTISEMENT 

Hyderabad: ప్యారడైజ్‌ నుంచి డైరీఫామ్‌ వరకు సొరంగ మార్గం..

Telangana Sakshi User Sakshi Sakshi Time Mar 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
444.jpg

ఎలివేటెడ్‌ కారిడార్‌కు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ క్లియరెన్స్‌ 

ప్యారడైజ్‌ నుంచి డైరీఫామ్‌ వరకు నిర్మాణం 

బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద 600 మీటర్ల టన్నెల్‌ 

రూ.15,50 కోట్లతో నిర్మించనున్న హెచ్‌ఎండీఏ

 సాక్షి, హైదరాబాద్‌: ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు  నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌కు(Elevated corridor) ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(Airport Authority of India) నుంచి తాజాగా అనుమతి లభించనుంది. ప్యారడైజ్‌(Paradise) నుంచి డెయిరీఫామ్‌(Dairy farm) వరకు 5.4 కిలోమీటర్ల కారిడార్‌ మార్గంలో బేగంపేట్‌ విమానాశ్రయం(Begumpet Airport) వద్ద సుమారు 600 మీటర్ల పొడవుతో సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. విమానాల రాకపోకలను  దృష్టిలో ఉంచుకొని ఎలివేటెడ్‌కు ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గం నిర్మించాల్సి ఉంటుందని హెచ్‌ఎండీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటి నుంచి అనుమతి లభించడంతో త్వరలో టెండర్‌ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించనుంది.  

డెయిరీఫామ్‌ ఎలివేటెడ్‌ ప్రత్యేకతలు..  
ప్యారడైజ్‌ నుంచి సికింద్రాబాద్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి మీదుగా డెయిరీఫామ్‌ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. భూసేకరణ కోసం అయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,550 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు వల్ల నగరానికి ఉత్తరం వైపు వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రస్తుతం  సుచిత్ర నుంచి మేడ్చల్‌ రూట్‌లో ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డెయిరీఫామ్‌ ఎలివేటెడ్‌ అందుబాటులోకి వస్తే జంక్షన్‌ రహితమైన, సిగ్నల్‌ర హితమైన, నిరాటంకమైన వాహనాల రాకపోకలు అందుబాటులోకి వస్తాయి.  

⇒ ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు మొత్తం 5.4 కిలోమీటర్ల కారిడార్‌లో 3.05 కిలోమీటర్లు ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉంటుంది. 
⇒ బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు వద్ద 600 మీటర్ల అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌ను నిర్మిస్తారు. 

⇒ మొత్తం ఎలివేటెడ్‌ కారిడార్‌ 27 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో 25 మీటర్లు క్యారేజ్‌వే, 2 మీటర్లు మీడియన్‌ ఉంటుంది. రెండు వైపులా క్రాష్‌ బారియర్స్‌ను ఏర్పాటు చేస్తారు. 

⇒ బోయిన్‌పల్లి జంక్షన్‌ వద్ద రెండు వైపులా 248 మీటర్ల నుంచి 475 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో ప్రవేశ, నిష్క్రమణ ర్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వాహనాలు  40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే  వెళ్లాల్సి ఉంటుంది. 

⇒ తాడ్‌బండ్‌ జంక్షన్‌ వద్ద మలుపులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో 600 మీటర్ల టన్నెల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు. జియోమెట్రిక్‌ ప్రత్యేకతలతో టన్నెల్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు  తెలిపారు. ఈ టన్నెల్‌ వల్ల వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది. 44వ జాతీయ రహదారి మార్గంలోనే కాకుండా కారిడార్‌కు ఇరువైపులా ఉన్న  ప్రాంతాల్లో కూడా వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. 

శామీర్‌పేట్‌ కారిడార్‌ ఇలా.. 
సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు సుమారు 18.10 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సైతం హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. తిరుమలగిరి, అల్వాల్‌ మార్గంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం సుమారు 197 ఎకరాల  భూమి సేకరణకు అధికారులు  ప్రణాళికలను రూపొందించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,232 కోట్లు  అవుతుందని అంచనా. ఈ రూట్‌లో రక్షణ శాఖ నుంచి, హకీంపేట్‌ వద్ద ఎయిర్‌ఫోర్స్‌ నుంచి అనుమతి లభించాల్సి ఉందని పేర్కొన్నారు. శామీర్‌పేట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌లో ఎయిర్‌ఫోర్స్‌ అనుమతి కీలకం కానుంది. ఈ అనుమతులు లభించిన వెంటనే  టెండర్‌ల ప్రక్రియ చేపట్టనున్నారు.  

Telangana: రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3.20లక్షల కోట్లు?


 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Dairy Farm
Paradise
Telangana
airport authority of India
Hyderabad
Tunnel
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.