Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

358 సరిపోలేదు

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 4, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sa.jpg

రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా 

4 వికెట్లతో భారత్‌ పరాజయం

కోహ్లి, రుతురాజ్‌ సెంచరీలు వృథా 

వైజాగ్‌లో శనివారం చివరి వన్డే  

విరాట్‌ కోహ్లి తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లో 53వ సెంచరీతో చెలరేగాడు. అండగా రుతురాజ్‌ గైక్వాడ్‌ వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. జట్టు గత మ్యాచ్‌లోకంటే మరో 9 పరుగులు ఎక్కువే చేసింది. అయినా సరే, రెండో వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు. 

రాంచీలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన సఫారీలు ఈసారి రాయ్‌పూర్‌లో పట్టు వదల్లేదు. ఏకంగా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సమం చేశారు. మార్క్‌రమ్, బ్రెవిస్, బ్రెట్‌కీ బ్యాటింగ్‌ జోరుతో పాటు బౌలర్ల వైఫల్యం, అతి పేలవ ఫీల్డింగ్‌తో భారత్‌ నుంచి మ్యాచ్‌ చేజారింది.  

రాయ్‌పూర్‌: భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. 

విరాట్‌ కోహ్లి (93 బంతుల్లో 102; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో శతకంతో చెలరేగగా... రుతురాజ్‌ గైక్వాడ్‌ (83 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. కోహ్లి, రుతురాజ్‌ మూడో వికెట్‌కు 26 ఓవర్లలో 156 పరుగులు జోడించగా, చివర్లో కేఎల్‌ రాహుల్‌ (43 బంతుల్లో 66 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించాడు. 

అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు సాధించింది. మార్క్‌రమ్‌ (98 బంతుల్లో 110; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ నమోదు చేయగా... మాథ్యూ బ్రీట్‌కే (64 బంతుల్లో 68; 5 ఫోర్లు), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే శనివారం విశాఖపట్నంలో జరుగుతుంది.  

భారీ భాగస్వామ్యం... 
ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (22) జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ మొదలు పెట్టగా... బర్గర్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్‌ శర్మ (14) అదే ఓవర్లో వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జైస్వాల్‌ కూడా అవుటయ్యాడు. అయితే కోహ్లి, రుతురాజ్‌ భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. సిక్స్‌తో ఖాతా తెరిచిన కోహ్లి ఆ తర్వాత తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. తొలి 10 ఓవర్లలో భారత్‌ 66 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో అవకాశం వృథా చేసుకున్న రుతురాజ్‌ ఈసారి పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. 

ఇద్దరిలో ముందుగా రుతురాజ్‌ 52 బంతుల్లో, ఆ తర్వాత కోహ్లి 47 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అనంతరం మరింత జోరు పెంచిన రుతురాజ్‌... మహరాజ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. యాన్సెన్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా కొట్టిన సిక్స్‌ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. మరోవైపు బాష్‌ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన రుతురాజ్‌ 77 బంతుల్లోనే తన తొలి శతకాన్ని అందుకొని సంబరాలు చేసుకున్నాడు. 

50 నుంచి 100కు చేరేందుకు అతను 25 బంతులే తీసుకున్నాడు. సెంచరీ తర్వాత రుతురాజ్‌ అవుట్‌ కాగా... యాన్సెన్‌ ఓవర్లో సింగిల్‌తో కోహ్లి సెంచరీ (90 బంతుల్లో) పూర్తయింది. ఆవెంటనే కోహ్లి వెనుదిరిగాడు. సుందర్‌ (1) విఫలం కాగా, రాహుల్, రవీంద్ర జడేజా (24 నాటౌట్‌) కలిసి స్కోరును 350 పరుగులు దాటించారు. ఈ క్రమంలో రాహుల్‌ 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకోగా, ఆఖరి 10 ఓవర్లలో భారత్‌ 76 పరుగులు రాబట్టగలిగింది.  

బ్రెవిస్‌ దూకుడు... 
దక్షిణాఫ్రికా టాప్‌–5లో డికాక్‌ (8) మినహా మిగతా వారంతా లక్ష్య ఛేదనలో తమవంతు పాత్ర పోషించారు. జట్టు ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. తొలి వికెట్‌ కోల్పోయిన తర్వాత మార్క్‌రమ్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 

ముఖ్యంగా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడిన మార్క్‌రమ్‌ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 88 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. అతను అవుటయ్యే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 30 ఓవర్లలో 197/3. మిగిలిన 20 ఓవర్లలో 8.10 రన్‌రేట్‌తో 162 పరుగులు అసాధ్యంగా కనిపించింది! అయితే ఇక్కడే బ్రెవిస్‌ ఆట స్వరూపాన్ని మార్చాడు. 

