Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పింఛన్లపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ADVERTISEMENT 

పింఛన్లపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 19, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kamnc.jpg

సామాజిక పెన్షనర్లలో ఎంతమంది బతికి ఉన్నారో లెక్క తేల్చనున్న సర్కారు

లక్షలాది మంది చనిపోయినా ఇంకా పెన్షన్లు వెళ్తున్న వైనం

ప్రతి పింఛనుదారుడి ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ ప్రక్రియ చేపట్టే యోచన

నిజమైన లబి్ధదారులను తేలిస్తేనే పథకం విస్తరణకు చాన్స్‌ ఉంటుందన్న సీఎం

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ‘ఆధార్‌ డేటా’పైనా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తామని వెల్లడి

 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సామాజిక పింఛన్లపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్షలాది మంది పెన్షన్‌దారులు మరణించినా వారి పేరిట ఇంకా పింఛన్లు వెళుతున్న నేపథ్యంలో..పెన్షనర్లలో వాస్తవంగా ఎంతమంది బతికి ఉన్నారనే కచి్చతమైన లెక్క తేల్చడానికి ఫోరె న్సిక్‌ ఆడిట్‌ నిర్వహించనున్నారు.

ఇందుకోసం ప్రతి పెన్షన్‌ లబ్ధిదారుడి ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ (ముఖ గుర్తింపు) ప్రక్రియ చేపట్టనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించాలన్న నిర్ణయం అమలుకు ఇది కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో పలు అంశాలపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

నిజమైన లబ్ధిదారులను తేలుస్తాం..
‘పెన్షనర్లు మరణించినా సరే వారి పేరుతో ఎవరు లబ్ధి పొందుతున్నారో తేలుస్తాం. నిజమైన లబి్ధదారులను కచ్చితంగా తేలిస్తేనే.. పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి, మరింత మందికి విస్తరింప జేయడానికి అవకాశం ఏర్పడుతుంది. 

మరోవైపు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు సంబంధించి అందరూ ఆధార్‌ కార్డు తప్పనిసరిగా జత చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో..లేని ఉద్యోగాలకు కొందరు తప్పుడు ఆధార్‌ కార్డులు ఇచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

ఇలా తప్పుడు ఆధార్‌ కార్డుల ఆధారంగా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్టు చూపిస్తున్నారా? ప్రభుత్వం నుంచి ప్రతినెలా వారి బ్యాంకు ఖాతాలోకి వేతనం వెళ్తోందా? లేదా..అసలు ఉద్యోగులే లేకుండా వేతనాలు తీసుకుంటున్నారా? అనే అంశాలకు సంబంధించిన ఐదేళ్ల డేటాపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించి.. ఆ విధంగా వేతనాలు తీసుకున్న వారి నుంచి రికవరీ యాక్టు కింద వసూలు చేస్తాం. అలా చెల్లించలేని వారు జైలుకు వెళ్లక తప్పదు. 10 మంది పని చేయాల్సిన చోట ఐదుగురితోనే పనులు కానిచ్చి 10 మందికి చెందిన వేతనాలు తీసుకుంటున్నారు.

ఇలా ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయడం వల్ల వాస్తవాలు బయటకు వస్తాయి. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు తేలితే వారిపై కూడా చర్యలు తప్పవు..’అని సీఎం హెచ్చరించారు.

నైట్‌ సఫారీకి గ్లోబల్‌ బిడ్డింగ్‌
‘ఫ్యూచర్‌ సిటీలోని 30 వేల ఎకరాల్లో 14 వేల ఎకరాలు దాదాపు అర్బన్‌ ఫారెస్ట్‌ ఉంటుంది. ఇందులోనే దాదాపు 3 వేల ఎకరాల్లో నైట్‌ సఫారీని ఏర్పాటు చేయనున్నాం. అటవీ, పర్యాటక శాఖలు దీనిని అభివృద్ధి చేయడానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తాయి. అన్ని రకాల వన్య ప్రాణులను తీసుకొచ్చి ఈ నైట్‌ సఫారీ ఏర్పాటు చేస్తారు. వంతారా సంస్థ కూడా ఆసక్తి కనపర్చింది.

