Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

'శుబ్‌' శతకం

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 12, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gill.jpg

గిల్‌ అజేయ సెంచరీ

తొలి ఇన్నింగ్స్‌లో 518/5 డిక్లేర్డ్‌

విండీస్‌ 140/4

వికెట్ల వేట మొదలుపెట్టిన జడేజా

అనుకున్నట్లే రెండో రోజూ భారత్‌ జోరు కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో కరీబియన్‌లను కష్టాల్లోకి నెట్టేసింది. మొదట కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ శతకంతో భారీ స్కోరులో భాగమయ్యాడు. 500 పైచిలుకు స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన భారత్‌... బౌలింగ్‌తోనూ అదరగొట్టింది. రెండో రోజే స్పిన్‌ తిరగడంతో భారత కెప్టెన్‌ గిల్‌... జడేజా, కుల్దీప్‌లతో అనుకున్న ఫలితాలు సాధించాడు.

న్యూఢిల్లీ: ఈ రెండో టెస్టును కూడా ముందే ముగించేందుకు భారత్‌ సిద్ధమైంది. రెండో రోజు ఆటలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బ్యాటింగ్‌లో శుబ్‌మన్‌ గిల్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ధ్రువ్‌ జురేల్‌లు కరీబియన్‌ బౌలర్లపై సులువుగా పరుగులు రాబట్టారు. తర్వాత రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లు స్పిన్‌ ఉచ్చును బిగించారు. తద్వారా క్లీన్‌స్వీప్‌నకు రాచబాట వేశారు. 

కెప్టెన్‌ గిల్‌ (196 బంతుల్లో 129 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో భారత్‌ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. నితీశ్‌ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జురేల్‌ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అలిక్‌ అతనేజ్‌ (84 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్‌) భారత బౌలర్లను ఎక్కువసేపు ఎదుర్కొన్నాడు. జడేజా 3 వికెట్లు తీశాడు. 

జైస్వాల్‌ రనౌట్‌
డబుల్‌ సెంచరీ చేస్తాడనుకున్న ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కేవలం తన క్రితం రోజు స్కోరుకు 2 పరుగులే జతచేసి రనౌటయ్యాడు. దీంతో శనివారం 318/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సారథి గిల్‌ పరుగుకు ఉపక్రమించి వెనకడుగు వేయడంతో జైస్వాల్‌ నిష్క్రమించాల్సి వచ్చింది. నిరాశకు లోనైన యశస్వి తలకొట్టుకొని అసహనంగా క్రీజు వీడాడు. 

తర్వాత గిల్‌కు జతయిన నితీశ్‌ వన్డే తరహా ఆటతీరుతో ధాటిగా పరుగులు సాధించాడు. శుబ్‌మన్‌ అర్ధసెంచరీని పూర్తిచేసుకోగా... జట్టు స్కోరు తొలిసెషన్‌లోనే 400 పరుగులు దాటింది. క్రీజులో పాతుకుపోయిన నితీశ్‌ను లంచ్‌ విరామానికి ముందు వారికెన్‌ అవుట్‌ చేశాడు. క్రీజులోకి ధ్రువ్‌ జురేల్‌ రాగా 427/4 స్కోరు వద్ద తొలిసెషన్‌ ముగిసింది. 

శతక్కొట్టిన సారథి
రెండో సెషన్‌లో పూర్తిగా భారత బ్యాటర్ల జోరే కొనసాగింది. జురేల్‌ అండతో గిల్‌ టెస్టుల్లో పదో సెంచరీ సాధించాడు. అడపాదడపా బౌండరీతతో పరుగులు సాధించడంతో భారత్‌ స్కోరు సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో జట్టు స్కోరు 500 పరుగుల్ని దాటింది. ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించాక జురేల్‌ను చేజ్‌ అవుట్‌ చేయడంతోనే గిల్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌ ఆదిలోనే క్యాంప్‌బెల్‌ (10) వికెట్‌ను కోల్పోయినా... చాలాసేపు పోరాడింది. 

తేజ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ (34; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అతనేజ్‌ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోరు 87 వద్ద తేజ్‌ను జడేజా అవుట్‌ చేశాకే భారత్‌కు పట్టు దొరికింది. పరుగు తేడాతో అతనేజ్, చేజ్‌ (0) వికెట్లను స్పిన్నర్లు పడగొట్టేశారు. షై హోప్‌ (31 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), ఇమ్లాచ్‌ (14 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్‌ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలిఇన్నింగ్స్‌: జైస్వాల్‌ రనౌట్‌ 175; రాహుల్‌ (స్టంప్డ్‌) ఇమ్లాచ్‌ (బి) వారికెన్‌ 38; సాయి సుదర్శన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికెన్‌ 87; శుబ్‌మన్‌ (నాటౌట్‌) 129; నితీశ్‌ రెడ్డి (సి) సీల్స్‌ (బి) వారికెన్‌ 43; జురేల్‌ (బి) చేజ్‌ 44; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (134.2 ఓవర్లలో) 518/5 డిక్లేర్డ్‌. వికెట్ల పతనం: 1–58, 2–251, 3–325, 4–416, 5–518. బౌలింగ్‌: సీల్స్‌ 22–2–88–0, ఫిలిప్‌ 17–2–71–0, గ్రీవెస్‌ 14–1–58–0, పియర్‌ 30–2–120–0, వారికెన్‌ 34–6–98–3, చేజ్‌ 17.2–0–83–1.

వెస్టిండీస్‌ తొలిఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (సి) సుదర్శన్‌ (బి) జడేజా 10; తేజ్‌ (సి) రాహుల్‌ (బి) జడేజా 34; అతనేజ్‌  (సి) జడేజా (బి) కుల్దీప్‌ 41; షై హోప్‌ (బ్యాటింగ్‌) 31; చేజ్‌ (సి) అండ్‌ (బి) జడేజా 0; ఇమ్లాచ్‌ (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 140. వికెట్ల పతనం: 1–21, 2–87, 3–106, 4–107. బౌలింగ్‌: బుమ్రా 6–3–18–0, సిరాజ్‌ 4–0–9–0, జడేజా 14–3–37–3, కుల్దీప్‌ 12–3–45–1, సుందర్‌ 7–1–23–0. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India
West Indies
second Test
Shubman Gill
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

హోల్డర్ రిటైర్‌ కాలేదు.. పొరపాటు చేసిన వెస్టిండీస్‌ కోచ్‌

హోల్డర్ రిటైర్‌ కాలేదు.. పొరపాటు చేసిన వెస్టిండీస్‌ కోచ్‌

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.