ఒక దేశం తరఫున క్రీడాకారులు లేదా జట్లు ఏదైనా చాంపియన్‌షిప్ లేదా ట్రోఫీలు కొల్లగొడితే సత్కారాలు, సన్మానాలతో హడావిడి చేస్తుంటారు. మన భారత్ కూడా ఇందుకు అతీతమేమి కాదు. కానీ స్పెయిన్‌లోని ఒక ప్రావిన్స్‌లో మాత్రం అక్కడి నుంచి ఏ ఆటగాడు ఎంత పెద్ద ఘనత సాధించినా పూలతో స్వాగతాలు, శాలువాలతో సన్మానాలు గట్రా చేయరు.
దీనికి బదులుగా అక్కడి సంప్రదాయం ప్రకారం ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటలను ఇచ్చి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఫిఫా గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యులైన మిడ్ఫీల్డర్స్ గావీ, పాబియానా రూయిజ్లను ఇదే తరహాలో సత్కరించడంతో వినూత్న సంప్రదాయం వెలుగులోకి వచ్చింది.
ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో 20 లక్షలకు పైగా అభిమానులు ఒక్కచోట చేరి స్పెయిన్ విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. 16 ఏళ్ల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టు ఆటగాళ్లకు అభిమానులు నీరాజనాలు పట్టారు.
దీనికి సంబంధించిన సెలబ్రేషన్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అయితే స్పెయిన్ మిడ్ ఫీల్డర్స్ ఫాబియన్ రూయిజ్, పాబ్లో గవీరా (గవీ)లకు తమ ఫ్రావిన్స్ అయిన లాస్ పలాసియోస్ వై విల్లాఫ్రాంకా పాలకమండలి కూడా వినూత్నరీతిలో స్వాగతం పలికింది. ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటాలను వారికి అందించడం వైరల్‌గా మారింది.
పురాతన సంప్రదాయం..
కాగా ఈ ప్రావిన్స్‌లో టమాట పంట అధికంగా ఉంటుందట. అందుకే ఆ ప్రావిన్స్ నుంచి ఎవరు ఎలాంటి గొప్ప పనులు లేదా ప్రావిన్స్‌కు గౌరవం తెచ్చే పనులు చేస్తే టమాటాలను గిఫ్ట్‌గా అందిస్తారట. ఇలా చేస్తే వారి వ్యాపారం బాగుంటుందని వారి నమ్మకం. తాజాగా ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న రూయిజ్, గావీలను ఇలా సత్కరించారు.
అంతేకాదు వీరి ప్రావిన్స్‌లోని నగ2రంలో ఉన్న రెండు ఫుట్‌బాల్ మైదానాలకు వీరిద్దరు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ స్టేడియాలకు మారిస్మస్, సాన్ సెబాస్టియన్ అనే పేర్లు ఉన్నాయి. ఫాబియానా రూయిజ్ లాస్ పాలాసియోస్ తరఫున ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించగా, ఆరేళ్ల వయసులోనే గావి లాలి లైయరా బాలోంపె తరఫున ఫుట్‌బాల్ ఆడడం ప్రారంభించాడు. ఇక ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయాన్ని సాధించి రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందుకుంది.
▶️Esto ya es tradicional en Los Palacios y Villafranca
🍅Gavi y Fabián Ruiz reciben su peso en tomates
📹@AlvarooSVQ @ZonaMixta__ pic.twitter.com/PyPKDOk99U— BeSoccer (@besoccer_ES) July 21, 2026
Read: అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే