తిరువనంతపురం: కేరళలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్రనష్టం మిగిల్చాయి. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 8 మంది చనిపోగా మరో 8 మంది గల్లంతయ్యారు. కనీసం 13 మంది గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మొత్తం 27 నివాసాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 209 సహాయక శిబిరాల్లో వేల మంది ఆశ్రయం పొందుతున్నారని సీఎం సతీశన్ తెలిపారు.
కర్ణాటకలో కుండపోత వానలు
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొప్పాల్ జిల్లాలో కొండపక్కనున్న నివాసంపై మట్టి పెళ్లలు విరిగిపడి మూడేళ్ల చిన్నారి సహా ముగ్గురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా అగుంబెలో 24 గంటల వ్యవధిలో 197 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కొడగు, ఉడుపి, చిక్కమగళూరు, సిర్సి, మంగళూరుల్లోనూ కుండపోతగా వాన కురిసింది. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లోనూ ఆదివారం విస్తారంగా వర్షాలు ముంచెత్తాయి.
8 మంది మృతి.. 8 మంది గల్లంతు
ADVERTISEMENT
ADVERTISEMENT