Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పాకిస్తాన్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 21, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sa.jpg

పాకిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్‌ సమర్పించుకున్న ప్రొటిస్‌.. కీలక పేసర్‌ సేవలను కోల్పోనుంది. ఫాస్ట్‌ బౌలర్‌ ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌ గాయం కారణంగా పాక్‌తో మూడో వన్డేకు దూరం కానున్నాడు.

వన్డే సిరీస్‌లో విఫలం
కాగా సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ను 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. తొలి వన్డేలో మూడు వికెట్లు, రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో పాక్‌ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది.

ఇక జొహన్నస్‌బర్గ్‌ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని తెంబా బవుమా బృందం పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు ప్రొటిస్‌ జట్టుకు షాక్‌ తగిలింది. పేసర్‌ ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌ గాయం బారినపడ్డాడు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

మోకాలి నొప్పి వల్ల
రెండో వన్డే కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలోనే బార్ట్‌మన్‌కు మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. కాగా టీ20 సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన బార్ట్‌మన్‌.. తొలి వన్డేలోనూ రాణించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్‌ చేసిన ఈ 31 ఏళ్ల రైటార్మ్‌ పేసర్‌.. 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

ఆల్‌రౌండర్‌కు పిలుపు
ఇక పాకిస్తాన్‌ చేతిలో వైట్‌వాష్‌ గండం నుంచి తప్పించుకునేందుకు సౌతాఫ్రికా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బార్ట్‌మన్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ను వన్డే జట్టులో చేర్చింది. కాగా బార్ట్‌మన్‌ కంటే ముందే స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ కూడా గాయం వల్ల సిరీస్‌కు దూరమయ్యాడు.

పాకిస్తాన్‌దే వన్డే సిరీస్‌
కేప్‌టౌన్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్‌ జట్టు... దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ 81 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా  2–0తో సిరీస్‌ చేజిక్కించుకుంది. పాకిస్తాన్‌ జట్టుకు విదేశాల్లో ఇది వరుసగా రెండో సిరీస్‌ విజయం కావడం విశేషం.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (82 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాజీ కెపె్టన్‌ బాబర్‌ ఆజమ్‌ (95 బంతుల్లో 73; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... కమ్రాన్‌ గులామ్‌ (32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దూకుడుతో పాకిస్తాన్‌ చివరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎమ్‌పాకా 4, యాన్సెన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (74 బంతుల్లో 97; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా... తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు.

కెప్టెన్‌ తెంబా బవుమా (12), టోనీ (34), డసెన్‌ (23), మార్క్‌రమ్‌ (21), మిల్లర్‌ (29) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాకిస్తాన్‌ బౌలర్లలో షాహీన్‌ షా అఫ్రిది 4, నసీమ్‌ షా మూడు వికెట్లు పడగొట్టారు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన కమ్రాన్‌ గులామ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

చదవండి: SA vs PAK: చ‌రిత్ర సృష్టించిన పాకిస్తాన్‌.. ప్రపంచం‍లోనే తొలి జట్టుగా

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
South Africa vs Pakistan
ODI series
Temba Bavuma
Mohammad Rizwan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం

వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.