Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. యువతను విస్మరిస్తే ఉద్యమాలు
ADVERTISEMENT 

యువతను విస్మరిస్తే ఉద్యమాలు

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
KTR.jpg

యువత ఆకాంక్షలను పాలకులు పట్టించుకోవాలి 

పాక్‌తో కాదు..  పశ్చిమ దేశాలతో పోటీపడాలి 

మందిరం, మసీదు కాదు.. మౌలిక వసతులే ముఖ్యం 

తెలంగాణలో రీకాల్, రీగ్రెట్, రివోల్ట్‌ నడుస్తోంది 

ఎన్డీటీవీ యువ –2025లో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: యువత ఆకాంక్షలను విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని అంటుతుండగా పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ మందిర్‌– మస్జిద్‌ పేరిట ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని మండిపడ్డారు.

ముంబైలో శనివారం సాయంత్రం జరిగిన ‘ఎన్డీటీవీ యువ 2025’సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. ‘దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రధాని మోదీ గాలికొదిలేశారు. చైనా, జపాన్‌తోపాటు అమెరికా వంటి పశ్చిమ దేశాలను అధిగమించే ప్రయత్నం చేయకుండా మనకంటే వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదు’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

జెన్‌ జీ శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు 
‘ప్రస్తుత తరం యువత (జెన్‌–జీ) కేవలం డిజిటల్‌ మీడియాకే పరిమితం కాకుండా సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలి. జెన్‌ జీ శక్తిని పాలకులు తక్కువగా అంచనా వేయొద్దు. తెలంగాణలో 400 ఎకరాల అటవీ భూమిని అమ్మే ప్రభుత్వ ప్రయత్నాలు సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటంతో నిలిచిపోయింది. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే యువత రాజకీయాల్లోకి వచ్చి భవిష్యత్తు నిర్ణేతలు కావాలి. దేశంలోని యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అణుబాంబు దాడితో సర్వనాశనమైన జపాన్‌ కేవలం 23 ఏళ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించింది’అని కేటీఆర్‌ గుర్తు చేశారు. 

పదేళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ 
‘గడిచిన పదేళ్లలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతోపాటు అమెజాన్‌¯ అతిపెద్ద క్యాంపస్, అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ టీ హబ్‌ వంటివి తెలంగాణలో సాధ్యమయ్యాయి. ఇదే రీతిలో మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయింది. మనదేశంలోని 38 కోట్ల జెన్‌–జీ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. ప్రస్తుతం తెలంగాణలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్‌ నడుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చి (రీకాల్‌) చూసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోనందుకు (రిగ్రెట్‌) బాధపడుతున్నారు. త్వరలోనే అసమర్ధ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తిరగబడే (రివోల్ట్‌)కు అవకాశం ఉంది’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  

రహదారి భద్రతా సెస్‌ పేరుతో ప్రజలపై భారం వేస్తారా?:  కేటీఆర్‌  
సాక్షి, హైదరాబాద్‌: రహదారి భద్రతా సెస్‌ పేరుతో ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు భారం వేయాలని చూడటం పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని దగా చేయడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే.. వాటిని అమలు చేయాల్సింది పోయి వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ఏమిటని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పైసా పైసా కూడబెట్టుకుని, లేదా అప్పు చేసి వాహనాలు కొనుగోలు చేసే పేద, మధ్యతరగతివారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు కాంగ్రెస్‌ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలని, రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రోడ్‌ సేఫ్టీకి నిధులు కేటాయించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
NDTV
BRS
KTR
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.