Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. అప్పాల తయారీ అదుర్స్‌!
ADVERTISEMENT 

అప్పాల తయారీ అదుర్స్‌!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 11, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
12.jpg

సాక్షి, పెద్దపల్లి: సంక్రాంతి పండుగ అనగానే పిండి వంటలు గుర్తుకొస్తాయి.. కానీ అప్పాలు అంటే సుల్తానాపూర్‌ గ్రామం గుర్తుకొస్తుంది. ఆ ఊరే అప్పాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఆ గ్రామస్తుల క్వాలిటీయే వారి బ్రాండ్‌. చూస్తేనే నోరూరించే పిండి వంటలు. ఒక్కఫోన్‌ చేస్తే చాలు.. ఎంచక్కా పిండివంటలు మన ఇంటికి వచ్చేస్తాయి. శుభకార్యాలకు కావాల్సిన సారెలో అందించే అన్నిరకాల పిండివంటలను తయారుచేసి తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఇతర దేశాలకూ సరఫరా చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ.. మరికొంతమందికి ఉపాధి ఇస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సుల్తానాపూర్‌ గ్రామానికి చెందిన మహిళలు.

మాకు చేసివ్వరా... 
పదిహేడేళ్ల క్రితం సుల్తానాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మి లీడర్‌గా పదిమంది సభ్యులతో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇంటివద్దే ఉంటూ చిన్న మొత్తాలతో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. పలురకాలుగా ఆలోచిస్తున్న సమయంలో గ్రూప్‌లోని ఒక సభ్యురాలి ఇంట్లో వివాహ వేడుకకు పెద్దమొత్తంలో అప్పాలు తయారు చేయాల్సి వచి్చంది. దీంతో తమ గ్రూప్‌ సభ్యుల సహకారంతో ఆ పెళ్లికి కావాల్సిన సారెను అందరూ కలిసి సరదాగా సిద్ధం చేశారు. దీంతో ఆ వేడుకకు వచి్చన బంధువులు ‘మా బిడ్డ సీమంతం ఉంది కొంచెం చేసి పెడతారా? మా కొడుకు, కోడలు అమెరికా వెళుతున్నారు.. 

అప్పాలు చేసి పెడతారా’అని అడగటంతో వారికి వీరు సైతం చేసిచ్చారు. అయితే ఊళ్లో ఉన్న మనకే సారె తయారు చేయడానికి ఇతరుల సహాయంతో చేయాల్సిన పరిస్థితి నెలకొందని, సిటీలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? వారు అప్పాలు పెద్దమొత్తంలో ఎలా తయారు చేసుకుంటారు? అనే ఆలోచన లక్ష్మికి తట్టింది. దీన్నే ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదని గ్రూప్‌ సభ్యులకు తెలిపింది. తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో కూడినది కావటంతో అందరూ సరేనన్నారు. దీంతో అప్పాలు చేయడం ఉపాధిగా మలుచుకొని లక్షణంగా లక్షలు సంపాదిస్తున్నారు.  

8 గ్రూప్‌లు.. 400 మంది వర్కర్లు
గ్రూప్‌నకు ఎటువంటి పేరు, బ్రాండ్‌ లేకపోయినా, క్వాలిటీతో మొదట తమ గ్రూప్‌ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులకు ఆర్డర్లపై అప్పాలు తయారు చేసి ఇచ్చేవారు. అలా నోటిమాటతో క్వాలిటీ నచ్చి ఆర్డర్లు పెరుగుతూపోయాయి. దాదాపు ఏడాదికి రూ.50 లక్షల పైనే ఆర్డర్లు వస్తుండటంతో అప్పాలు కాల్చడానికి, పిండి పిసకడానికి, సకినాలు చుట్టడానికి, ఇతరత్రా పనులకు రోజువారి వర్కర్ల సాయం తీసుకుంటూ వారికి కూడా ఉపాధి కల్పింపిస్తున్నారు. వీరిని చూసి గ్రామంలో మరో 8 సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో గ్రూప్‌లో పదిమంది సభ్యులతోపాటు, వారికి సాయం పనికి వచ్చే 50మంది వర్కర్లతో పాటు, పిండిగిరి్న, ట్రాలీ, కట్టెలు కొట్టేవారు తదితరులతో కలిసి దాదాపు 400 మందికిపైగా ఆ గ్రామంలో అప్పాలతో ఉపాధి పొందుతున్నారు.

బాహుబలి అప్పాలు.. 
32 వరుసలతో చక్రాల్లా సకినాలు, కిలో పరిమాణంలో లడ్డూ, గరిజ, బెల్లం అరిసెలు, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలు, గవ్వలు, ఖారా, ఇతరత్రా వంటకాలను పెద్దఎత్తున తయారు చేయడం వీరి ప్రత్యేకత.

ఆర్డర్‌పై విదేశాలకు 
మా గ్రామంలో 17 ఏళ్లుగా ఆర్డర్‌పై అప్పాలను తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్నాం. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ వంటి దేశాలు, తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు సైతం పంపిస్తున్నాం. ఏడాదిలో రూ.50లక్షలపైగా ఆర్డర్లు వస్తాయి. తయారు చేసి వారు కోరుకున్న సమయానికి  అందజేస్తాం.             
– తానిపత్తి లక్ష్మీదేవి, గ్రూప్‌ లీడర్‌

కలిసి పనిచేస్తాం 
మా బంధువులం అందరం కలిసి అప్పాలను తయారు చేస్తాం. ప్రతీ ఒక్కరికి రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు గిట్టుబాటు అవుతుంది. ఆర్డర్లు ఎక్కువ వస్తే ఇతర గ్రూప్‌లతో పంచుకుంటాం. 
అందరం కలిసి పనిచేసుకుంటూ పిల్లలను మంచిగా సెటిల్‌ చేశాం.                                         
– అలివేణి, సుల్తానాపూర్‌ 

ఆర్డర్లపై తయారీ 
మా గ్రూప్‌ ద్వారా ఆర్డర్లపై సుమారు 11 ఏళ్లుగా అప్పాలను తయారు చేస్తూ విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ నగరాలతోపాటు లండన్, అమెరికాకు పంపిస్తున్నాం. మా గ్రూపు సభ్యులకు ఉపాధి కల్పించటంతోపాటు ఇతరులకు సైతం ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 
– మాధవి, శ్రీరామ గ్రూప్‌ నిర్వాహకురాలు 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
women
Traditional
food
Foreign
sankranti festival
Sankranti 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

తలనొప్పి అని వెళితే.. స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు

తలనొప్పి అని వెళితే.. స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌  21 రోజుల్లోనే..

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌ 21 రోజుల్లోనే..

ఆ రోజుల్లో కూడా యోగా చేయొచ్చు!

ఆ రోజుల్లో కూడా యోగా చేయొచ్చు!

ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.