Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

కరుణ్‌ నాయర్‌ సూపర్‌ సెంచరీ.. రంజీ ఛాంపియన్‌గా విదర్భ

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 2, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
karun_0.jpg

రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy 2024-25) ఎడిషన్‌ ఛాంపియన్‌గా విదర్భ (Vidarbha) అవతరించింది. కేరళతో (Kerala) జరిగిన ఫైనల్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా విదర్భ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 37 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ స్కోర్‌ను క్రాస్‌ చేయలేకపోవడంతో తొలి సారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

VIDARBHA LIFTS THE RANJI TROPHY. 🏆

- 3rd Ranji title in the last 7 years. 🔥pic.twitter.com/cKclAW94XJ

— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2025

విదర్భ రంజీల్లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. విదర్భ 2017-18, 2018-19 ఎడిషన్లలో వరుసగా రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరిన  విదర్భ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత సీజన్‌ ఫైనల్లో విదర్భ ముంబై చేతిలో ఓడింది.

VIDARBHA HAS WON 3 RANJI TROPHY TITLES IN JUST 7 YEARS 🤯

- New force of Indian Domestic Cricket. pic.twitter.com/grTjVqWxLd

— Johns. (@CricCrazyJohns) March 2, 2025

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విదర్భ రెండు ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్‌ చేయగా.. కేరళ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది.

యువ ఆటగాడు దనిశ్‌ మలేవార్‌ (153) సూపర్‌ సెంచరీతో కదంతొక్కగా.. స్టార్‌ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ (86) సెంచరీకి చేరువలో రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్‌ ఆటగాడు నచికేత్‌ భూటే (32) మలేవార్‌, కరుణ్‌ నాయర్‌ తర్వాత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ధృవ్‌ షోరే (16), యశ్‌ ఠాకూర్‌ (25), కెప్టెన్‌ అక్షయ్‌ వాద్కర్‌ (23), అక్షయ్‌ కర్నేవార్‌ (12), హర్ష్‌ దూబే (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్‌ రేఖడే (0), దర్శన్‌ నల్కండే (1), యశ్‌ రాథోడ్‌ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్‌, ఈడెన్‌ యాపిల్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్‌ 2, జలజ్‌ సక్సేనా ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా విదర్భ 37 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. కేరళ ఇన్నింగ్స్‌లో ఆదిత్య సర్వటే (79), సచిన్‌ బేబి (98) సత్తా చాటగా..  అహ్మద్‌ ఇమ్రాన్‌ (37), మహ్మద్‌ అజాహరుద్దీన్‌ (34), సల్మాన్‌ నిజర్‌ (21), జలజ్‌ సక్సేనా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

అక్షయ్‌ చంద్రన్‌ (14), రోహన్‌ కన్నుమ్మల్‌ (0), ఏడెన్‌ యాపిల్‌ టామ్‌ (10), నిధీశ్‌ (1) నిరాశపరిచారు. విదర్భ బౌలర్లలో దర్శన్‌ నల్కండే, పార్థ్‌ రేఖడే, హర్ష్‌ దూబే తలో 3 వికెట్లు పడగొట్టగా.. యశ్‌ ఠాకూర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

సూపర్‌ సెంచరీతో మెరిసిన కరుణ్‌
37 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ అయిన కరుణ్‌ నాయర్‌ ఈ ఇన్నింగ్స్‌లో సూపర్‌ సెంచరీతో (135) మెరిశాడు. కరుణ​్‌కు ఈ రంజీ సీజన్‌లో ఇది నాలుగో సెంచరీ. ఓవరాల్‌గా ఈ దేశవాలీ సీజన్‌లో 9వది. ఈ సీజన్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో కరుణ్‌ ఐదు సెంచరీలు చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించిన మలేవార్‌
తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో దనిశ్‌ మలేవార్‌ (73) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో రాణించాడు. ఐదో రోజు ఆట చివరి సెషన్‌లో దర్శన నల్కండే (51 నాటౌట్‌) కేరళ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కేరళ బౌలర్లలో ఆదిత్య సర్వటే 4 వికెట్లు తీయగా.. నిధీశ్‌, జలజ్‌, యాపిల్‌ టామ్‌, బాసిల్‌, అక్షయ్‌ చంద్రన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా హర్ష్‌ దూబే
ఈ రంజీ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు తీసిన విదర్భ స్పిన్నర్‌ హర్ష్‌ దూబేకు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీమెంట్‌ అవార్డు లభించింది. ఈ ప్రదర్శనతో హర్ష్‌ ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్‌లో హర్ష్‌ 7 ఐదు వికెట్ల ప్రదర్శనలు.. 3 నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ  చేసిన దనిశ్‌ మలేవార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ranji Trophy
Ranji Trophy final
Vidarbha
kerala
Karun Nair
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

 ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి

ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.