Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పోలవరంపై ‘స్వతంత్ర’ అధ్యయనం
ADVERTISEMENT 

పోలవరంపై ‘స్వతంత్ర’ అధ్యయనం

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 9, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
polavaram.jpg

ఏపీ, తెలంగాణతో జరిగిన సమన్వయ సమావేశంలో పీపీఏ కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) మేరకు నీటిని నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై స్వతంత్ర నిపుణులతో అధ్యయనం చేయించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోయినా సమగ్ర సర్వే చేయిస్తామని పీపీఏ సీఈఓ అతుల్‌జైన్‌ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుతో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై మంగళవారం హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ అధికారులతో పీపీఏ నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

పోలవరం బ్యాక్‌వాటర్‌తో కిన్నెరసాని, మున్నేరువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై మాత్రమే అధ్యయనం చేయాలని ఎన్జీటీ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకే నిర్వహిస్తామని ఈ సమావేశంలో ఏపీ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ అధ్యయనాలు పూర్తయిన నేపథ్యంలో ముంపునకు గురికానున్న ప్రాంతాలను గుర్తించడానికి డీమార్కింగ్‌ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపు ప్రభావంపై సైతం ఏకకాలంలో అధ్యయనం చేయాలని సమావేశంలో తెలంగాణ పట్టుబడగా, ఏపీ నిరాకరించింది. 

పోలవరం బ్యాక్‌వాటర్‌ విషయంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఆందోళనలన్నింటినీ పరిష్కరించాలని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ ఎత్తిచూపింది. ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చిన నేపథ్యంలో దీనిపై ఉన్న కేసు మూసివేయాలని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ వేసిందని, ఇప్పుడు అధ్యయనం చేయకపోతే ఎలా అని ప్రశ్నించింది. 

దీంతో పీపీఏ సీఈఓ అతుల్‌జైన్‌ కలగజేసుకొని మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపు ప్రభావంపై పీపీఏ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణులతో అధ్యయనం చేయిస్తా మని ప్రకటించారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారు దల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్య ప్రసాద్, భద్రాచలం ఎస్‌ఈ రవికుమార్, ఏపీ తరఫున పోలవరం ప్రాజెక్టు సీఈ కె.నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవిభాగం సీఈ సుగుణాకర్‌ పాల్గొన్నారు. 

పోలవరం ఎత్తు కుదించాం..ఆందోళన వద్దు : ఏపీ
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 135 మీటర్లకు కుదించి తొలిదశ కింద పనులు నిర్వహిస్తున్నామని, ఈ పనులు పూర్తి కావడానికి ఇంకా రెండేళ్లు పడుతుందని ఏపీ అధికారులు తెలియజేశారు. రెండో దశ పనులను ఎప్పుడు ప్రారంభిస్తారో ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఈ నేపథ్యంలో 150 మీటర్ల గరిష్ట నీటిమట్టంతో ఉండనున్న ముంపు ప్రభావం విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని తెలంగాణకు సూచించారు. 

150 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిచ్చిన నేపథ్యంలో ఆ మేరకు నీటి నిల్వలతో ఉండనున్న ముంపు ప్రభావంపై సర్వే చేయాల్సిందేనని తెలంగాణ అధికారులు వాదించారు. పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముర్రెడువాగు, కిన్నెరసానితో పాటు మిగిలిన 5 వాగులు, భద్రాచలం పట్టణానికి ఉండనున్న ముంపు ప్రభావాన్ని నిర్థారించి రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

రెండు వాగులకు ఉన్న ముంపు ప్రభావాన్ని డీమార్కింగ్‌ చేసిన తర్వాత ఆ మేరకు భూసేకరణ నిర్వహించాలా? లేక రక్షణ చర్యలు తీసుకోవాలా? అని ఏపీ అధికారులు ఈ సమావేశంలో తెలంగాణ అధికారులను ప్రశ్నించారు. సర్వే నివేదిక అందిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అధికారులు బదులిచ్చారు. 

బనకచర్ల ప్రాజెక్టుపై మళ్లీ అభ్యంతరం తెలిపిన తెలంగాణ
పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా గోదావరి–బనక చర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టుతున్నారని ఈ సమా వేశంలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో పీపీఏకి ఎలాంటి సంబంధం లేదని సీఈఓ స్పష్టం చేయగా, గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పునకు అనుగణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిన బాధ్యత పీపీఏపై ఉందని తెలంగాణ అధికారులు గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌ తీర్పును ఉల్లంఘించి నిర్మాణాలు చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పీపీఏపై ఉందని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా జిల్లాల తాగునీటి అవసరాల పేరుతో పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి 18 టీఎంసీలను తరలించడానికి ఏపీ అక్రమ ప్రాజెక్టును చేపట్టిందని సమావేశంలో తెలంగాణ అభ్యంతరం తెలిపింది. దీనిని అడ్డుకోవాలని పీపీఏని కోరింది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
Polavaram Project
study
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.