Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

టాప్స్‌లో జ్యోతి సురేఖ

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 2, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
JYOTHI-SUREKHA-1.jpg

ఏపీ ఆర్చర్‌ రాటుదేలేందుకు పథకం తోడ్పాటు 

ఇకపై కాంపౌండ్‌ ఆర్చర్లకు చేయూత 

‘టాప్స్‌’ నుంచి డోపీ రితిక అవుట్‌

‘టాగ్‌’లోకి గోల్ఫర్లు 

న్యూఢిల్లీ: టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌)లో కొత్తగా కాంపౌండ్‌ ఆర్చర్లను చేర్చారు. దీంతో ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో భారత్‌కు పతకాలు తెచి్చపెడుతున్న తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖకు ఇది కొత్త ఉత్సాహం ఇవ్వనుంది. భారత్‌ నుంచి ఒలింపిక్‌ పతక విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ‘టాప్స్‌’ ద్వారా చేయూత ఇస్తోంది. 

అయితే ఇన్నాళ్లు ఒలింపిక్‌ క్రీడాంశాలకే ‘టాప్స్‌’ను అమలు చేస్తూ వచ్చారు. దీంతో ఒలింపిక్స్‌లో లేని కాంపౌండ్‌ కేటగిరీకి ‘టాప్స్‌’ను ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రపంచ ఆర్చరీ పోటీల్లో దేశానికి, రాష్ట్రానికి పతక ప్రతిష్టలు తెస్తున్న జ్యోతి సురేఖ, పర్‌నీత్‌ కౌర్, అభిõÙక్‌ వర్మలాంటి వారు దూరమయ్యారు. తాజాగా క్రీడామంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఒలింపిక్‌ ఈవెంట్‌తో సంబంధం లేకపోయినా 8 మంది కాంపౌండ్‌ ఆర్చర్లకు లబ్ధి చేకూరనుంది.

 మరో తెలుగుతేజం రికర్వ్‌ ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర ఇప్పటికే ఈ పథకంలో ఉన్నాడు. డోపింగ్‌లో పట్టుబడిన మహిళా రెజ్లర్‌ రితిక హుడాను ‘టాప్స్‌’ నుంచి తొలగించారు. 2024–పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం 179 మందికి  ‘టాప్స్‌’ను అమలు చేశారు. ప్రదర్శన, వైఫల్యం, డోపింగ్‌ కారణాలతో గతేడాది నాటికి 179 జాబితా కాస్తా 94 మందికి పడిపోయింది. ఈ ఏడాది మొదలవుతుండగానే ‘టాప్స్‌’ కోర్‌ గ్రూప్‌ జాబితాను 118 మందికి పెంచారు. 

ఇందులో 57 మంది అథ్లెట్లు కాగా, మరో 61 మంది పారాథ్లెట్లు ఉన్నారు. క్రీడాశాఖ ప్రత్యేక డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ జాబితాలో అథ్లెట్లు అనిమేశ్‌ కుజుర్‌ (200 మీ. పరుగు), తేజస్విన్‌ శంకర్‌ (డెకథ్లాన్‌), 4–400 మీ. రిలే జట్టు సభ్యులు విశాల్, జయ్‌ కుమార్, రాజేశ్‌ రమేశ్, అమోజ్‌ జాకబ్, మొహమ్మద్‌ అజ్మల్, సంతోష్‌ కుమార్‌లు ఉన్నారు. ఈ గ్రూప్‌లోనే టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్లు మానుశ్‌ షా, మానవ్‌ ఠక్కర్, దియా చిటాలేలకు చోటుదక్కింది. 

‘టాగ్‌’లో కొత్తగా గోల్ఫ్, సర్ఫింగ్‌ 
టార్గెట్‌ ఆసియా క్రీడల గ్రూప్‌ (టీఏజీజీ–టాగ్‌)లో కొత్తగా లబ్దిపొందే క్రీడాంశాలను పెంచారు. ‘టాప్స్‌’లో లేని గోల్ఫ్, సర్ఫింగ్, టెన్నిస్‌ క్రీడాకారులకు ‘టాగ్‌’ కింద చేయూత అందిస్తారు. ఈ ఏడాది జపాన్‌లో ఏషియాడ్‌ జరుగనుంది. ఈ ఆసియా క్రీడల్లో పతకాలు తేవాలనే ఉద్దేశంతో గోల్ఫర్లు శుభాంకర్‌ శర్మ, దీక్ష డాగర్, టెన్నిస్‌ ప్లేయర్లు సుమిత్‌ నగాల్, యూకీ బాంబ్రీ, మాయ రాజేశ్వరన్‌ సహా 48 మందిని ‘టాగ్‌’ పథకం కింద ఎంపిక చేశారు.

 ఇందులో ఇప్పటికే ఈక్వె్రస్టియన్స్‌ (గుర్రపుస్వారీ) ఫౌద్‌ మీర్జా, అనుశ్‌ అగర్‌వాలా, ఫెన్సర్‌ భవానీ దేవి, జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ తదితరులు ఉన్నారు. ‘టాప్స్‌’, ‘టాగ్‌’ పథకాల కింద కోచింగ్, ఇతరాత్ర ఖర్చుల కింద నెలకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అవసరమైతే మరో రూ. 25 వేలు పాకెట్‌ అలవెన్స్‌గా  అందజేస్తారు. అలాగే విదేశీ శిక్షణలో ఉన్నన్ని రోజులు రోజుకు రూ. 2250 (25 డాలర్లు) అదనంగా  ఇస్తారు. అయితే విదేశీ శిక్షణకు ముందుగా ఆమోదం పొందాల్సివుంటుంది.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
target olympic podium scheme
Archer
Vennam Jyothi Surekha
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆర్చరీ ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ ‘హ్యాట్రిక్‌’

ఆర్చరీ ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ ‘హ్యాట్రిక్‌’

Sheetal Devi and Ananya Panday: వింటి ‘నారి’

Sheetal Devi and Ananya Panday: వింటి ‘నారి’

‘టాప్స్‌’లో జ్యోతి సురేఖ

‘టాప్స్‌’లో జ్యోతి సురేఖ

ఆర్చర్‌కు అండగా హెచ్‌సీఏ చీఫ్‌.. ఆర్థిక సాయం

ఆర్చర్‌కు అండగా హెచ్‌సీఏ చీఫ్‌.. ఆర్థిక సాయం

శీతల్‌ దేవీ.. ఓ అద్భుతం! రెండు చేతులు లేకపోయినా?

శీతల్‌ దేవీ.. ఓ అద్భుతం! రెండు చేతులు లేకపోయినా?

Paris Olympics 2024: అమ్మతనం ఆటకు అడ్డు కాలేదు

Paris Olympics 2024: అమ్మతనం ఆటకు అడ్డు కాలేదు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.