Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సొంత ఆదాయంలో రాష్ట్రం టాప్‌!
ADVERTISEMENT

సొంత ఆదాయంలో రాష్ట్రం టాప్‌!

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 1, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
TEL.jpg

సామాజిక ఆర్థిక సర్వే (2024–25)లో కేంద్ర ప్రభుత్వం వెల్లడి

తెలంగాణ ఎంఎస్‌ఎంఈ పాలసీతో ఈ–కామర్స్‌ వ్యాప్తికి దోహదం 

రాష్ట్రంలో 100 శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు 

ఇస్రో భువన్‌ ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రికల్‌ ఇన్‌ఫ్రా నిర్వహణ 

రాజస్థాన్, ఏపీల తర్వాత సిమెంట్‌ పరిశ్రమల్లో మూడో స్థానం 

స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా 6 శాతం.. దేశంలో ఏడో స్థానంలో తెలంగాణ 

ఐటీ సేవల్లో కర్ణాటక తర్వాత రెండో ప్లేస్‌.. తలసరి ఆదాయంలో ఐటీదే అగ్రస్థానం 

బెంగళూరు, ముంబైతో పోటీగా హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం 

ఐటీ, ఫిన్‌టెక్‌ సేవల విస్తృతి కారణంగా ఆఫీసులు, నివాస స్థలాలకు మంచి డిమాండ్‌ 

ఫర్వాలేదనిపించే స్థాయిలో పారిశ్రా మిక అభివృద్ధి సాధించినట్టు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: సొంత ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తెలంగాణ దూసుకుపోతోందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25 వెల్లడించింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో వసూలవుతున్న పన్నుల్లో సగం కంటే ఎక్కువ మొత్తం సొంత పన్నుల( Own Tax Revenue) ద్వారానే వస్తోందని.. అందులో అత్యధికంగా తెలంగాణలో సొంత పన్నుల రాబడి 88శాతంగా ఉందని తెలిపింది. కర్ణాటక, హరియాణా రాష్ట్రాలు 86 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.

శుక్రవారం ప్రారంభమైన లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా అంశాల్లో ముందంజలో ఉందని వెల్లడైంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ హబ్‌గా మారిందని.. కర్ణాటక, మహారాష్ట్రలతో పోటీగా ఇక్కడ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం వృద్ధి చెందుతోందని ఈ సర్వే తెలిపింది.

రాష్ట్రంలో 100శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు అందుతోందని, 86 శాతం సాగుయోగ్యమైన భూములకు నీటి సౌకర్యం ఉందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక సర్వే (2024–25)లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విశేషాలివీ.. 

⇒ ఎగుమతుల పెంపు కోణంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ–కామర్స్‌ మార్కెట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక విధానం ఈ–కామర్స్‌ వ్యా ప్తికి ఇతోధికంగా దోహదపడనుంది. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ), గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ ప్లేస్‌ పోర్టల్‌లో అమ్మకపు సంస్థల ప్రాతినిధ్యాన్ని పెంచేదిగా ఉంది. 

⇒  2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ను ప్రారంభించినప్పుడు దేశంలోని 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు (17శాతం) మాత్రమే రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 2024 నవంబర్‌ 26 నాటికి ఈ పథకం కింద మరో 12.06 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతోంది. ప్రస్తుతం దేశంలోని 79.1 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు చేరుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు 100 శాతం గ్రామీణ కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ఒకటి. 

⇒  ఇస్రో చేపట్టిన అనేక భౌగోళిక వేదికల ద్వారా గ్రామీణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, న్యాయ, ఎలక్ట్రికల్‌ ఇన్‌ఫ్రా రంగాల్లో సామర్థ్యం పెరగడంతోపాటు ఆయా రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తోన్న పురోగతిని తెలుసుకునే వీలు కలుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో భువన్‌ వేదిక ద్వారా వెబ్‌జీఐఎస్‌ పోర్టల్‌తో ఎలక్ట్రికల్‌ ఇన్‌ఫ్రా నిర్వహణ సాధ్యమవుతోంది. 

⇒  ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్‌ ఉత్పత్తి అత్యధికంగా జరుగుతోంది మన దేశంలోనే. మన దేశంలోని రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే 87 శాతం సిమెంట్‌ పరిశ్రమలున్నాయి. 

⇒ రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో సేవల రంగం గణనీయ పాత్ర పోషిస్తోంది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటకల్లోని సేవల రంగం వాటా దేశంలోని అన్ని రాష్ట్రాల వాటాలో 25 శాతాన్ని మించుతోంది. తెలంగాణలో స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా 6 శాతంగా నమోదైంది. దేశంలో ఈ రంగంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. 

⇒ రియల్‌ ఎస్టేట్, ప్రొఫెషనల్‌ సేవల రంగాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, తమిళనాడు ముందంజలో ఉన్నాయి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై నగరాల్లో ఎక్కువ వృద్ధి కనిపిస్తోంది. ఆయా నగరాల్లో ఐటీ, ఫిన్‌టెక్‌ సేవల విస్తృతి కారణంగా ఆఫీసు, నివాస స్థలాల కోసం విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. 

⇒ కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు సర్విసుల రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. పారిశ్రామిక అభివృద్ధిలో ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణ కేంద్రంగా ముందుకెళుతుండటమే ఇందుకు కారణం. 

⇒ సామూహిక అభ్యాస కార్యక్రమాల ద్వారా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రేరణ మోడల్‌ విద్య కొనసాగుతోంది. తద్వారా తక్కు వ సంఖ్యలో ఉండే సమూహాలు అభ్యసనం, బో ధన తదితర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి.

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ సర్విసుల విస్తృతి గణనీయంగా ఉంది. వాణిజ్య సేవల రంగమైన ఐటీ రంగమే తెలంగాణ 
తలసరి ఆదాయ వాటాలోనూ సింహభాగం నమోదు చేస్తోంది.

మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ హబ్‌గా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఇందుకు దీర్ఘకాలికంగా దోహదపడనుంది. దేశంలోనే మహిళా పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్‌ రాష్ట్రంగా తెలంగాణ రూపొందింది.

2016–21 మధ్య దేశవ్యాప్తంగా సాగునీటి సౌకర్యం బాగా పెరిగింది. పంజాబ్‌ (98శాతం), హరియాణా (94), తెలంగాణ (86), ఉత్తరప్రదేశ్‌ (84శాతం)లలో సాగుయోగ్యమైన భూములకు ఎక్కువగా నీటి సౌకర్యం అందుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Tax Revenue
Telangana
Income
Socio-economic survey
Budget
real estate
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.