Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Hyderabad: సీసీ కెమెరాల పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ
ADVERTISEMENT 

Hyderabad: సీసీ కెమెరాల పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CCTV-Feed.jpg

నెల నుంచి ఏడు రోజులకే పరిమితమైన వైనం

అనేక కేసుల దర్యాప్తులో ఇదే ప్రధాన అడ్డంకి

‘ఆ రెండు’ రకాల వాటిపై ఆశలు పెట్టకోవద్దు 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉగ్రవాద పదఘట్టనలు వినిపిస్తున్నాయి.. కొన్నింటి ఛాయలు నగరంలోనూ కనిపిస్తున్నాయి.. పోలీసులు, నిఘా వర్గాలు అనునిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయి... హైదరాబాద్‌ నగరానికి సాఫ్ట్‌ టార్గెట్‌ అనే పేరు ఎలానూ ఉంది... ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పోలీసు విభాగానికి సీసీ కెమెరాల ఫీడ్‌ స్టోరేజ్‌ బ్యాకప్‌ సామర్థ్యం తగ్గడం కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలకు సంబంధించిన ఫీడ్‌ గతంలో నెల రోజుల పాటు సర్వర్‌ బ్యాకప్‌ ఉండేది. ఇది ప్రస్తుతం వారానికి తగ్గడం అనేక సమస్యల్ని తెచ్చిపెడుతోంది. 

పట్టించుకోని ఉన్నతాధికారులు  
ఇటీవల కాలంలో పోలీసింగ్‌ పూర్తిగా మారిపోయింది. క్షేత్రస్థాయి నిఘాను వదిలేసిన అధికారులు సాకేంతిక అంశాలపై ఆధారపడిపోయారు. ఈ కారణంగానే ఎక్కడ, ఏ నేరం జరిగినా దర్యాప్తు అధికారుల దృష్టి నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్, ఘటనాస్థలితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలపై ఉంటోంది. కేవలం సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి వచి్చన కేసులు అనేకం ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఏటా పోలీసులు పట్టుకుంటున్న నేరగాళ్లు, నిందితుల్లో 70 నుంచి 80 శాతం మందిని గుర్తించడానికి సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడే ఆధారం అవుతోంది. ఆయా కేసుల్లో పరోక్షంగా సెల్‌ఫోన్‌ వివరాలు సైతం ఉపకరించినా... ప్రధానంగా సీసీ కెమెరాల ఫీడే ఉపకరిస్తోంది.  

పని చేయని పాసివ్‌ బ్యాకప్‌... 
నగరంలోని సీసీ కెమెరాల పరిస్థితి ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా మారింది. సీసీ కెమెరాల సంఖ్యలో దేశంలో ప్రథమ స్థానం, ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే చెప్పుకోదగ్గ స్థానంలో ఉన్నామని అనేక సర్వేలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం నగర వ్యాప్తంగా మూడు రకాల కెమెరాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటితో పాటు స్థానికంగా వ్యాపారులు, సంఘాలు పెట్టిన కమ్యూనిటీ కెమెరాలు, ఎవరికి వారుగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసిన ‘నేను సైతం’ ప్రాజెక్టు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఉన్నవి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు. తొలినాళ్లల్లో వీటి ఫీడ్‌కు 30 రోజుల బ్యాకప్‌ సదుపాయం కల్పించారు. వారం రోజులు యాక్టివ్‌ విధానంలో నేరుగా, మరో 23 రోజుల ఫీడ్‌ పాసివ్‌ విధానంలో అంతర్గతంగా భద్రపరిచే వారు.  

వాటిపై పూర్తిగా ఆధారపడలేం.. 
దర్యాప్తు అధికారులు యాక్టివ్‌ ఫీడ్‌ను తక్షణం, పాసివ్‌ ఫీడ్‌ను టెక్నికల్‌ వ్యక్తుల సహకారంతో తీసుకునే అవకాశం కల్పించారు. అయితే కొన్నాళ్లుగా సర్వర్‌లో ఉండే పాసివ్‌ ఫీడ్‌ దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రావట్లేదు. దీంతో కేవలం యాక్టివ్‌ ఫీడ్‌గా భావించే ఏడు రోజుల బ్యాకప్‌పైనే ఆధారపడుతున్నారు. ఏదైనా నేరం వెలుగులోకి రావడానికి వారం కంటే ఎక్కవ సమయం పడితే మాత్రం ప్రభుత్వ కెమెరాల నుంచి ఆధారాలు సేకరించడం సాధ్యం కాదు. కమ్యూనిటీ, నేను సైతం కెమెరాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇవి కీలక ప్రాంతాల్లో లేకపోవడం, ఉన్న వాటిలోనూ అత్యధికం మరమ్మతులకు గురి కావడంతో ఫీడ్‌ లభించే వరకు గ్యారంటీ లేదు. ఈ కారణంగానే కొన్ని కేసులు కొలిక్కి రాకుండా మిగిలిపోతున్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయం దృష్టి పెట్టి, బ్యాకప్‌ కనీసం 30 రోజులు కచి్చతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులు కోరుతున్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
cctv
Feed
back up
issues
Hyderabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.