Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. వేళకాని వేళల్లో.. ఆహారంతో అనర్థం..
ADVERTISEMENT 

వేళకాని వేళల్లో.. ఆహారంతో అనర్థం..

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 17, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
FOOD.jpg

ఊబకాయంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం 

కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా ఓ బయలాజికల్‌ క్లాక్‌ 

‘ఆకలి’కి సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందంటున్న తాజా అధ్యయనం 

యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా శాస్త్రవేత్తల వెల్లడి

షిఫ్టుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులూ, అడపాదడపా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారంతా వేళకాని వేళల్లో ఆహారం తీసుకోవడం చాలా సాధారణం. అయితే ఓ అధ్యయనం ప్రకారం ఇలాంటివారిలో ఊబకాయంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది.  జీర్ణాశయానికి, మెదడుకూ మధ్య సమాచార సమన్వయాలు జరుగుతున్న విషయాలు అనేక అధ్యయనాల్లో వెలుగు చూశాయి.

కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా బయటకు కనపడని కమ్యూనికేషన్స్‌ ఉంటాయని ఈ సరికొత్త అధ్యయనం తేల్చిచెబుతోంది. యూఎస్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలోని పెరల్మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాల పరిశోధనల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి.     – సాక్షి, హైదరాబాద్‌

కాలేయానికి, మెదడుకు మధ్య కూడా ‘క్లాక్‌’లింకు పట్టపగలు పనిచేయడంతోపాటు రాత్రివేళల్లో నిద్రపోయేలా మెదడులోని బయలాజికల్‌ క్లాక్‌ నిర్దేశిస్తుందని, దీన్నే సర్కేడియన్‌ రిథమ్‌గా చెబుతారన్న విషయం తెలిసిందే. తాజాగా పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం.. కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా ఓ బయలాజికల్‌ క్లాక్‌ ఉంటుంది. ఆకలి వేసినప్పుడూ, ఏం తినాలన్నది నిర్ణయం తీసుకునేటప్పుడూ వేగస్‌ నర్వ్‌ ద్వారా కాలేయం నుంచి మెదడుకూ, మెదడు నుంచి మళ్లీ కాలేయానికి సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది.

దాన్నిబట్టే ఓ వ్యక్తి తానెప్పుడు తినాలి? తినేటప్పుడు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేసుకోవాలి వంటివి జరుగుతుంటాయి. ఈ కాలే య, మెదడు క్లాక్‌ సమాచారాల రిథమ్‌లో ఏదైనా తేడా వస్తే.. అది జీవక్రియల్లో అంతరాయాలకు దారితీస్తుందని, దాంతో బరువు పెరగడం, అది అనేక ఆరోగ్య సమస్యలకు తావివ్వడం,అవి మరికొన్ని అనారోగ్యాలకు దారితీయ డం.. ఇలా ఒక దానివెంట మరొక సమస్యకు దారితీస్తుంటాయి. 

ఎలుకల కాలేయంలోని ‘రెవ్‌–ఎర్బ్స్‌’అనే కుటుంబానికి చెందిన జన్యువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దేహంలోని సర్కేడియమ్‌ రిథమ్‌ను నిర్దేశించే బయలాజికల్‌ క్లాక్‌ నిర్వహణలో ఈ జన్యువులు కీలక భూమిక పోషిస్తాయి. రకరకాల జీవక్రియలు, హార్మోన్లు వెలువడేలా చూడటం వంటి అనేక వాటిలో అవి పాలు పంచుకుంటుంటాయి.  

ఎలుకలు, మనుషుల జీవక్రియల పరిశీలన 
ఈ అధ్యయనంలో పాల్గొన్న ముఖ్యుల్లో ఒకరూ అలాగే పెన్‌ మెడిసిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డయాబెటిస్, ఒబిసిటీ అండ్‌ మెటబాలిజమ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మిచెల్‌ లాజర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలుకలూ, మనుషులూ మెలకువతో ఉన్నప్పుడు తినే జీవులు కాబట్టి ఈ రెండు శరీరాల్లో జీవక్రియల పనితీరు పరిశీలించినప్పుడు కాలేయానికి, మెదడుకూ మధ్య ఉండే నిర్దేశిత సమాచారాల గురించిన వివరాలు తెలిశాయి. ఎలుకల్లో ఉండే ‘రెవ్‌–ఎర్బ్స్‌’జన్యువులకు మెదడుతో ఉన్న కనెక్షన్‌ తొలగించినప్పుడు ఎలుకలు తాము చురుగ్గా లేని సమయంలోనూ ఇష్టం వచ్చినట్టుగా

తినడం, అవసరమైన దానికంటే ఎక్కువగా తినేయడం మొదలుపెట్టాయి. ఈ తిండి ఎలా ఉందంటే... అచ్చం రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు ఆకలితో నిమిత్తం లేకుండా మామూలు కంటే ఎక్కువగానే తినేయడంలా అనిపించింది. ఇంకా ఇదెలా ఉందంటే.. జెట్‌లాగ్‌ తర్వాత బయలాజికల్‌ క్లాక్‌లో అంతరాయం కలగడంతో వేళాపాళా లేకుండా ఇష్టమొచ్చి నట్టు తినేయడంలా కనిపించింది.  