అయితే గ్లోబల్‌ బిడ్డింగ్‌ల ద్వారా వచ్చే సంస్థకు ఆ బాధ్యతను అప్పగిస్తాం. వారు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు దానిని నిర్వహిస్తూ.. సందర్శకుల నుంచి టికెట్‌ రూపంలో డబ్బులు వసూలు చేస్తారు. వంతారా పాల్గొంటుందా లేదా? చూడాలి. అయితే ఈ భూమిని ఎవరికో నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వడం కుదరదు. అలా చేస్తే జైలుకు వెళ్లాల్సిందే..’అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

స్టేడియంలు, గేమింగ్, ఫిలిం సిటీలు

‘నైట్‌ సఫారీ చుట్టుపక్కల స్టేడియంలు, గేమింగ్‌ సిటీ, ఫిలిం సిటీ, ఈవీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లు, జీనోమ్‌ వ్యాలీ తరహాలోనే ఆరెంజ్‌ ఫార్మాసూటికల్స్‌ వంటివి ఏర్పాటు అ వుతాయి. జపాన్‌ ఇండ్రస్టియల్‌ క్లస్టర్‌ను తయారు చేస్తామని మర్బోనీ సంస్థ ముందుకు వచి్చంది. మొత్తం ఫ్యూచర్‌ సిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి సింగపూర్‌ సంస్థ డీపీఆర్‌ సిద్ధం చేస్తోంది. అందుకు అనుగుణంగా గ్లోబల్‌ బిడ్డింగ్‌ ద్వారా వచ్చే సంస్థలకు వాటిని కేటాయిస్తాం.

మెస్సీ మ్యాచ్‌కు రూపాయి కూడా ఇవ్వలేదు..
ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయలేదు. వారు స్పాన్సర్లను పెట్టుకుని ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేసుకున్నారు. నేను ఆహ్వానితుడిగానే అక్కడకు వెళ్లా. (సింగరేణి సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది కదా అంటే..) సింగరేణి కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీ కింద స్పాన్సర్‌ చేసింది. 

అందుకే దాని క్రీడాకారులు సింగరేణి ఎంబ్లమ్‌ ఉన్న జెర్సీలు ధరించారు. మెస్సీ గ్రూపును అపర్ణా సంస్థ స్పాన్సర్‌ చేయడం వల్ల వారు వాళ్ల జెర్సీలు ధరించారు. నా మనవడిని క్రీడాకారునిగా చేయాలనే అక్కడకు తీసుకెళ్లా. కేసీఆర్‌ మనవడి మాదిరిగా పబ్‌లకు పంపలేదు..’అని సీఎం అన్నారు.

విమానాశ్రయం కేంద్రంగానే అభివృద్ధి
‘భవిష్యత్తు అభివృద్ధి అంతా విమానాశ్రయం కేంద్రంగానే జరుగుతుంది. ఆ ప్రాంతంలోనే భూమి అందుబాటులో ఉన్నందున అటువైపు వేగంగా అభివృద్ధి సా ధ్యమవుతుంది. ఇప్పటికే ఫ్యూచర్‌ సిటీ పనులు ప్రారంభమయ్యాయి. రహదారుల నిర్మాణం జరుగుతోంది. రెండుమూడు సంవత్సరాల్లోనే రూపురేఖలు మారిపోతాయి. హిల్ట్‌ పి విధానానికి సంబంధించిన లీక్‌లపై ఇంకా నివేదిక రాలేదు..’అని రేవంత్‌ తెలిపారు.

కేటీఆర్‌ హయాంలో ఒక్క ఎన్నికలోనూ గెలవలేదు..
‘కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ బీఆర్‌ఎస్‌ గెలవలేదు. కేటీఆర్‌ హయాంలో విజయాలు లేవంటూ ఆయన్ను తప్పించాలని హరీశ్‌రావు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నది వాస్తవం కాదా? కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌ పోటీ పడుతున్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకత్వం కోసం పోటీ జరుగుతోంది. (కవిత కూడా సీఎం అవుతానని అంటున్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ..) మధుకోడా కూడా సీఎం అయ్యారు.. ఎవరైనా సీఎం కావొచ్చు..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్‌ రేసు కేసులో ప్రభుత్వం ప్రొసీజర్‌ ప్రకారమే నడుచుకుంటుందన్నారు. అరవింద్‌ కుమార్‌ విచారణకు డీవోపీటీ అనుమతి కోసం ఇప్పటికే రెండుసార్లు లేఖ రాశామని తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
audit
Pensions
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.