Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IPL 2024 KKR Vs SRH: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్‌ అయ్యర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time May 22, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kkr1.jpg

‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు మేము ఏం చేయగలమో అదే చేసి చూపించాం. కీలకమైన ఈ మ్యాచ్‌లో మా జట్టులోని ప్రతి ఒక్క బౌలర్ తమ బాధ్యతను నెరవేర్చారు.

వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్‌ లైనప్‌ ఉంటే కెప్టెన్‌ పని సులువవుతుంది. మా బౌలర్లంతా అద్భుతంగా రాణించారు. ఇక ముందు కూడా మా ప్రదర్శన ఇలాగే ఉంటుందని భావిస్తున్నా.

ఈరోజు గుర్బాజ్‌ తన తొలి మ్యాచ్‌ ఆడాడు. ఓపెనర్‌గా మాకు శుభారంభమే అందించాడు. ఇదే జోరులో మరింత ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నాం. ఫైనల్లోనూ మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు.

ఐపీఎల్‌-2024లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా లీగ్‌ దశలో పద్నాలుగింట తొమ్మిది విజయాలతో టాపర్‌గా నిలిచిన కేకేఆర్‌.. క్వాలిఫయర్‌-1లోనూ సత్తా చాటింది.

అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు కేకేఆర్‌ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.

సీజన్‌ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడిన సన్‌రైజర్స్‌కు షాకిస్తూ 159 పరుగులకే కుప్పకూల్చారు. మిచెల్‌ స్టార్క్‌ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు, వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా, సునిల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23, సునిల్‌ నరైన్‌ 16 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగారు.

అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌, నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ సన్‌రైజర్స్‌ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా చెలరేగారు. వెంకటేశ్‌ 28 బంతుల్లో 51, శ్రేయస్‌ అయ్యర్‌ 24 బంతుల్లో 58 పరుగులతో దుమ్ములేపారు.

వీరిద్దరి విజృంభణతో 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్‌ 164 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అదే విధంగా.. మైదానంలో వెంకటేశ్‌ అయ్యర్‌తో తన కమ్యూనికేషన్‌ గురించి చెబుతూ.. ‘‘నిజానికి నాకు తమిళ్‌ మాట్లాడటం రాదు. అయితే, ఎదుటివాళ్లు మాట్లాడింది అర్థం చేసుకోగలను. వెంకీ తమిళ్‌లోనే మాట్లాడతాడు. నేను అతడికి హిందీలో బదులిస్తాను’’ అని తెలిపాడు.‌

What a memorable 𝗞𝗻𝗶𝗴𝗵𝘁 for the men in purple 💜

Unbeaten half-centuries from Venkatesh Iyer 🤝 Shreyas Iyer

The celebrations continue for the final-bound @KKRiders 😎

Scorecard ▶️ https://t.co/U9jiBAlyXF#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/xBFp3Sskqq

— IndianPremierLeague (@IPL) May 21, 2024

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2024
Shreyas Iyer
venkatesh iyer
Kolkata Knight Riders
Mitchell Starc
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

షాకింగ్‌.. శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14కోట్లు

షాకింగ్‌.. శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14కోట్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.