Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

రోహిత్‌, కోహ్లి కాదు.. ప్రపంచంలో అతడే బెస్ట్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 10, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
indianteam.jpg

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భూగ్రహం మీద ప్రస్తుతం అత్యంత విలువైన క్రికెటర్‌ ఇతడేనంటూ టీమిండియా స్టార్లలో ఓ ఆటగాడి పేరు చెప్పాడు. డీకే చెప్పిన ఆ ప్లేయర్‌ రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లినో లేదంటే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మనో కానే కాదు! మరెవరు?..

దినేశ్‌ కార్తిక్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2024లో బిజీగా ఉన్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున బరిలోకి దిగి ఫినిషర్‌గా తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. ఇక ఇప్పటి వరకు తాజా ఎడిషన్లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో డీకే 90 పరుగులు చేశాడు.

తదుపరి ముంబై ఇండియన్స్‌ ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా డీకే మళ్లీ గురువారం బరిలో దిగనున్నాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఇదిలా ఉంటే.. కేవలం ఆటగాడినే కాకుండా కామెంటేటర్‌గానూ దినేశ్‌ కార్తిక్‌ రాణిస్తున్న విషయం తెలిసిందే.

భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్‌ అతడే

ఈ నేపథ్యంలో నాసిర్‌ హుసేన్‌, మైఖేల్‌ అథెర్టన్‌లతో కలిసి డీకే స్కై స్పోర్ట్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మోస్ట్‌ వాల్యూబుల్‌ క్రికెటర్‌ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నిజం చెప్పాలంటే అతడిలా మూడు ఫార్మాట్లలో ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరుస్తున్న మరొక ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు.

అతడి సత్తా అలాంటిది. కాబట్టి ప్రస్తుతం ఈ భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్‌ అతడే. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ అతడు సమర్థవంతంగా ఆడుతున్నాడు.

వేరే ఆటగాడికి లేని నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడు. అతడు బరిలో ఉంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే’’ అంటూ డీకే.. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా పేరు చెప్పాడు. తన దృష్టిలో ప్రస్తుతం బుమ్రా మాత్రం ఈ ప్రపంచం మొత్తం మీద విలువైన క్రికెటర్‌ అని పేర్కొన్నాడు.

కాగా భారత జట్టు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇక గురువారం ముంబై- ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా బుమ్రా- డీకే ఎదురుపడే అవకాశం ఉంది. 

చదవండి: T20 WC: హార్దిక్‌, రాహుల్‌కు నో ఛాన్స్‌.. ఆ ముగ్గురూ ఫిక్స్‌!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2024
Dinesh Karthik
royal challengers bengaluru
Nasser Hussain
Jasprit Bumrah
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

నేనేమీ లక్కీ చార్మ్‌ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!

నేనేమీ లక్కీ చార్మ్‌ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!

‘కడుపున పుట్టిన పిల్లల్లాగే.. అప్పుడే సగం గెలిచేశాము’

‘కడుపున పుట్టిన పిల్లల్లాగే.. అప్పుడే సగం గెలిచేశాము’

రాయల్‌ ఛాలెంజర్స్‌ రాజసం.. ఫైనల్‌లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)

రాయల్‌ ఛాలెంజర్స్‌ రాజసం.. ఫైనల్‌లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)

బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!

బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.