Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘మే’లో ఉత్తర రింగు పనులు!
ADVERTISEMENT 

‘మే’లో ఉత్తర రింగు పనులు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rrr.jpg

ఈ నెలాఖరుకు దాని బడ్జెట్‌ను ఆమోదించనున్న కేంద్ర పీపీపీఏసీ కమిటీ

ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ట్రిపుల్‌ఆర్‌ టెండర్లకు ఎట్టకేలకు మోక్షం    

సాక్షి, హైదరాబాద్‌: ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 162 కి.మీ. ఉత్తర రింగు నిర్మాణానికి ఈ నెలాఖరున బడ్జెట్‌ ఖరారు చేయబోతోంది. దీనికి కేంద్ర పబ్లిక్,ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ) ఈ నెలాఖరున ఆమోదముద్ర వేయనుంది. దీంతో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తించి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమవుతోంది. రింగు ఉత్తర భాగానికి దాదాపు రూ.18,600 కోట్లు అవసరమవుతాయని ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ బడ్జెట్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం టెండర్లను కూడా పిలిచారు. కానీ, బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవటంతో టెండర్లను తెరవలేకపోయారు. 

ఆరు నెలల్లో పనులు ప్రారంభం...
గత నెలలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ అప్రైజల్‌ అండ్‌ టెక్నికల్‌ స్క్రూటీ కమిటీ ఉత్తర రింగు సాంకేతిక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా కొన్ని చిన్నచిన్న మార్పులను సూచించింది. ఆ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ మార్పులు చేసి పీపీపీఏసీ ఆమోదం కోసం పంపింది. ఈ నెలాఖరున మరో ఎనిమిది రోడ్లతోపాటు దీనిపై కూడా చర్చించి ఆమోదముద్ర వేసేందుకు అంగీకరించింది. ఆర్థిక, ప్రణాళిక, న్యాయ శాఖల కార్యదర్శులతోపాటు నీతిఆయోగ్‌ ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు. వీరు ప్రాజెక్టు పూర్వాపరాలను పరిశీలించి బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయటంతో నిధుల కేటాయింపునకు మార్గం సుగమమవుతుంది.

నిధుల కేటాయింపు లేకుండా ప్రాజెక్టు టెండర్లు తెరవటం సాంకేతికంగా కుదరనందున ఇన్ని నెలలుగా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆరు నెలల క్రితమే టెండర్లు పిలిచినా, ఆ తర్వాత రోడ్డు నిర్మాణంలో కీలక మార్పు చోటుచేసుకుంది. తొలి విడతలో ఉత్తర భాగం రింగురోడ్డులో నాలుగు వరుసలను మాత్రమే నిర్మించాలని నిర్ణయించినందున, దానికే టెండర్లు పిలిచారు. కానీ, రోడ్డు నిర్మాణంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ... తొలి విడతలో ఒకేసారి ఆరు వరుసలు నిర్మించాలని సూచించింది.

దీంతో ఆ మేరకు టెండర్‌ డాక్యుమెంట్‌లో వివరాలు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్థిక పరమైన అంశాలకు ఆమోదం లభిస్తున్నందున.. దాఖలైన టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. అక్కడి నుంచి ఆరు నెలల గరిష్ట గడువు ఉంటుంది. మే నెలలో నిర్మాణ సంస్థ రోడ్డు పనులు ప్రారంభించనుంది. ఆరు ప్యాకేజీలుగా పనులు ప్రారంభమవుతాయి.

ఔటర్‌ రింగ్‌ రైలు.. దక్షిణ రింగులపై సందిగ్ధత    
రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగానికి 100 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం 2 వేల హెక్టార్ల భూమిని సేకరించారు. దానికి పరిహార చెల్లింపు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ వంద మీటర్లలోనే కొంత భాగాన్ని ప్రతిపాదిత ఔటర్‌ రింగు రైలు కోసం కేటాయించాలని రైల్వే శాఖ కోరింది. అలా చేస్తే..రింగురోడ్డుకు భూమి కొరత ఏర్పడి రోడ్డు డిజైన్‌ మొత్తాన్ని మార్చుకోవాల్సి వస్తుందని, అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినందున, రింగురైల్‌ కోసం విడిగా భూమిని సేకరించుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరోవైపు దక్షిణ రింగు భాగాన్ని కూడా ఉత్తర రింగుతోపాటే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దక్షిణ రింగు కోసం సొంతంగా ఓ అలైన్‌మెంట్‌ను కూడా ఖరారు చేసి కేంద్రానికి పంపింది. సాధారణంగా తన నిధులతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వమే అలైన్‌మెంట్‌ రూపొందించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అలైన్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోదు. దీంతో ఇప్పుడు దక్షిణ భాగానికి సంబంధించిన వ్యవహారం కొంత గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్‌మెంట్‌ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టత రాలేదు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
RRR
Regional Ring Road
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.