Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

'రూట్‌' దారి తప్పింది.. 'నా రోల్‌ ఏంటో తెలుసుకోవాలి'

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 21, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
root.jpg

జో రూట్‌.. ఈతరంలో గొప్ప టెస్టు క్రికెటర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. కెప్టెన్‌గా ఎన్నో టెస్టుల్లో ఇంగ్లండ్‌కు విజయాలు అందించాడు. టెస్టుల్లో 10వేలకు పైగా పరుగులు చేసిన రూట్‌ ఖాతాలో 28 సెంచరీలు ఉన్నాయి. మధ్యలో ఇంగ్లండ్‌ జట్టు రూట్‌ కెప్టెన్సీలో పాతాళానికి పడిపోయినప్పటికి బ్యాటర్‌గా మాత్రం తాను ఎప్పుడు విఫలమవ్వలేదు. ఇంగ్లండ్‌ జట్టులో గత పదేళ్లలో స్థిరంగా పరుగులు సాధించిన బ్యాటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది రూట్‌ మాత్రమే.

ఒకానొక దశలో 52 ఉన్న స్ట్రైక్‌రేట్‌ కాస్త 81.2కు పెరగడం చూస్తే రూట్‌ ఏ స్థాయిలో ఆడాడన్నది అర్థమవుతుంది. అయితే కొంతకాలంగా రూట్‌ బ్యాట్‌ మూగబోయింది. ఒకప్పుడు పరుగులు వెల్లువలా వచ్చిన బ్యాట్‌ నుంచి ఇప్పుడు కనీసం అర్థసెంచరీ కూడా రాలేకపోతుంది. గత 11 ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు ఫిఫ్టీలు మాత్రమే కొట్టి 242 పరుగులు చేసిన రూట్‌ సగటు 22కు పడిపోయింది. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కొంతకాలం స్థిరంగానే ఆడాడు.

అయితే క్రమంగా స్టోక్స్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ టెస్టులోనే బలంగా తయారవుతున్న వేళ రూట్‌ మాత్రం ఫామ్‌ కోల్పోయాడు. చివరగా టీమిండియాతో జరిగిన రీషెడ్యూల్డ్‌ ఐదో టెస్టులో సెంచరీ బాదిన రూట్‌.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో పాటు పాకిస్తాన్‌ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రూట్‌ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అయితే తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా రూట్‌ ఫామ్‌లోకి వచ్చినట్లే అనిపిస్తున్నాడు. మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

స్టోక్స్‌ నేతృత్వంలో సరికొత్తగా దూసుకెళ్తున్న టెస్టు టీమ్‌లో తన రోల్‌ ఏంటో తెలుసుకోవాలని ఉందంటూ రూట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బజ్‌బాల్‌తో సంచలనాలు సృష్టిస్తున్న ఇంగ్లండ్‌.. కివీస్‌తో మ్యాచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. తొలిరోజునే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంపై విమర్శలు వచ్చినప్పటికి.. స్టోక్స్‌కు తన జట్టు బౌలర్లపై ఉన్న నమ్మకం ఏంటనేది మరుసటి రోజే తెలిసొచ్చింది. అయితే ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌ వేగంగా మారుతున్న సమయంలో రూట్‌ ఏ స్థానంలో రావాలనేది కాస్త డైలమాలో పడింది. తన కెరీర్‌లో రూట్‌ ఎక్కువ భాగం మూడో స్థానంలో వచ్చేవాడు. మూడో స్థానంలో వచ్చి ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్‌.. ఇవాళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. 

ఇదే అంశంపై విజ్డెన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రూట్‌ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఇంగ్లండ్‌ టెస్టు జట్టు వేగంగా మారుతోంది. కాలానికి అనుగుణంగా బజ్‌బాల్‌తో​ స్టోక్స్‌ సంచలనాలు సృష్టిస్తున్నాడు. కోచ్‌ మెక్‌కల్లమ్‌- కెప్టెన్‌ స్టోక్స్‌ల ఆధ్వర్యంలో ఎలా బ్యాటింగ్‌ చేయాలనేది పరిశీలిస్తున్నా. కెప్టెన్సీ బాధ్యతల నుంచి బయటపడ్డాకా కాస్త రిలీఫ్‌ అనిపించింది. అయితే ఇప్పుడు జట్టులో నా రోల్‌ ఏంటనేది తెలుసుకోవాలి. వినడానికి సిల్లీగా అనిపిస్తున్నప్పటికి ఇది నిజం. గత కొన్ని మ్యాచ్‌లుగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నా.

ఎంత సీనియర్‌ క్రికెటర్‌ అయినా పరుగులు చేయలేకపోతే జట్టులో స్థానం పోతుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో వికెట్‌ సమర్పించుకున్నా. ఇది గమనించిన మెక్‌కల్లమ్‌.. ఏం కాదులే మరోసారి ప్రయత్నించు.. అంటూ మద్దతిచ్చాడు. అయితే రివర్స్‌ స్కూప్‌ ఆడడంలో తాను ఒకప్పుడు సిద్ధహస్తుడిని.. ఇప్పుడు ఆ 'రూట్‌' దారి తప్పింది. తిరిగి దానిని అందుకోవాలి'' అంటూ ముగించాడు.

చదవండి: Team India: సూర్య తప్ప.. స్వస్థలాలకు టీమిండియా క్రికెటర్లు

BGT 2023 IND VS AUS: ఆసీస్‌కు బిగ్‌ షాక్‌.. మరో వికెట్‌ డౌన్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
joe root
England cricket
Ben Stokes
Batting order
cricket news
England Vs New Zealand
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.