వేగస్‌ నర్వ్‌ ద్వారా సమాచార మార్పిడి 
ఎప్పుడు, ఎలా తినాలి అనే ఈ సమాచారాల ఇచ్చిపుచ్చుకోడాలు వేగస్‌ నర్వ్‌ అనే ఓ కీలక నరానికి చెందిన అత్యంత సంక్లిష్టమైన నర్వ్‌ ఫైబర్స్‌ ద్వారా జరుగుతుంటుంది. ఎప్పుడు ఆకలిగా అనిపించాలి, ఎప్పుడు ఎంత మొత్తంలో తినాలనే ఆదేశాలు కాలే యం ఈ నరం ద్వారానే మెదడుకు చేరవేస్తుంది. దాని ప్రకారమే మనుషులకూ లేదా జీవాలకు ఎప్పుడు ఆకలి వేయాలో అప్పుడు ఆకలిగా అనిపించడం, దాన్ని బట్టి ఎంత తినాలో అంత తినేశాక ఆకలి తీరడం వంటివన్నీ సర్కేడియన్‌ రిథమ్‌కు అనుగుణంగా జరుగుతుంటాయి. 


డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం 
ప్రస్తుతం పనివేళల్లో గణనీయమైన మార్పులు రావడం, అర్ధరాత్రి, అపరాత్రీ అనే తేడాలు లేకుండా పనులు చేయాల్సి రావడం దుష్ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, రక్తంలో కొలెస్టరాల్‌ మోతాదులు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. చివరకు ఇవన్నీ టైప్‌–2 డయాబెటిస్, గుండెజబ్బులూ, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తున్నాయని డాక్టర్‌ మిచెల్‌ లాజర్‌ చెబుతున్నారు. 

మనదేశంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌–ఇండియా డయాబెటిస్‌ (ఐసీఎమ్‌ఆర్‌–ఇండియాబ్‌) నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం భారత్‌లో 10.1 కోట్ల డయాబెటిస్‌ బాధితులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది డయాబెటిస్‌ బాధితులు ఉండగా... అందులో 10.1 కోట్ల మంది కేవలం మన దేశం నుంచే ఉన్నారు. అంటే ప్రపంచంలోని ప్రతి 8 మంది డయాబెటిస్‌ బాధితుల్లో ఒకరు భారత్‌వాసి అన్నమాట. 

మన భారతీయ గణాంకాలను యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా పరిశోధనల ఫలితాలతో అనుసంధానించి చూస్తే నిద్రపోవాల్సిన సమయంలో పనిచేస్తూ, వేళగాని వేళల్లో భోజనం చేస్తున్నవారిలో ఈ జీవక్రియలకు సంబంధించిన జబ్బులైన డయాబెటిస్‌ వంటివి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా... ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన చికిత్స ప్రణాళికల ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతోంది. ఉదాహరణకు చాలా ఊబకాయంతో ఉన్న ఎలుకల తాలూకు వేగస్‌ నర్వ్‌ను కట్‌ చేసినప్పుడు... మళ్లీ అవి నార్మల్‌ ఎలుకల్లాగే తినడం, మితంగానే ఆహారం తీసుకోవడం వంటివి చేశాయి.

ఈ పరిశోధనతో ఎంతో మేలు
దేహం తాలూకు ఓ పూర్తిస్థాయి సమన్వయ వ్యవస్థ (హోమియోస్టాటస్‌) అంతా చక్కగా కొనసాగుతూ జీవక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూడటానికి కాలేయం తాలూకు ఏఏ అంశాలు, ఏఏ జన్యువులు పాలుపంచుకుంటున్నాయో పరిశీలించి, ఆ  వ్యవస్థల కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాలూ, దాంతో వచ్చే అనర్థాలూ, అనారోగ్యాలకు అవసరమైన చికిత్సలను తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందన్నది పరిశోధకుల అభిప్రాయం. ఈ పరిశీలనల వెలుగులో ప్రజల ఆరోగ్య సంరక్షణలకు అసరమైన చర్యలూ, ప్రణాళికలు రూపొందింవచ్చన్నది అనేక ఆరోగ్య సంస్థలకు చెందిన అధికారులు, ప్రణాళికావేత్తల భావన.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
food
health issues
study
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.