Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘సుప్రీం’కు అసాధారణ అధికారం
ADVERTISEMENT 

‘సుప్రీం’కు అసాధారణ అధికారం

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 26, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sc.jpg

ఆర్టికల్‌ 142 అదే చెబుతోంది: ఒడిశా మాజీ సీజే జస్టిస్‌ మురళీధర్‌ 

హైబ్రిడ్‌ విధానం ఆశించదగిన శుభపరిణామం 

జడ్జీలకు క్షేత్రస్థాయి వాస్తవికతపై అవగాహన అవసరం... జడ్జీలు రాజకీయాల్లోకి రావడంపై లోతైన చర్చ జరగాలి 

లిటరరీ ఫెస్టివల్‌ చర్చలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారాలను ఇచ్చిందని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ పేర్కొన్నారు. తన ముందు పెండింగ్‌లోని ఏదైనా కేసులో సంపూర్ణ న్యాయం అందించేందుకు అవసరమైన ఏ ఉత్తర్వునైనా జారీ చేసే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందన్నారు. అయోధ్య వివాదం, భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులతోపాటు విడాకుల కేసుల్లో న్యాయస్థానం దీన్ని వినియోగించుకుందని చెప్పారు. 

కొన్ని సందర్భాల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో న్యాయవ్యవస్థ విఫలమైందంటూ అయోధ్య కేసును ప్రస్తావించారు. నేరం బహిరంగంగా జరిగినా బాధ్యత నిర్ధారణ, శిక్ష విధింపులో తీవ్రమైన జాప్యం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. న్యాయం చేయడమే కాదు, న్యాయ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా కోర్టులపై ఉందన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సెంటర్‌లో జరిగిన హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో ఆయన ‘(అ)సంపూర్ణ న్యాయం? 75 ఏళ్ల సుప్రీంకోర్టు’అనే పుస్తకంపై మాట్లాడారు. 

ప్రజాస్వామ్యంలో ‘సుప్రీం’పాత్రను చెబుతుంది.. 
రాజ్యాంగం అమల్లోకి వచి్చన 75 ఏళ్ల సందర్భంగా సుప్రీంకోర్టు పనితీరు, పాత్ర, సవాళ్లను ఇందులో ప్రస్తావించినట్లు జస్టిస్‌ మురళీధర్‌ చెప్పారు. పలు కేసుల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తన రాజ్యాంగ బాధ్యతలను ఎంత సమర్థవంతంగా నిర్వర్తించిందో తెలియజేయడానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రముఖుల వ్యాసాలు, ఇంటర్వ్యూలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు చెప్పారు. 

తీర్పుల ప్రస్తావనతోపాటు కొన్నిసార్లు అవసరమైన చర్య తీసుకోవడంలో విఫలమైందా.. లేదా.. అన్న సున్నిత విమర్శలు, ప్రశ్నలు కూడా ఇందులో ఉంటాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కోర్టు ప్రభావమే కాకుండా న్యాయ నియామకాల్లాంటి అంతర్గత, పరిపాలనా సవాళ్లను కూడా ఇందులోని వ్యాసాలు ప్రతిబింబిస్తాయన్నారు. సాయినాథ్, ప్రొఫెసర్‌ బక్షి, ప్రముఖ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, మీనాక్షి ఆరోరా లాంటి వారి రచనలను ఆయన ప్రస్తావించారు. 

న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు 
న్యాయ విద్యలో సమూల మార్పు రావాల్సి ఉందని జస్టిస్‌ మురళీధర్‌ చెప్పారు. జాతీయ స్థాయి విద్యాసంస్థలున్నా.. నాణ్యమైన వాదనలు వినిపించే నిపుణులైన న్యాయవాదులను అందించడం లేదన్నారు. సుదీర్ఘమైన వాదనలతో కాకుండా నాణ్యమైన వాదనలతో కోర్టు సమయం వృథా కాదని, సత్వర న్యాయానికి దోహదం చేస్తుందన్నారు. యువ న్యాయవాదులు దీన్ని అలవర్చుకోవాలన్నారు. 

హైబ్రిడ్‌ విచారణలు ఆశించదగిన పరిణామమని చెప్పారు. కొన్నిసార్లు బెంచ్‌ల మధ్య తీర్పుల్లో వ్యత్యాసం ఉండొచ్చంటూ తాజా ‘ఆరావళి’తీర్పును గుర్తుచేశారు. తీర్పులు నల్లేరుపై నడక కాదని, అయోధ్య, శబరిమల.. లాంటి కేసుల విచారణ సందర్భంగా న్యాయవ్యవస్థ రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు లోనైందన్నారు. 

న్యాయమూర్తులు స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లి విహరించలేరని, అయినా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కిందిస్థాయి కోర్టుల్లోనైనా స్థానిక భాషల్లో విచారణ కొనసాగాలని, కక్షిదారులకు తమ కేసు వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. జడ్జిలు రాజకీయాల్లో చేరడంపై లోతైన చర్చ అవసరమన్నారు. 

న్యాయ సంస్కరణలు అవసరం 
ఎలక్రో్టరల్‌ బాండ్లు, నోట్ల మారి్పడి, ఆర్టికల్‌ 370, పెగాసస్‌ స్పైవేర్‌.. లాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు అనుసరించిన తీరు సరికాదని జస్టిస్‌ మురళీధర్‌ అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు ఆలస్య తీర్పు కారణంగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. వేగవంతమైన విచారణ, బెయిల్‌ మంజూరు అంశాలను ప్రస్తావించిన ఆయన ట్రయల్‌ సత్వరం పూర్తి చేయాలని, దీని కోసం న్యాయ సంస్కరణలు తేవాలని నొక్కిచెప్పారు. 

సీరియస్, నాన్‌–సీరియస్‌ కేసులుగా విభజించుకుని కీలకమైనవి కాకుంటే వెంటనే తీర్పులివ్వాలన్నారు. అవినీతి అనేది అన్ని వ్యవస్థల్లో మాదిరి న్యాయ వ్యవస్థలోనూ ఉందని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ప్రత్యేక చట్టం చేయాలని సూచించారు. 1984లో మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మురళీధర్‌ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు మారారు. 2006లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2023లో పదవీ విరమణ చేశారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
muralidhar
hybrid
Supreme court of India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.