Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది’

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
smriti.jpg

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 (ODI World Cup 2025)లో భారత జట్టు మరో పరాజయం చవిచూసింది. స్వీయ తప్పిదాల కారణంగా ఇంగ్లండ్‌ మహిళా జట్టు (IND W vs ENG W)తో గెలవాల్సిన మ్యాచ్‌లో.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఇండోర్‌ వేదికగా ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపై భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) స్పందించింది. తాను కాస్త తెలివిగా ఆడి ఉంటే మ్యాచ్‌ తప్పక గెలిచేవాళ్లమని పేర్కొంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటానికి తాను ప్రధాన కారణమంటూ ఓటమికి బాధ్యత వహించింది.

 88 పరుగులు చేసి..
నిజానికి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్మృతి అదరగొట్టింది. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 94 బంతులు ఎదుర్కొని 88 పరుగులు చేసి.. జట్టును విజయం దిశగా నడిపించింది. చేతిలో ఏడు వికెట్లు.. గెలుపునకు 53 బంతుల్లో 55 పరుగులు అవసరమైన వేళ అనూహ్య రీతిలో స్మృతి అవుటైంది.

లిన్సే స్మిత్‌ బౌలింగ్‌లో లాంగాఫ్‌ మీదుగా షాట్‌ బాది అలిస్‌ కాప్సేకి క్యాచ్‌ ఇచ్చిన స్మృతి మంధాన.. పెవిలియన్‌కు చేరింది. ఇక కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా అద్బుత అర్ధ శతకం (70)తో రాణించింది. మరోవైపు.. దీప్తి శర్మ 50 పరుగులతో అదరగొట్టింది. కానీ స్మృతి అవుటైన తర్వాత భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ వేగంగా పతనమైంది.

The skipper’s looking solid and locked on to the chase! 🤜🏻🤛🏻

Will Harmanpreet Kaur turn this start into a big one and guide #TeamIndia through in this do-or-die clash? 😮‍💨

Catch the LIVE action ➡https://t.co/WF0rXIHjl8#CWC25 👉 #INDvENG | LIVE NOW on Star Sports & JioHotstar pic.twitter.com/vTs7nP01Tb

— Star Sports (@StarSportsIndia) October 19, 2025

 

ఇంగ్లండ్‌ విధించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 284 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం స్మృతి మంధాన తీవ్ర భావోద్వేగానికి లోనైంది.

నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది
‘‘అవును.. మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ప్రతి ఒక్కరు ఇది చూసే ఉంటారు.‍ మా షాట్‌ సెలక్షన్లు మరింత మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా నేను.. ఇంకాస్త తెలివిగా ప్రవర్తించాల్సింది. మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనం నాతోనే మొదలైంది. ఇందుకు నేను నైతిక బాధ్యత వహిస్తాను.

నాదే బాధ్యత
మేము ఓవర్‌కు కేవలం ఆరు పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లం. కానీ పరిస్థితి మరోలా మారిపోయింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనానికి నాదే బాధ్యత’’ అని స్మృతి మంధాన పేర్కొంది. కాగా తాజా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌కు ఇది హ్యాట్రిక్‌ ఓటమి.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మహిళా జట్లు సెమీ ఫైనల్‌ చేరగా.. భారత్‌పై గెలుపుతో ఇంగ్లండ్‌ కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌తో భారత్‌ పోటీ పడుతోంది.

చదవండి: నితీశ్‌ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ICC Womens World Cup 2025
India vs England
Smriti Mandhana
Harmanpreet Kaur
Deepti Sharma
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.