Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

డకౌట్‌ తర్వాత కోహ్లి చర్య వైరల్‌.. గుడ్‌బై చెప్పేశాడా?

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
virat.jpg

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో డకౌట్‌ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. పెర్త్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొని మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో డకౌట్‌ అయిన కోహ్లి.. అడిలైడ్‌ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. 

లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా
భారత జట్టు ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్లో ఆస్ట్రేలియా యువ పేసర్‌ జేవియర్‌ బార్ట్‌లెట్‌ (Xavier Bartlett) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న కోహ్లి వికెట్ల ముందు అతడికి దొరికిపోయాడు. బార్ట్‌లెట్‌ సంధించిన బంతిని ఫ్లిక్‌ షాట్‌ ఆడబోయిన కోహ్లి విఫలమయ్యాడు. బంతి బ్యాట్‌కు బదులు ప్యాడ్‌కు తాకింది.

VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T

— cricket.com.au (@cricketcomau) October 23, 2025

 

అయితే, ఫీల్డ్‌ అంపైర్‌ సామ్‌ నొగాజ్‌స్కి లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ (LBW)గా ప్రకటించేందుకు తటపటాయించాడు. అయితే, ఆసీస్‌ బౌలర్లు అప్పీలు చేసిన వెంటనే అవుట్‌ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో కోహ్లితో పాటు అడిలైడ్‌ స్టేడియంలోని అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. నాలుగు బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఇలా మరోసారి సున్నా చుట్టడంతో స్టేడియం అంతా సైలెంట్‌ అయిపోయింది.

ఇదే తొలిసారి
కాగా వన్డే క్రికెట్‌లో కోహ్లి తన పదిహేడేళ్ల కెరీర్‌లో వరుసగా రెండుసార్లు డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. అవుటైన తర్వాత పెవిలియన్‌కు చేరే క్రమంలో కోహ్లి గ్లోవ్స్‌ తీసి.. అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ డ్రెసింగ్‌ రూమ్‌ వైపు వెళ్లడం రిటైర్మెంట్‌ వదంతులకు ఊతమిచ్చింది.

డకౌట్‌ తర్వాత కోహ్లి చర్య వైరల్‌.. గుడ్‌బై చెప్పేశాడా?
ఆస్ట్రేలియాతో గతేడాది బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లోనూ వరుస వైఫల్యాల నేపథ్యంలో కోహ్లి ఆఖరి మ్యాచ్‌లో ఇలాగే చేశాడంటూ ఫ్యాన్స్‌ గుర్తుచేసుకున్నారు. ఇక ఆ సిరీస్‌ తర్వాత కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి తాజా చర్య కూడా వన్డే రిటైర్మెంట్‌కు సంకేతమేనంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరికొంత మంది మాత్రం తనకెంతో ఇష్టమైన అడిలైడ్‌ వేదికపై కోహ్లి చివరి వన్డే ఆడేశాడని.. ఓవల్‌తో పాటు ఇక్కడి అభిమానులకు మాత్రమే గుడ్‌బై చెప్పాడని అభిప్రాయపడుతున్నారు. 

భవిష్యత్తు ప్రశ్నార్థకం
చివరగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 బరిలో దిగిన కోహ్లి ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ ఆసీస్‌తో వన్డేతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, పునరాగమనంలో ఇలా వరుసగా డకౌట్లు కావడం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడాలని కోహ్లి పట్టుదలగా ఉండగా.. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం ఇది కుదరదనే సంకేతాలు ఇచ్చాడు. 

ఆసీస్‌తో వన్డే జట్టు ప్రకటన సందర్భంగా రోహిత్‌ శర్మ, కోహ్లి తమకు ఈ విషయమై హామీ ఇవ్వలేదని.. అందుకే రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తొలగించినట్లు తెలిపాడు. కాగా రో- కో ఇప్పటికే పొట్టి ఫార్మాట్‌, టెస్టులకు గుడ్‌బై చెప్పి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇక ఆసీస్‌తో రెండో వన్డేలో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.

చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే స‌చిన్‌ను మించిపోయేవాడిని'
 

End is very-very near guys, cherish each and every moment of Virat kohli in this tour.💔 pic.twitter.com/vgJ3Uy4rxO

— U' (@toxifyy18) October 23, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Virat Kohli
india vs australia
ODI series
Xavier Bartlett
Adelaide
viral video
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.