Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రైలు ప్ర‌మాదాల‌కు చెక్‌.. కవచ్‌ 4.0 ట్రయల్స్‌ షురూ
ADVERTISEMENT 

రైలు ప్ర‌మాదాల‌కు చెక్‌.. కవచ్‌ 4.0 ట్రయల్స్‌ షురూ

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kavach-4.0.jpg

మళ్లీ దక్షిణ మధ్య రైల్వే పరిధి ప్రాంతాలే ఎంపిక

రఘునాథ్‌పల్లి–మౌలాలీ, సనత్‌నగర్‌–వికారాబాద్‌ సెక్షన్లలో ట్రయల్స్‌ 

వాటి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు 

జోన్‌ పరిధిలో 4,655 రూట్‌ కి.మీ.లో ఏర్పాటుకు అనుమతి 

సాక్షి, హైదరాబాద్‌: పరస్పరం రైళ్లు ఢీకొనకుండా నిరోధించేందుకు సాంత పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రైల్వే రూపొందించిన కవచ్‌ సాంకేతిక తదుపరి వెర్షన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కవచ్‌ 3.2 వెర్షన్‌ ఉండగా, ఇటీవల 4.0 వెర్షన్‌ను రూపొందించారు. రైల్వే అనుబంధ సంస్థ రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌ఓ) అభివృద్ధి చేసిన ఈ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ ట్రయల్స్‌కూ దక్షిణ మధ్య రైల్వే పరిధినే ఎంపిక చేయటం విశేషం. సనత్‌నగర్‌–వికారాబాద్‌–వాడీ సెక్షన్‌ను కవచ్‌ 3.2 వెర్షన్‌ ప్రయోగాలు, ట్రయల్స్‌కు ఎంపిక చేయగా, ఇప్పుడు ఆధునిక వెర్షన్‌ కోసం సనత్‌నగర్‌–వికారాబాద్, రఘునాథ్‌పల్లి–మౌలాలీ సెక్షన్‌లను ఎంపిక చేశారు. ఈ ట్రయల్స్‌ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

దక్షిణ మధ్య రైల్వే (south central railway) జోన్‌ పరిధిలో 6,600 రూట్‌ కి.మీ.కు గాను 4,655 కి.మీ.లలో కవచ్‌ 4.0 ఏర్పాటుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే జోన్‌ పరిధిలో 1465 కి.మీ. మేర కవచ్‌ 3.2 వెర్షన్‌ ఏర్పాటై ఉంది. ఇప్పుడు దీన్ని కొత్త వెర్షన్‌తో అప్‌గ్రేడ్‌ చేయటంతోపాటు మిగతా ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది. 4.0 వెర్షన్‌ ప్రయోగాల కోసం ఎంపిక చేసిన సనత్‌నగర్‌–వికారాబాద్‌ సెక్షన్‌లో 63 కి.మీ. మేర పాత వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ పరిధిలో కొత్త వెర్షన్‌ ట్రయల్స్‌ మొదలయ్యాయి. రఘునాథ్‌పల్లి– మౌలాలీ సెక్షన్‌ పరిధిలో పాత వెర్షన్‌ లేదు. ఇప్పుడు ఈ సెక్షన్‌ పరిధిలోని 86 కి.మీ.లో కొత్త వెర్షన్‌ ఏర్పాటు చేసి ట్రయల్స్‌ ప్రారంభించారు.

కొత్త వెర్షన్‌ సరే.. ఈ జాప్యమేంటి? 
కవచ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పుష్కర కాలంగా కవచ్‌ వ్యవస్థపై ట్రయల్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయోగాల కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏర్పాటు చేసిన 1,465 కి.మీ. తప్ప దేశంలో మిగతా చోట్ల దీన్ని ఏర్పాటు చేయలేదు. ఈలోపు కవచ్‌ 4.0 (Kavach 4.0) ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ ప్రయోగాలు, ట్రయల్స్‌తో మళ్లీ జాప్యం తప్పేలా కనిపించటం లేదు. కవచ్‌ 4.0 వెర్షన్‌ కోసం బల్లార్షా – కాజీపేట – విజయవాడ, విజయవాడ – గూడూరు, విజయవాడ – దువ్వాడ, వాడి–గుంతకల్‌–ఎర్రగుంట్ల–రేణిగుంట (Renigunta) సెక్షన్లకు సంబంధించి 1,618 కి.మీ.కు టెండర్లు పిలిచారు.

కొత్త వెర్షన్‌లో రైలును మరింత వేగంగా, తక్కువ నిడివిలో సురక్షితంగా బ్రేక్‌ వేసి ఆపే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పాత దానిలో సంప్రదాయ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఉండగా, కొత్త దాంట్లో ఇంటెలిజెంట్, డైనమిక్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ వాడుతున్నారు. 4.0లో గ్రాఫికల్‌ ఇంటర్‌ఫేస్‌తో, డ్రైవర్‌కు క్లియర్‌ విజువల్, అథెంటికేటెడ్‌ అలర్ట్స్‌ ఇవ్వగలదు. దీన్ని హ్యాక్‌ చేయటం అంత సులువు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వినియోగంలో ఉన్న యాంటీ కొలిజన్‌ సిస్టమ్స్‌ సరసన నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్‌ బూమ్‌- 1,48 గ‌జాలు.. రూ.33 కోట్లు   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
train
safety
trial run
South Central Railway
moula ali
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మళ్లీ రైల్లో దోపిడీ! అదే రూట్.. అదే దొంగలు!

మళ్లీ రైల్లో దోపిడీ! అదే రూట్.. అదే దొంగలు!

కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలులో భారీ దోపిడీ

కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలులో భారీ దోపిడీ

రైలు ఢీకొని నలుగురు దుర్మరణం ఎక్కడంటే..!

రైలు ఢీకొని నలుగురు దుర్మరణం ఎక్కడంటే..!

యుద్ధం తెచ్చిన తీపి జ్ఞాపకం.. రైలునే మ్యూజియంగా మార్పు!

యుద్ధం తెచ్చిన తీపి జ్ఞాపకం.. రైలునే మ్యూజియంగా మార్పు!

ఎండాకాలం వేళ రైళ్లలో ప్రయాణం చాలా ఈజీ

ఎండాకాలం వేళ రైళ్లలో ప్రయాణం చాలా ఈజీ

ఉదయం ఐదింటికే మెట్రో మొదలుపెట్టేదెలా?

ఉదయం ఐదింటికే మెట్రో మొదలుపెట్టేదెలా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.