Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మిలింద్‌ మ్యాజిక్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 29, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mili22.jpg

పుదుచ్చేరిపై హైదరాబాద్‌ విజయం 

విజయ్‌ హజారే ట్రోఫీ 

అహ్మదాబాద్‌: లెఫ్టార్మ్‌ పేసర్‌ సీవీ మిలింద్‌ (5/13) నిప్పులు చెరగడంతో... విజయ్‌ హజారే టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో పుదుచ్చేరిని మట్టికరిపించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 31.5 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటైంది. 

పారస్‌ (57 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌... కాగా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. హైదరాబాద్‌ బౌలర్లలో మిలింద్‌ 9.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 13 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. తనయ్‌ త్యాగరాజన్‌ 3 వికెట్లు తీయగా... మొహమ్మద్‌ ముదస్సిర్, నిశాంత్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. 

అనంతరం లక్ష్యం చిన్నదే అయినా హైదరాబాద్‌ జట్టు తడబడింది. చివరకు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. హిమతేజ (61 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మిలింద్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం కర్ణాటకతో హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనుంది.  

భరత్, హెబర్‌ మెరుపులు
బౌలర్ల క్రమశిక్షణకు ఓపెనర్ల దూకుడు తోడవడంతో దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 10 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ను చిత్తుచేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్‌ 36.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. అర్జున్‌ శర్మ (39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... అన్షుల్‌ గుప్తా (23), వినీత్‌ (23), అరుణ్‌ (22) తలా కొన్ని పరుగులు చేశారు. 

ఆంధ్ర బౌలర్లలో పిన్నింటి తపస్వి 4 వికెట్లు పడగొట్టగా... పృథ్వి రాజ్, శశికాంత్‌ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 28.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 163 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రీకర్‌ భరత్‌ (90 బంతుల్లో 86 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశ్విన్‌ హెబర్‌ (66 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధశతకాలతో రాణించారు. 

ఈ టోర్నీలో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, ఒక ‘డ్రా’తో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. తపస్వికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మేఘాలయతో ఆంధ్ర జట్టు తలపడనుంది.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Puducherry
Milind CV
Hyderabad
Vijay Hazare Trophy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.