Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యేది అప్పుడే!
ADVERTISEMENT 

ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యేది అప్పుడే!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
flyover.jpg

సాక్షి, హైదరాబాద్‌: దారి పొడవునా గుంతలు.. ఎగసిపడే దుమ్ముధూళి.. దానికి తోడు ట్రాఫిక్‌.. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ రూట్‌. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం విషయంలో పోటాపోటీగా పోస్టర్లతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తడం.. జనాల ఫ్రస్టేషన్‌ తారా స్థాయికి చేరి సోషల్‌ మీడియాలోనూ అసహనం వెల్లగక్కడం చూశాం. అయితే అది ఎప్పటికి పూర్తవుతుందనేదానిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమారు స్పష్టత ఇచ్చారు. 

‘‘ఉప్పల్ దారిలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలు పెట్టాం.  5.5 కి.మీ గాను 1.5కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తైంది. మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తాం. ఉప్పల్ వరంగల్ మార్గంలో మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. రోడ్డు పనులు,ఎలివేటెడ్ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.


2026 దసరా నాటికి  ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేసి తీరుతాం. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మాణం ఆగే ప్రసక్తే లేదు’’ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఉప్పల్‌ వరంగల్‌ హైవేపై.. ఉప్పల్‌ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో  6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు. ఉప్పల్‌ జంక్షన్‌ నుంచి మేడిపల్లి సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ దాకా ఈ ఫ్లైఓవర్‌ వేయాలని భావించింది కేంద్రం.  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ..  2018 మేలో ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. అదే ఏడాది జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్‌ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నత్తనడకన సాగాయి. 

ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్‌ పనులు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కారిడార్‌ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అనడంతో ఆ రూట్‌లో ప్రయాణించేవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ రోడ్లకు రిపేర్‌తో పాటు ఫ్లైఓవర్‌ పనులూ చకచకా జరుగుతున్నాయి. ఈ కారిడార్‌లో NHAI (National Highways Authority of India) ప్రధాన నిర్మాణ బాధ్యత చేపట్టగా.. GHMC అదనంగా 200 మీటర్ల పొడిగింపు పనులు చూస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Uppal
Narapally
elevated corridor
Hyderabad
komatireddy venkat reddy
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.