కుల్దీప్, హర్షిత్‌ బౌలింగ్‌లో చెరో రెండు చొప్పున మొత్తం ఐదు సిక్సర్లు బాదడంతో చేయాల్సిన రన్‌రేట్‌ ఒక్కసారిగా తగ్గిపోయింది. బ్రెవిస్, బ్రీట్‌కే నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగినా... కార్బిన్‌ బాష్‌ (15 బంతుల్లో 29 నాటౌట్‌; 4 ఫోర్లు) నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బాష్‌ (బి) యాన్సెన్‌ 22; రోహిత్‌ (సి) డికాక్‌ (బి) బర్గర్‌ 14; కోహ్లి (సి) మార్క్‌రమ్‌ (బి) ఎన్‌గిడి 102; రుతురాజ్‌ (సి) జోర్జి (బి) యాన్సెన్‌ 105; రాహుల్‌ (నాటౌట్‌) 66; సుందర్‌ (రనౌట్‌) 1; జడేజా (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–40, 2–62, 3–257, 4–284, 5–289. బౌలింగ్‌: బర్గర్‌ 6.1–0–43–1, ఎన్‌గిడి 10–1–51–1, యాన్సెన్‌ 10–0–63–2, మహరాజ్‌ 10–0–70–0, బాష్‌ 8–0–79–0, మార్క్‌రమ్‌ 5.5–0–48–0. 


దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) రుతురాజ్‌ (బి) హర్షిత్‌ 110; డికాక్‌ (సి) సుందర్‌ (బి) అర్‌‡్షదీప్‌ 8; బవుమా (సి) హర్షిత్‌ (బి) ప్రసిధ్‌ 46; బ్రీట్‌కే (ఎల్బీ) (బి) ప్రసిధ్‌ 68; బ్రెవిస్‌ (సి) జైస్వాల్‌ (బి) కుల్దీప్‌ 54; జోర్జి (రిటైర్డ్‌హర్ట్‌) 17; యాన్సెన్‌ (సి) రుతురాజ్‌ (బి) అర్‌‡్షదీప్‌ 2; బాష్‌ (నాటౌట్‌) 29; మహరాజ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–26, 2–127, 3–197, 4–289, 5–317, 6–322. బౌలింగ్‌: అర్ష్ దీప్  10–0–54–2, హర్షిత్‌ 10–0–70–1, ప్రసిధ్‌ 8.2–0–85–2, సుందర్‌ 4–0–28–0, జడేజా 7–0–41–, కుల్దీప్‌ 10–0–78–1.  

11 కోహ్లి వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు సాధించడం ఇది 11వ సారి.

34 కోహ్లి తన వన్డే కెరీర్‌లో 34 వేర్వేరు వేదికల్లో సెంచరీ సాధించాడు. సచిన్‌ కూడా 34 వేదికల్లో శతకాలు బాదాడు.

44  ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది 44వ సారి.

3 దక్షిణాఫ్రికాపై మూడుసార్లు వన్డేల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయగా.. మూడుసార్లూ భారత్‌ ఓడిపోవడం గమనార్హం. 1991 నవంబర్‌ 14న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో రవిశాస్త్రి, సంజయ్‌ మంజ్రేకర్‌... 2001 అక్టోబర్‌ 5న జొహనెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ సెంచరీలు చేశారు. ఈ రెండింటిలోనూ భారత్‌ ఓటమి పాలైంది.

2 రుతురాజ్‌ గైక్వాడ్‌ టి20 (2023 నవంబర్‌ 28న ఆ్రస్టేలియాపై గువాహటిలో 123 నాటౌట్‌), వన్డే (2025 డిసెంబర్‌ 3న రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై 105) ఫార్మాట్‌లలో తన తొలి సెంచరీ చేసిన రెండు సందర్భాల్లోనూ భారత్‌  ఓడిపోయింది.

2 వన్డేల్లో భారత్‌పై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. 2019లో మొహాలీలో జరిగిన వన్డేలోనూ ఆ్రస్టేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
second ODI
Virat Kohli
Ruturaj Gaikwad
India
south africa
Markram
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.