Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘దళితబంధు’ ఉంటుందా? 
ADVERTISEMENT 

‘దళితబంధు’ ఉంటుందా? 

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 13, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kcr.jpg

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని దాదాపు 11,108 మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆరునెలలుగా ఉన్న సుమారు రూ.436.27 కోట్ల డబ్బును విత్‌ డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు రెండో జాబితాలో ప్రతీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున ఎన్నికలకు ముందు 1.31 లక్షల మంది దళితులతో జాబితాను నాటి ప్రభుత్వం రూపొందించింది. ఈలోపు ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కొలువుదీరిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ పథకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వీరందరిలోనూ పథకం అమలుపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. 

11వేలమందికి చెందిన.. రూ.436.27 కోట్లు ! 

పథకంలో ఎంపికైన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం, లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ, వారి చేత వ్యాపారాలు ప్రారంభించే లక్ష్యంతో 2021 ఆగస్టు 16న అప్పటి సీఎం కేసీఆర్‌ ఆ పథకానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలం శాలపల్లి వేదికగా ఈ పథకాన్ని ఆరంభించారు. హుజురాబాద్‌ నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకుని 18వేలమంది దళితులను పథకాన్ని ఎంపిక చేశారు. వీరిలో 11,315 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పు న ఇవ్వగా.. మిగిలిన వారికి రూ.10 లక్షలలోపు ఆర్థిక సాయం అందజేశారు.

దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తొలిదశలో తొలుత రెండురకాలుగా అమలు చేసింది. ఒకటి సాచురేషన్‌ (ఎంపిక చేసుకున్న ప్రాంతంలో) మోడ్, రెండోది టార్గెట్‌ మోడ్‌ (నియోజకవర్గాల వారీగా) విధానం. ఇందు లో టార్గెట్‌ మోడ్‌లో 11,387 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. వారిలో 1413 మందికి రూ.126.66 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖాతాల్లో వేసింది. సాచురేషన్‌ పద్ధతిలో మొత్తం 26,395 మందికి పథకాన్ని వర్తింపజేసింది. అందులో 9695 మందికి 309 కోట్లను విడుదల చేసింది. ఈ రెండు విధానాల్లో కలిపి 11,108 మంది ఖాతాల్లో మొత్తం రూ.436.27 కోట్లను ప్రభుత్వం ఖాతాల్లో వేసినా.. వారికి విత్‌డ్రా చేసుకునే వీలు మాత్రం ఇవ్వలేదు. 

రెండో జాబితాలో దయనీయం.. 

టార్గెట్‌ మోడల్‌లో పథకం ప్రారంభించిన ప్రభుత్వం మొత్తంగా 33 జిల్లాల్లో 119 మంది నియోజకవర్గాల్లో 1,31,500 మంది లబ్ధిదారులను రెండోదశలో ఎంపిక చేసింది. వారికి పథకం కోసం అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చింది. లబ్ధిదారులకు జారీ చేసేందుకు హార్డ్‌ కాపీలు కూడా సిద్ధం చేసింది. వీరి కోసం రూ.749 కోట్లు కూడా ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. కానీ, ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో ఎంపికైన 1,31,500 మంది లబ్ధిదారులకు ఆఖరునిమిషంలో డబ్బులు రాకుండా నిలిచిపోయాయి. దాంతో ఈ పథకం అమలుపై కలవరం నెలకొంది. 

సలహాదారులకు రాజభోగాలు 

వివిధ విభాగాలలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నామినేట్‌ చేసిన రిటైర్డ్‌ ఉద్యోగులను, నాయకులను రాజీనామా చేయిస్తోన్న కొత్త ప్రభుత్వం దళితబంధులో నామినేటెడ్‌ పోస్టుల వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దళిత బంధు కోసం ఇద్దరిని నామినేటెడ్‌ విధానంలో నెలకు రూ.2.50లక్షల చొప్పున వేతనాలు, వారికి ఐదుగురు సెర్ఫ్‌ సిబ్బందిని రిసోర్స్‌ పర్సన్ల (ఆరీ్ప)లుగా నియమించింది.

వీరికి రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఇస్తున్నారని సమాచారం. వీరు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు తీరును పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఆరునెలలుగా దళితబంధు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినా వీరిని కొత్త ప్రభుత్వం కూడా ఇంకా కొనసాగిస్తోంది. వీరు జిల్లాల్లో పర్యటించిన సందర్భాల్లో.. ఆయా జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులకు ఖర్చుల పేరిట చుక్కలు చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరికి కారు, డ్రైవర్, ఆఫీస్‌ బాయ్, ట్రావెల్‌ అలవెన్సు తదితరాలు అదనం కావడం కొసమెరుపు. 

వెంటనే జమ చేయాలి

మొదటి విడతగా విడుదలైన నిధులతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్నాం. ఏడాదిన్నర అవుతున్నా రెండో విడుత ఇవ్వాల్సిన మిగతా మొత్తం మా ఖాతాల్లో జమ చేయలేదు. అధికారులను అడిగితే దాటవేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే రెండో విడుత నిధులను విడుదల చేసి మా ఖాతాల్లో జమ చేయాలి.  – పర్లపల్లి రాజు, దళితబంధు లబ్ధిదారుడు, హుజూరాబాద్‌  

నిధుల కోసం ఎదురుచూస్తున్నాం 

దళితబంధు పథకంలో మొదటి విడతలో వచి్చన నిధులతో మినీ సూపర్‌మార్కెట్‌ నిర్వహిస్తున్నాం. రెండో విడుత నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి దుకాణాన్ని నడిపించాల్సి వస్తోంది. రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మలి విడత డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలి.  – గజ్జల అంజయ్య, లబ్దిదారుడు, హుజూరాబాద్‌   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
BRS
KCR
Dalit Bandhu
schemes
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.