Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

T20 World Cup 2024: అభిమానిపైకి దూసుకెళ్లిన పాక్‌ పేసర్‌.. భార్య వారించినా..!

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 18, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fa_1.jpg

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో పాక్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్‌-ఏలో పాక్‌.. భారత్‌, యూఎస్‌ఏ చేతుల్లో ఓటమిపాలై సూపర్‌-8కు అర్హత సాధించలేకపోయింది. పాక్‌ కంటే మెరుగ్గా రాణించిన ఆతిథ్య దేశం యూఎస్‌ఏ.. భారత్‌తో పాటు  సూపర్‌-8లోకి ప్రవేశించింది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్‌ పోరాటం ముగిసినా ఆ జట్టు ఇంకా స్వదేశానికి తిరుగు ముఖం పట్టలేదు. మరికొద్ది రోజుల పాటు పాక్‌ బృందం యూఎస్‌ఏలోనే గడపనున్నట్లు సమాచారం.

A heated argument between Haris Rauf and a fan in the USA. pic.twitter.com/d2vt8guI1m

— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2024

అయితే ఈ మధ్యలో పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్‌పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్‌ సైతం గట్టిగానే స్పందించాడు. 

తాను ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్‌ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని చెప్పులు సైతం జారిపోయినా పట్టించుకోలేదు. 

ఆ అభిమాని ఏమన్నాడో తెలియదు కానీ.. రౌఫ్‌ కోపంతో ఊగిపోయాడు. దారిన పోయేవారు.. సెక్యూరిటీ వారిండంతో రౌఫ్‌ ఆడిపోయాడు. ఈ లోపు రౌఫ్‌ను రెచ్చగొట్టిన అభిమాని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. 

అభిమాని పట్ల రౌఫ్‌ ప్రవర్తన చూసి సొంత దేశ అభిమానులు ‍కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు. రౌఫ్‌  ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి వీధి రౌడీలా ప్రవర్తించాడని చివాట్లు పెడుతున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు సహజమేనని.. ఇలాంటి సందర్భాల్లో పరిణితి ప్రదర్శించి చూసీ చూడనట్లు వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్‌-8 బెర్త్‌లు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌తో (A1) పాటు యూఎస్‌ఏ (A2) సూపర్‌-8కు అర్హత సాధించింది. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్‌ (B2), గ్రూప్‌-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ (C1), వెస్టిండీస్‌ (C2), గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్‌ (D2) సూపర్‌-8లోకి ప్రవేశించాయి.

సూపర్‌-8 గ్రూప్‌-1లో గ్రూప్‌-ఏ నుంచి భారత్‌ (A1).. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్‌-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ (C1).. గ్రూప్‌-డి నుంచి బంగ్లాదేశ్‌ (D2) జట్లు ఉన్నాయి.

సూపర్‌-8 గ్రూప్‌ 2లో గ్రూప్‌-ఏ నుంచి యూఎస్‌ఏ (A2).. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌ (B2).. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌ (C2).. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.

సూపర్‌-8లో గ్రూప్‌-1 మ్యాచ్‌లు..

జూన్‌ 20- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా (బార్బడోస్‌)
జూన్‌ 20- ఆస్ట్రేలియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (ఆంటిగ్వా)
జూన్‌ 22- ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (ఆంటిగ్వా)
జూన్‌ 22- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా (సెయింట్‌ విన్సెంట్‌)
జూన్‌ 24- ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇండియా (సెయింట్‌ లూసియా)
జూన్‌ 24- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (సెయింట్‌ విన్సెంట్‌)

సూపర్‌-8లో గ్రూప్‌-2 మ్యాచ్‌లు..

జూన్‌ 19- యూఎస్‌ఏ వర్సెస్‌ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్‌ 19- ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ (సెయింట్‌ లూసియా)
జూన్‌ 21- ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (సెయింట్‌ లూసియా)
జూన్‌ 21- యూఎస్‌ఏ వర్సెస్‌ వెస్టిండీస్‌ (బార్బడోస్‌)
జూన్‌ 23- యూఎస్‌ఏ వర్సెస్‌ ఇంగ్లండ్‌ (బార్బడోస్‌)
జూన్‌ 23- వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
T20 World Cup 2024
Pakistan
Haris Rauf
viral video
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.