Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రాష్ట్రానికి పాలనా పక్షవాతం
ADVERTISEMENT 

రాష్ట్రానికి పాలనా పక్షవాతం

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ramchandra-Rao.jpg

దాదాపు 22 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం  

హైడ్రా కూల్చివేతలు.. సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం ప్రకటించాలి  

మీట్‌ ది ప్రెస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని పరిపాలనా పక్షవాతం (అడ్మినిస్ట్రేటివ్ పెరాలిసిస్‌) పట్టి పీడిస్తోందని బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. దాదాపు 22 నెలల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రూరల్‌..అర్బన్‌ సెక్టార్లలోనే కాదు.. అన్ని సెక్టార్లలో కాంగ్రెస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో రాంచందర్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సక్రమంగా ప్రారంభించలేదని, జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైందన్నారు. హైడ్రా చర్యల్లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరెవరి ఆస్తులు కూల్చారు..సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీగా ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి పైగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

ఫార్ములా ఈ–కార్‌ రేస్‌ అవకతవకలపై ఏసీబీ విచారణలో వెల్లడైన అంశాలను ప్రభుత్వం బయటపెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారన్నారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఓయూ ఉద్యోగులకు ఈసారి నెల జీతమే ఆలస్యంగా వచి్చందన్నారు. జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తారు కానీ.. దానిని అమలు చేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పేపర్‌ లీకేజీలు జరిగితే కాంగ్రెస్‌ హయాంలో ‘హోప్‌ బ్రేకేజ్‌’జరుగుతోందన్నారు.  

కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలి  
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై కాకుండా నాణ్యత, అవినీతి, నిర్వహణ తదితర అంశాలు ముడిపడి ఉన్నందున మొత్తం ప్రాజెక్టుపైనే సీబీఐ విచారణ జరిపించాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. వందరోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పి..రెండేళ్లు కావొస్తున్నా ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండునెలల్లో బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపాలంటున్న కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు మరి స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న పదిమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నోటీసులపై కాలపరిమితితో చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ ‘మిస్‌ మేనేజ్‌మెంట్‌’కారణంగానే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు ప్రతిస్పందించారు. పార్టీలో అన్నీ సర్దుకుంటాయని, రాష్ట్ర కమిటీలో పరిమితంగా పోస్టులున్నందున అందరిని సంతృప్తి పరచలేమన్నారు. ఈ కమిటీలో చోటుదక్కని వారు ఎవరూ బాధపడొద్దని పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇటీవల పార్టీ ముఖ్యనేతలపై చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’అని అన్నారు. తన వెనుకాల ఎవరూ లేరని కేవలం ప్రధానమంత్రి మోదీ మాత్రం ఉన్నారని చెప్పారు. జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, జర్నలిస్టులు, న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
bjp
ramchander rao
Congress Party
HYDRA
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.