Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. తెలంగాణ అమరుల స్మారకం ఆవిష్కరణకు రెండేళ్లు
ADVERTISEMENT 

తెలంగాణ అమరుల స్మారకం ఆవిష్కరణకు రెండేళ్లు

Telangana Sakshi User Sakshi Sakshi Time May 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
588.jpg

ఇప్పటికీ సందర్శకులను అనుమతించని పరిస్థితి 

మ్యూజియం ఏర్పాటుకు చర్యలు శూన్యం    

పెండింగ్‌ పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి  

సాక్షి, హైదరాబాద్‌: అది ప్రత్యేక రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక జ్యోతి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చారిత్రక కట్టడాన్ని ఆవిష్కరించి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు సందర్శకులకు అనుమతి లేకుండాపోయింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా దీనిని ప్రారంభించింది. అమరుల మ్యూజియంతో పాటు మరికొన్ని పనులు వాయిదా పడ్డాయి. అలా పెండింగ్‌ జాబితాలో పడిపోయిన పనులను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఫలితంగా సందర్శకులు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. సెక్రటేరియట్‌ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు. కానీ.. తెలంగాణ అమరుల స్మారకానికి మాత్రం ఇంకా తుది మెరుగులే దిద్దలేదు. సందర్శకులను అనుమతించడం లేదు.  

ఆ దిశగా అడుగు పడలేదు.. 
ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు నెక్లెస్‌ రోడ్డుకు వస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో వేలాది మంది ట్యాంక్‌బండ్, లుంబిని పార్కు, ఎనీ్టఆర్‌ పార్కు, అంబేద్కర్‌ విగ్రహం వంటి  ప్రాంతాలను సందర్శిస్తాను. వీటితో పాటు అమరుల స్మారకాన్ని బయటి నుంచి వీక్షించాల్సిందే. కానీ..  ప్రాంగణంలోకి వెళ్లేందుకు అవకాశం లేదు. తొలి, మలి దశ ఉద్యమాల్లో  అమరులైన వందలాది మంది జీవితాలను సమున్నతంగా ఎత్తిపట్టేలా మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణ ఉద్యమాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శించేందుకు ప్రత్యేకమైన హాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలపై ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటి వరకు ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు.

అలంకారప్రాయంగా జ్యోతి.. 
హుస్సేన్‌సాగర్‌ తీరాన లుంబిని పార్కును ఆనుకొని సుమారు 3.2 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన  తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే అపురూపమైన కళాఖండంగా  నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో దీని నిర్మాణం చేపట్టారు. దుబాయ్‌లో ఎంతో పేరొందిన  ఫ్యూచర్‌ మ్యూజియానికి వినియోగించిన స్టీల్‌కు అతుకులు ఉన్నాయి. కానీ ఈ స్మారకానికి  మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 85000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.131 కోట్లతో గత ప్రభుత్వం దీన్ని నిర్మించింది. సందర్శకులు భవనంపై ఉన్న స్మారకజ్యోతి వరకు  వెళ్లేందుకు అవకాశం ఉంది. అక్కడే ఒక రెస్టరెంట్‌ను ఏర్పాటు చేయాలని భావించారు.  

ఇక భవనం రెండంతస్తుల్లో.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకునేలా గ్రౌండ్‌ఫ్లోర్‌లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రేక్షకులు  వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా  ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలను కూడా గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే  ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. మ్యూజియంలో  అక్కడక్కడా  కియోస్‌్కలు, టచ్‌్రస్కీన్‌లను ఏర్పాటు చేసి  వాటిద్వారా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రను, విశేషాలను భవిష్యత్‌తరాలకు  తెలియజేయాలని ప్రతిపాదించారు. పై అంతస్తులో కనీసం 600 మంది కూర్చొనేందుకు వీలైన కన్వెన్షన్‌ హాల్‌ కూడా ఉంది. సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువైన హాల్‌ ఇది. ఆర్ట్‌ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయవచ్చు. కాగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో స్మారక జ్యోతి అలంకారప్రాయంగానే  ఉండిపోయింది.

అంబేడ్కర్‌ మ్యూజియం తరహాలో ఏర్పాటు చేస్తే మేలు.. 
ప్రస్తుతం అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం వద్ద  పార్లమెంట్‌ ఆకృతిలో ఉన్న వేదిక భవనంలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇదే తరహాలో తెలంగాణ అమరుల స్మారకం వద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తే  తక్కువ వ్యవధిలోనే సందర్శకులను అనుమతించేందుకు అవకాశం లభిస్తుంది. మరోవైపు  ప్రభుత్వ సంస్థలకు ఆ బాధ్యతలను అప్పగించకుండా తెలంగాణ అమరుల స్మారకజ్యోతి, మ్యూజియం నిర్వహణకు స్వతంత్రంగా పని చేసే  ఒక సొసైటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని  పలువురు  ప్రతిపాదిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమరుల త్యాగాలను, జ్ఞాపకాలను భావితరాలకు అందజేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hussain Sagar
lumbini Park
Hyderabad
Telangana
BRS
museum
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.