Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘ధోని సహనం కోల్పోయాడు.. నా మీద గట్టిగా అరిచాడు.. వికెట్‌ తీసినా సరే’

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
msd.jpg

మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni).. అభిమానులు అతడిని ముద్దుగా ‘కెప్టెన్‌ కూల్‌ (Captain Cool)’ అని కూడా పిలుచుకుంటారు. మైదానంలో సంయమనం కోల్పోకుండా.. అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో ధోని దిట్ట. హడావుడి లేకుండా.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేసి మ్యాచ్‌ను తమ జట్టు వైపునకు తిప్పడంలో తను తానే సాటి.

ఏదేమైనా మైదానంలో ధోని సహనం కోల్పోయిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. అయితే, తన విషయంలో మాత్రం తలా.. తన స్వభావానికి భిన్నంగా ప్రవర్తించాడని భారత మాజీ క్రికెటర్‌ మోహిత్‌ శర్మ (Mohit Sharma) అంటున్నాడు.

చేదు అనుభవం
వన్డే వరల్డ్‌కప్‌-2015 సందర్భంగా టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించే క్రమంలో మోహిత్‌ శర్మ.. ధోనితో డ్రెసింగ్‌రూమ్‌ పంచుకున్నాడు. తలా సారథ్యంలో మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో ధోనితో తనకు మంచి అనుబంధం ఉందంటూనే మోహిత్‌ శర్మ.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కూడా పంచుకున్నాడు.


చాంపియన్స్‌ లీగ్‌ టోర్నీలో సీఎస్‌కే తరఫున కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుతో ధోని సారథ్యంలో ఆడాడు మోహిత్‌ శర్మ. నాడు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ.. ‘‘మహీ భాయ్‌తో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కూల్‌ అండ్‌ కామ్‌ అని ఆయనకు పేరు. ఆయన సహనం కోల్పోతాడని మనం ఊహించలేము కూడా!

నాపై గట్టిగా అరిచాడు.. వికెట్‌ తీసినా తిడుతూనే
అయితే, ఓ యువకుడిపై ఆయన సహనం కోల్పోయి అరిస్తే.. నా విషయంలోనే ఇది జరిగింది. చాంపియన్స్‌ లీగ్‌ టీ20లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌ జరుగుతున్నపుడు.. మహీ భాయ్‌ ఈశ్వర్‌ పాండేని బౌలింగ్‌కు పిలిచాడు.

నేనేమో నన్నే పిలిచాడనుకుని.. బౌలింగ్‌ చేసేందుకు రన్‌ కూడా మొదలుపెట్టాను. దాంతో మహీ భాయ్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్ను తిట్టేశాడు. అయితే, ఆరోజు మొదటి బంతికే నేను యూసఫ్‌ పఠాన్‌ భాయ్‌ వికెట్‌ తీశాను.

దీంతో గట్టిగా సెలబ్రేట్‌ చేసుకున్నా. అప్పటికి ఇంకా మహీ భాయ్‌ నా మీద అరుస్తూనే ఉన్నాడు (నవ్వులు). భాయ్‌తో నాకు మైదానం వెలుపలా మంచి అనుబంధం ఉంది.

కేవలం ఆట గురించే కాదు..
కేవలం ఆట గురించే కాకుండా జీవిత పాఠాలను కూడా చక్కగా చెప్తాడు. క్రికెట్‌ కారణంగా ఓ ఆటగాడు మంచి వ్యక్తిగా కూడా ఎలా మారవచ్చో వివరిస్తాడు. ఆయనతో కలిసి కూర్చుంటే సమయమే తెలియదు’’ అని మోహిత్‌ శర్మ క్రిక్‌ట్రాకర్‌కు వెల్లడించాడు.

కాగా హర్యానాకు చెందిన 36 ఏళ్ల మోహిత్‌ శర్మ.. రైటార్మ్‌ పేసర్‌. 2013లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ బౌలర్‌.. 2015లో తన చివరి మ్యాచ్‌ ఆడేశాడు. రెండేళ్లకాలంలో అంతర్జాతీయ స్థాయిలో 26 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడిన మోహిత్‌ శర్మ.. 31, ఆరు వికెట్లు తీశాడు.

చదవండి: ‘ది హండ్రెడ్‌’లో ఇరగదీశారు.. ఆ నలుగురికి ఐపీఎల్‌లో భారీ ధర!
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
MS Dhoni
MOhit sharma
Chennai Super Kings
champions league T20
Flashback Sports
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

రెండో టైటిల్‌.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే

రెండో టైటిల్‌.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే

అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?

అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?

స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో బ్లాక్ మ్యాజిక్‌..! అందుకే సీఎస్‌కే ఓడిపోయింది?

స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో బ్లాక్ మ్యాజిక్‌..! అందుకే సీఎస్‌కే ఓడిపోయింది?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.