జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్, ఢిల్లీ హైకోర్టు జడ్జి రాజీవ్ షక్దీర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేందర్‌కుమార్, చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈవో, చైర్మన్లు అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు.
ADVERTISEMENT
ADVERTISEMENT