Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ఇక ధనాధన్‌ షురూ... 

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 9, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
SURYA-GILL-TILAK-ETC.jpg

నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టి20

జోరు మీదున్న సూర్య కుమార్‌ బృందం

ఫామ్‌లేమితో సఫారీల సమస్య

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం

టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్‌ ఆ తర్వాత ఇప్పటి వరకు 32 టి20లు ఆడితే 26 గెలిచి, 4 మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి అద్భుత ఫామ్‌ మాత్రమే కాదు జట్టులో అనూహ్య మార్పులేమీ లేకుండా చాలా కాలంగా ఒకే పటిష్టమైన బృందంతో సాగుతోంది. మరోవైపు భారత్‌ చేతిలో టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా 9, గెలిచి 16 ఓడిపోయింది.

పైగా నిలకడ లేని టీమ్‌తో పదే పదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తమ స్థాయిని ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధం కాగా... వచ్చే టి20 వరల్డ్‌ కప్‌కు ముందు ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడటం సన్నాహకంగా ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు.  

కటక్‌: భారత గడ్డపై చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో కూడా సిరీస్‌లు జరుగుతుండగా... టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. వన్డే సిరీస్‌ నెగ్గిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌ విజయంపై గురి పెట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగడానికి ముందు భారత్‌ 10 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ తర్వాత న్యూజిలాండ్‌తో కూడా ఐదు టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. 

ఇప్పటికే సిద్ధమైన జట్టును అన్ని రకాలుగా పరీక్షించుకోవడంతో పాటు స్వల్ప లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్‌లు అవకాశం కల్చిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్‌ ఫలితంకంటే కూడా తమ జట్టును పునరి్నరి్మంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఇలాంటి సమీకరణాల మధ్య బారాబతి స్టేడియంలో నేడు తొలి టి20 మ్యాచ్‌ జరుగుతుంది.  

గిల్, పాండ్యా సిద్ధం... 
ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్‌ గెలిచిన తర్వాత భారత్‌ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. సంచలన ఎంపికలు ఏమీ లేవు కాబట్టి తుది కూర్పుపై కూడా స్పష్టత ఉంది. గాయాల నుంచి కోలుకున్న వైస్‌ కెప్టెన్‌ గిల్, హార్దిక్‌ పాండ్యా పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశాడు. కాబట్టి వీరిద్దరు ఆడటం ఖాయం.

 అభిషేక్‌ శర్మతో పాటు గిల్‌ ఓపెనింగ్‌ చేయనుండగా సూర్య, తిలక్‌ వర్మ స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వికెట్‌ కీపర్‌గా సంజూ సామ్సన్, జితేశ్‌ శర్మలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రెగ్యులర్‌ స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్‌ చక్రవర్తి ఉంటారు. అక్షర్‌ పటేల్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ పోటీలో ఉన్నాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌ కావాలంటే హర్షిత్‌ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే కెప్టెన్‌ సూర్యకుమార్‌ ఫామ్‌ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. 

పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాతి నుంచి సూర్య ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 15.33 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. అంతకుముందు నుంచి కలిపి చూస్తే గత 20 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్‌ సెంచరీ చేయకుండా పూర్తిగా విఫలయ్యాడు. ప్రస్తుత స్థితిలో అతని స్థానానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా... ఈ సిరీస్‌లోనైనా స్థాయికి తగినట్లుగా చెలరేగాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది.  

బ్రెవిస్‌పై దృష్టి... 
దక్షిణాఫ్రికా టీమ్‌ పరిస్థితి ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. ఆ్రస్టేలియా, పాకిస్తాన్‌ల చేతిలో సిరీస్‌లు ఓడటంతో పాటు నమీబియా చేతిలో మ్యాచ్‌ కూడా కోల్పోయింది. పైగా ఇంగ్లండ్‌తో జరిగిన టి20లో 300కు పైగా పరుగులిచ్చి ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన పెద్ద జట్టుగా నిలిచింది. 

దూకుడైన ఆటగాడు డేవిడ్‌ మిల్లర్, పేసర్‌ నోర్జే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సానుకూలాంశం కాగా కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మార్క్‌రమ్‌ మెరుగైన ఫామ్‌లో ఉండటం కలిసి రావచ్చు. 

ఇప్పటికీ తుది జట్టు విషయంలో టీమ్‌లో గందరగోళమే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగల డెవాల్డ్‌ బ్రెవిస్‌పై మాత్రం అందరి దృష్టీ ఉంది. ఐపీఎల్‌తో పాటు ఇటీవల వన్డేల్లో కూడా అతని దూకుడు కనిపించింది. బ్రెవిస్‌ చెలరేగితే సఫారీలకు మంచి గెలుపు అవకాశం ఉంటుంది. యాన్సెన్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  

పిచ్, వాతావరణం  
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోరి్టంగ్‌ పిచ్‌. ప్రతీ ఆటగాడు సత్తా చూపించేందుకు సరైంది. అయితే ఇక్కడా మంచు ప్రభావం చాలా ఉంది కాబట్టి టాస్‌ గెలవగానే ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన ఉన్నా మ్యాచ్‌కు ఇబ్బంది లేకపోవచ్చు.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, గిల్, తిలక్, జితేశ్‌ శర్మ/సామ్సన్, పాండ్యా, అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్‌/సుందర్‌.  
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), డికాక్, హెన్‌డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్‌/లిండే, యాన్సెన్, మహరాజ్, ఎన్‌గిడి, మహరాజ్‌.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India Vs South Africa
T20 series
Barabati Stadium
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!

సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!

అతడి కెప్టెన్సీలో స్వేచ్ఛ: మయాంక్‌ యాదవ్‌

అతడి కెప్టెన్సీలో స్వేచ్ఛ: మయాంక్‌ యాదవ్‌

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.