Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సింగిల్‌ యూజ్‌.. ప్లాస్టిక్‌ బ్యాన్‌
ADVERTISEMENT 

సింగిల్‌ యూజ్‌.. ప్లాస్టిక్‌ బ్యాన్‌

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 31, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
454545.jpg

ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ల బ్యాన్‌ ప్రధాన ధ్యేయం  

120 మైక్రాన్ల కంటే తక్కువ ఉంటే నిషేధం 

పకడ్బందీగా అమలుకు చర్యలు

చట్ట సవరణ చేయనున్న జీహెచ్‌ఎంసీ 

సాక్షి,  హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్స్‌ వినియోగాన్ని త్వరలో పూర్తిగా నిషేధించనున్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో నగరంలో దీని నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా 120  మైక్రాన్ల కంటే తక్కువ ఉండే క్యారీ బ్యాగ్‌లను సంపూర్ణంగా నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాన్‌ పేరిట దీన్ని అమల్లోకి తేనున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు నిరీ్ణత మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆదిలో అట్టహాసమే తప్ప అమలులో అటకెక్కింది.  

ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. 
ప్లాస్టిక్‌ నిషేధం కోసం 2007 నుంచే  ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిషేధం అమలు కోసమని పెనాలీ్టలను రూ.5 వేల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు విధిస్తూ పలు సర్క్యులర్లు, జీవోలు జారీ అయినప్పటికీ, అమలులో మాత్రం నీరు గారింది. ఈ నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తాజాగా జీహెచ్‌ఎంసీ చట్ట సవరణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నారు. తద్వారా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్స్‌ వినియోగంలో లేని నగరంగా హైదరాబాద్‌ ఉండాలని భావిస్తున్నారు. టీసీయూర్‌ (తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌)వరకు దీన్ని అమలు చేసే ఆలోచనలున్నప్పటికీ.. తొలుత చట్ట సవరణ ద్వారా  జీహెచ్‌ఎంసీ పరిధి వరకు కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని చట్ట సవరణ చేయనున్నారు.  

గతంలో ఇలా..  
ఎన్ని మైక్రాన్ల లోపు ఉంటే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టికో క్రమేపీ మారుతోంది. 20 మైక్రాన్ల లోపు వాటిని ఒకప్పుడు సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌గా పరిగణించగా, ప్రస్తుతం ఇది 120 మైక్రాన్లకు చేరింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలోనే  2007 ఆగస్ట్‌ 8న జారీ అయిన సర్కులర్‌ మేరకు 20 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ అమ్మినవారికి రూ.5వేలు, వినియోగించిన వారికి రూ.500 జరిమానాలు విధించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2011లో 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలు జరగరాదన్నారు.   

2016లో మొదటిసారి రూ.10వేల జరిమానాతో పాటు మూడోసారి సంస్థ మూసివేత వరకు చర్యలుంటాయని పేర్కొన్నారు. 2017లో వెలువడిన జీవో మేరకు నిషేధం అమల్లో జీహెచ్‌ఎంసీ విఫలమైతే జీహెచ్‌ఎంసీకి పీసీబీ రూ.25వేల జరిమానా విధిస్తుందని పేర్కొన్నారు. దాదాపు మూడేళ్ల క్రితం 2022లో డీలర్లు, డి్రస్టిబ్యూటర్లకు లక్ష రూపాయల జరిమానా నుంచి ప్రారంభించి సంస్థల సీజ్‌ వరకు చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వు జారీ చేశారు. ఒక టాస్‌్కఫోర్స్‌ సైతం ఏర్పాటు చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. పర్యవసానంగా ఏ మార్కెట్‌కు, దుకాణానికి వెళ్లినా ప్రజలకు మాత్రం క్యారీబ్యాగ్‌ల భారం అదనంగా పడుతోంది. గత పాలకమండలిలోనూ నగరంలో ప్టాస్టిక్‌ సంపూర్ణ నిషేధానికి ఆమోదం తెలిపిన సర్వసభ్య సమావేశం ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాక తిరిగి పట్టించుకోలేదు. 

ప్రభుత్వ నిర్ణయం మేరకు.. 
నిషేధానికి చేయనున్న చట్ట సవరణలోనూ కొన్ని ప్రత్యేక అవసరాలకు మినహాయింపులు ఉండనున్నట్లు తెలిసింది. నిషేధం అమల్లోకి వస్తే నగరంలో వివిధ సమస్యలు తగ్గుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  ఆర్‌వీ కర్ణన్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాలాల్లో వ్యర్థాలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా వరద సమస్యలు తగ్గుతాయి. ఎగుమతి కోసం  ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్స్‌  ఉత్పత్తి చేసేవారికి, సీల్డు సరుకుల  ప్యాకేజీలు, పాలు,పాల ఉత్పత్తుల  ప్యాకింగ్స్, నర్సరీల అవసరాలకు  అనుమతించే అవకాశం ఉంది. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగా మినహాయింపులు ఉండనున్నాయి.  


 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
plastic bags
ban
ghmc
Hyderabad
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.