Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘గంభీర్‌ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gg2.jpg

మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి సంచలన వ్యాఖ్యలు

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి(Manoj Tiwary) సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్‌కు నోటి దురుసు ఎక్కువని.. తన కుటుంబంతో పాటు ఓ టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ను కూడా అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించాడు. 

తనకు నచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడం గంభీర్‌కు అలవాటని.. అందుకే ఆస్ట్రేలియా పర్యటనలో ఆకాశ్‌ దీప్‌(Akash Deep)ను బలిచేశాడని మండిపడ్డాడు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు గంభీర్‌- మనోజ్‌ తివారి కలిసి ఆడారు. 

గతంలో దేశవాళీ క్రికెట్‌లోనూ ఢిల్లీ తరఫున గంభీర్‌- బెంగాల్‌ జట్టు తరఫున తివారి ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్‌కు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.

గంభీర్‌ హయాంలో చేదు అనుభవాలు
తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలోనూ ఓడిపోయింది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి పదేళ్ల తర్వాత ట్రోఫీని ఆసీస్‌కు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక, గంభీర్‌ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో మనోజ్‌ తివారి సైతం తన అభిప్రాయాలను పంచుకుంటూ.. గంభీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడొక మోసగాడు అని.. గౌతీ చెత్త నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించాడు. అయితే, నితీశ్‌ రాణా, హర్షిత్‌ రాణా వంటి యువ ప్లేయర్లు ఈ విషయంలో మనోజ్‌ తివారిని తప్పుబడుతూ.. గంభీర్‌కు మద్దతుగా కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి.

హర్షిత్‌ రాణాను ఎందుకు ఆడించారు?
ఈ విషయాలపై మనోజ్‌ తివారి తాజాగా స్పందించాడు. అర్హత లేకున్నా.. కేవలం గంభీర్‌ చెప్పడం వల్ల అవకాశాలు పొందిన వారు ఇలాగే మాట్లాడతారని ​నితీశ్‌, హర్షిత్‌లను ఉద్దేశించి కౌంటర్లు వేశాడు. ‘‘నితీశ్‌ రాణా, హర్షిత్‌ రాణా వంటి వాళ్లు గౌతం గంభీర్‌కు ఎందుకు సపోర్టు చేయరు? తప్పకుండా చేస్తారు.

ఎందుకంటే పెర్త్‌ టెస్టులో ఆకాశ్‌ దీప్‌ను కాదని హర్షిత్‌ రాణాను ఆడించింది ఎవరో మనకు తెలియదా? అయినా.. ఆకాశ్‌ ఏం తప్పు చేశాడని అతడిని మొదటి టెస్టుకు పక్కనపెట్టారు? బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా తనకు సహకరించే పిచ్‌లపై వీలైనంత ఎక్కువగా బౌలింగ్‌ చేయాలని అతడు కోరుకోవడం సహజం. కానీ కారణం లేకుండా అతడిని జట్టు నుంచి తప్పించారు. హర్షిత్‌ కోసం ఆకాశ్‌పై తొలి టెస్టులో వేటు వేశారు. హర్షిత్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ గణాంకాలు కూడా అంతంతమాత్రమే. ఆకాశ్‌ దీప్‌ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు.

నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..
అయినా.. సరే అతడిని పక్కనపెట్టారంటే.. సెలక్షన్‌లో ఎంతటి వివక్ష ఉందో అర్థం కావడం లేదా?.. అందుకే గంభీర్‌కు ఇలాంటి వాళ్లు మద్దతు ఇస్తారు. అయినా నేనేమీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఉన్న విషయాల్నే నిర్భయంగా చెప్పాను.

రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో మ్యాచ్‌ జరిగినపుడు గౌతం గంభీర్‌ నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో.. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా విన్నారు. సౌరవ్‌ గంగూలీ గురించి అతడు అన్న మాటలు.. నా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అందరూ విన్నారు. అయినా.. వారిలో కొంతమంది అప్పుడు అతడికే సపోర్టు చేశారు. జనాలు ఇలాగే ఉంటారు.

అతడిని తొక్కేయాలని చూశారు
హర్షిత్‌ కంటే ఆకాశ్‌ దీప్‌ బెటర్‌ అని మేనేజ్‌మెంట్‌ త్వరగానే గ్రహించింది. అందుకే రెండో టెస్టు నుంచి అతడిని పిలిపించారు. ఇక్కడ కొంతమంది స్వార్థం వల్ల జట్టుకు చెడు జరిగే అవకాశం ఉంది. 

పాపం ఆకాశ్‌ దీప్‌ తన సెలక్షన్‌ గురించి నోరు విప్పలేడు. అందుకే అతడిని తొక్కేయాలని చూశారు’’ అని మనోజ్‌ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: నవశకం.. కొత్త కెప్టెన్‌ అతడే!.. ఆర్సీబీ హెడ్‌కోచ్‌ వ్యాఖ్యలు వైరల్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Gautam Gambhir
Sourav Ganguly
Akash Deep
Manoj Tiwary
Harshit Rana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నాపై దేశద్రోహి ముద్ర’.. గంభీర్‌పై శ్రీశాంత్‌ ఆరోపణలు

‘నాపై దేశద్రోహి ముద్ర’.. గంభీర్‌పై శ్రీశాంత్‌ ఆరోపణలు

 రోహిత్‌, కోహ్లీ భ‌విత‌వ్యంపై బీసీసీఐ స్పందన!

రోహిత్‌, కోహ్లీ భ‌విత‌వ్యంపై బీసీసీఐ స్పందన!

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

ఆఫ్గన్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు

ఆఫ్గన్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.