ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. 37 ఏళ్ల వయసులోనూ పూర్తిస్థాయి ఫిట్నెస్తో అద్బుత విన్యాసం చేయడం ధావన్‌కే చెల్లింది.
విషయంలోకి వెళితే.. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతి వార్నర్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఉన్న ధావన్ ఎడమవైపుకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే తొలుత బంతి చేతి నుంచి జారిపోతుందేమో అనిపించింది. కానీ ధావన్ కిందపడినప్పటికి బంతిని ఒడిసి పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Stunning from Shikhar Dhawan 🙌
(via @IPL) #PBKSvDC #IPL2023 pic.twitter.com/px5hB5y1dH— ESPNcricinfo (@ESPNcricinfo) May 17, 2023
చదవండి: #ShikarDhawan: గోల్డెన్ డకౌట్.. ఓపెనర్‌గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు