Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

Sheetal Devi and Ananya Panday: వింటి ‘నారి’

Family Sakshi User Sakshi Sakshi Time May 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shetahl-1.jpg

అరుదైన ప్రతిభ : శీతల్‌ దేవి

ఫేమస్‌ బ్రాండ్లకు ఫేవరెట్‌ స్టార్‌ : అనన్య పాండే

‘రెండు చేతులు లేవు కదా... విల్లు ఎలా పడతావు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు తన విల్‌పవర్‌తోనే సమాధానం చెప్పిన శీతల్‌ దేవి ఆర్చర్‌గా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. 

స్కూల్‌ రోజుల నుంచి వెటకారాలు ఎదుర్కొన్న అనన్య పాండే చిత్రసీమలోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్‌ బారిన పడింది. ఆ వెటకారాలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పిన అనన్య పాండే ప్రస్తుతం ఆసియాలోని  ప్రసిద్ధ బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా 2025’ జాబితాలో చోటు సాధించిన శీతల్‌దేవి, అనన్య పాండేల గురించి...

‘విజేతలు తమ దగ్గర లేని వాటి గురించి ఆలోచించరు. ఉన్నదాన్ని గురించే ఆలోచిస్తారు. దాంట్లో నుంచే శక్తి పుట్టిస్తారు’ అవును. జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌కు ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి కారణంగా రెండు చేతులు లేవు. కిస్తావర్‌లోని తన గ్రామంలో మేకలు కాసేది. శీతల్‌కు రెండు చేతులు లేకపోవచ్చు. అయితే అసాధారణమైన చురుకుదనం ఉంది. ఆ చురుకుదనమే భారత సైన్యం నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొనేలా చేసింది.

ఆ ఆటల్లో ఆర్చరీ శీతల్‌ను బాగా ఆకట్టుకుంది. ‘ఆర్చర్‌ కావాలనుకుంటున్నాను’ అన్నప్పుడు...‘రెండు చేతులు లేవు కదా...అది ఎలా సాధ్యం?’ అన్నారు అక్కడ ఉన్నవాళ్లు. తన కాళ్ల వైపు చూసింది. అవును... తన కాళ్లనే చేతులుగా మలుచుకొని చిన్న పల్లె, జిల్లా, రాష్ట్రం దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. పారాలింపిక్‌ మెడలిస్ట్‌గా చరిత్ర సృష్టించింది ఆర్చర్‌ శీతల్‌ దేవి.

‘ఆర్చరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆర్చరీకి ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన దేశంలో ఎంతోమందికి నేను తెలుసు. ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న వాళ్లను చూస్తే సంతోషంగా ఉంది’ అంటుంది స్టార్‌ ఆర్చర్‌ శీతల్‌దేవి.

ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి పొందుతున్న వాళ్లను చూసి సంతోషంగా ఉంది


 జేమ్స్‌ ‘బ్రాండ్‌’
‘వెక్కిరింపులు, వెటకారాలకు తల ఒగ్గితే ఎప్పటికీ తల ఎత్తలేవు’ స్కూల్‌ రోజుల్లో అనన్య పాండేను తోటి పిల్లలు ‘టూత్‌పిక్‌ లెగ్స్‌’ ‘ఫ్లాట్‌ స్క్రీన్‌’లాంటి నిక్‌నేమ్‌లతో వెక్కిరించేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె పేరు ముందు ‘గ్లామర్‌ డాల్‌’ అనే విశేషణం తప్పనిసరిగా ఉండేది. ‘నెపో బేబీ’ అని కూడా అంటుండేవారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ సరే సరి.

నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చేవి. సినిమాలకు ముందు పాండే ఏ ఫిల్మ్‌ స్కూల్‌లో చేరలేదు. చిన్నప్పుడు సినిమా సెట్స్‌కు వెళ్లింది కూడా లేదు. నిర్మాణాత్మక విమర్శలు వినబడిన తరువాత మాత్రం తన నటనను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. ‘అనన్య నటన అద్భుతం’ అనే ప్రశంస వినిపించడానికి ఎంతో కాలం పట్టలేదు.

వెటకారాలు, విమర్శలకు బాధ పడి ఉంటే....అనన్య పాండే ఎక్కడో ఆగిపోయేది. ‘విమర్శలు, వెటకారాలను సీరియస్‌గా తీసుకుంటే అది మోయలేనంత భారం అవుతుంది.  ఆ భారం మనల్ని ముందుకు వెళ్లకుండా నిలువరిస్తుంది’ అంటుంది అనన్య పాండే.

‘మొదట్లో తన ప్రత్యేకత కనిపించేది కాదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది చేసిన పాత్రలే అనన్య పాండే చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు. తాను మాత్రమే చేయగలిగే పాత్రలు చేస్తోంది’ అంటుంది ఫిలిమ్‌ క్రిటిక్‌ అనుపమ చోప్రా ఇప్పుడు ఫేమస్‌ బ్రాండ్‌లకు పాండే ఫేవరెట్‌ స్టార్‌ అయింది. ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ హౌజ్‌ ‘చానల్‌’, నెట్‌ఫ్లిక్స్, మాస్‌ ఓరియెంటెడ్‌ ‘స్కెచర్‌’కు మన దేశం నుంచి తొలి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం అనన్య పాండే దక్షిణ ఆసియాలోని ఎన్నో లగ్జరీ బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
will power
Sheetal Devi
Archer
Ananya Panday
Asia
brand ambassador
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

ప్రాణాలనే త్యాగం చేస్తాయి!

ప్రాణాలనే త్యాగం చేస్తాయి!

ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్‌టాక్ ఫౌండర్‌

ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్‌టాక్ ఫౌండర్‌

జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

భారత్‌కే ఆసియా రైజింగ్‌ స్టార్స్‌ టైటిల్‌

భారత్‌కే ఆసియా రైజింగ్‌ స్టార్స్‌ టైటిల్‌

ఓటీటీలో బోల్డ్ అండ్ ఫ‌న్ మూవీ స్ట్రీమింగ్‌

ఓటీటీలో బోల్డ్ అండ్ ఫ‌న్ మూవీ స్ట్రీమింగ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.