ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్ కెరీర్లో బట్లర్‌కు ఇది రెండో డకౌట్ మాత్రమే కావడం విశేషం. తొలి డకౌట్ అతని ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్‌లో వచ్చింది. 2016లో రైజింగ్ పుణేతో మ్యాచ్ బట్లర్‌కు తొలి ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఆ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో రెండో డకౌట్ నమోదు చేశాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో బట్లర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
T. I. M. B. E. R!
Huge Wicket for @gujarat_titans! 👏 👏@MdShami11 with his first wicket of the match! 👍 👍#RR 2 down as Jos Buttler departs.
Follow the match 👉 https://t.co/nvoo5Sl96y#TATAIPL | #GTvRR pic.twitter.com/DBspi43pRo— IndianPremierLeague (@IPL) April 16, 2023
చదవండి: గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఖాతాలో అరుదైన రికార్డు