ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. అయితే ఈసారి బౌలర్‌గా కాకుండా బ్యాటర్‌గా తన విలువను ప్రదర్శించాడు. పాక్‌తో జరిగిన తొలి టెస్టులో వరుస ఐదు ఓవర్లలో ఐదు మెయిడెన్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన జస్టిన్ గ్రీవ్స్ ఈసారి బ్యాట్‌తో (125 బంతుల్లో 64 నాటౌట్) రాణించాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. గ్రీవ్స్‌తో పాటు కెప్టెన్ రోస్టన్ చేజ్ (36 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నాడు. అంతకముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (46) అర్ధశతకం మిస్ చేసుకోగా, అమిర్ జాంగో (26), షెయ్ హోప్ (29) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 2 వికెట్లు తీయగా, ఉబైద్ షా, అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు.
ఇదే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక తొలి వికెట్‌కు బ్రాండన్ కింగ్, టగ్ నరైన్ చంద్రపాల్ (15) 49 పరుగులు జోడించిన తర్వాత విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో పెద్దగా ఎవరు ఆకట్టుకోలేదు. 120 పరుగుల వద్ద వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోవడంతో జస్టిన్ గ్రీవ్స్ క్రీజులోకి వచ్చాడు.
క్రీజులోకి వచ్చిందే మొదలు తనలోని క్లాస్ బ్యాటర్‌ను బయటికి తీసిన గ్రీవ్స్ నింపాదిగా ఆడాడు. వీలైనప్పుడల్లా బంతులను బౌండరీలను తరలించాడు. షెయ్ హోప్ ఔటైన తర్వాత మరింత బాధ్యతగా ఆడిన గ్రీవ్స్ టెస్టుల్లో మూడో అర్థసెంచరీని సాధించాడు. చేజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు గ్రీవ్స్ అజేయంగా 66 పరుగులు జోడించడంతో విండీస్ మళ్లీ ట్రాక్‌లో పడింది. రెండో రోజు ఆటలో ఈ ఇద్దరు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనే దానిపై విండీస్ స్కోరు ఆధారపడి ఉంది.
Justin Greaves Is A Classy Batter. Very Fluent Batter. His Drives Are Awesome pic.twitter.com/QfKDf5rWT0
— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 2, 2026
Read: తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు!