ఆర్సీబీతో ఇవాళ (మే 6, రాత్రి 7: 30 గటంలకు) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి (దక్షిణాఫ్రికా) వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. పర్సనల్ ఎమర్జెన్సీ కారణంగా నోర్జే ఇంటికి వెళ్లినట్లు డీసీ మేనేజ్మెంట్ పేర్కొంది. డీసీ ఆడబోయే తదుపరి మ్యాచ్ సమయానికంతా నోర్జే అందబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది.
చదవండి: DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక
𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐒𝐭𝐚𝐭𝐞𝐦𝐞𝐧𝐭
Owing to a personal emergency, Delhi Capitals fast bowler Anrich Nortje had to leave for South Africa late on Friday night. He will be unavailable for this evening’s game against Royal Challengers Bangalore. pic.twitter.com/lig7mfgLan— Delhi Capitals (@DelhiCapitals) May 6, 2023
కాగా, నోర్జే లేని లోటు డీసీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కచ్చితమైన వేగం, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసే నోర్జే.. ఈ సీజన్లో ఢిల్లీ సాధించిన అతికొద్ది విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీకి నోర్జే లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బే.
చదవండి: CSK VS MI: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ శర్మ