Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘డబుల్‌’ బాటకు బ్రేక్‌..
ADVERTISEMENT 

‘డబుల్‌’ బాటకు బ్రేక్‌..

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 21, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kishan_reddy.jpg

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌:  బీజేపీ ‘చలో బాటసింగారం’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, ఇతర నేతలను అరెస్టు చేసి వారు బాటసింగారం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, ఇతర నాయకులను వారి వారి నివాసాల్లోనే నిర్బంధంలో ఉంచారు. 

కాన్వాయ్‌కి డీసీఎం అడ్డుగా పెట్టి.. 

హైదరాబాద్‌ శివార్లలోని బాటసింగారంలో మధ్య లో నిలిపేసిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం పరిశీలించాలని కిషన్‌రెడ్డి నిర్ణయించారు. అక్కడే పేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని భావించారు. దీంతో బుధవారం రాత్రి నుంచే హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వివిధ స్థాయిల పార్టీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే వారిని, ఆఫీసు బాధ్యులను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులను కట్టడి చేశారు. ఈ

నేపథ్యంలో ఉదయాన్నే ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన కిషన్‌రెడ్డి నేరుగా బాటసింగారం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ సూచించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా రఘునందన్‌రావు ప్రశ్నించారు. అంతా కలిసి ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా బాట సింగారం వైపు బయలుదేరారు. అయితే పోలీసులు ఓర్‌ఆర్‌ఆర్‌ వద్దే కాన్వాయ్‌కి ఎదురుగా డీసీఎంను నిలిపి అడ్డుకున్నారు.  

నా చర్మం ఊడిపోతోంది.. 

మీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా 

పోలీసుల వైఖరికి నిరసనగా కిషన్‌రెడ్డి, ఇతర నేతలు రోడ్డుపై వర్షంలో తడుస్తూనే బైఠాయించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, పోలీసులకు సహకరించాలని పోలీసు కమిషనర్‌ చౌహాన్‌ విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో తనను రోడ్డు పైనుంచి లేపేందుకు ప్రయతి్నంచిన పోలీసులతో కేంద్రమంత్రి వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ చర్యలతో నా చర్మమంతా ఎరుపుగా మారి కమిలిపోయి ఊడి పోతోంది. మిమ్మల్ని లోక్‌సభ స్పీకర్‌ ముందు నిలబెడతా.. మీపై ఫిర్యాదు చేస్తా.. మీరు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి కట్టుబానిసల్లా పనిచేస్తున్నారు. నన్ను చంపుతారా?..చంపండి..ఇంటికి మాత్రం వెళ్లను..’ అంటూ కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే కేంద్రమంత్రిని బలవంతంగా ఆయన వాహనంలో కూర్చోబెట్టి పోలీసులే నడుపుతూ ఆరాంఘర్, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, మాసబ్‌ ట్యాంక్, ఎర్రమంజిల్, ఖైరతాబాద్‌ మీదుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. కాగా కిషన్‌రెడ్డి, ఇతర నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయం సమీపంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌ దిష్టి»ొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచి్చంది. పార్టీ పరంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది.  

ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం: ఈటల 

బీజేపీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్‌మెట్, బాటసింగారం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు వైపు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఎంపీ అరవింద్‌ను బంజారాహిల్స్‌లోని నివాసంలో, డీకే అరుణను జూబ్లీహిల్స్‌లోని నివాసంలో హౌస్‌ అరెస్టు చేశారు. ఈటలను శామీర్‌పేటలోని ఇంటి వద్దే అడ్డుకోగా, ఆయన కార్యకర్తలతో కలిసి అక్కడే ధర్నాకు కూర్చొన్నారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేంద్రమంత్రి హక్కులను భంగం కలిగించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి అప్పులు తీసుకుని, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన డబుల్‌ ఇళ్లను పేదలకు ఇంకా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం అని అన్నారు. తార్నాకలో రాంచందర్‌రావు, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
program
Police
Disrupted
Kishan Reddy
Double Bedroom Housing Scheme
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తాడిచర్ల కోల్‌-2 సింగరేణికి.. కిషన్‌రెడ్డి

తాడిచర్ల కోల్‌-2 సింగరేణికి.. కిషన్‌రెడ్డి

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

మెట్రోపై సానుకూలం

మెట్రోపై సానుకూలం

చర్చలు సానుకూలం.. సీఎం రేవంత్

చర్చలు సానుకూలం.. సీఎం రేవంత్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.