ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL2023) అభిమానులను అలరిస్తోంది. లో స్కోరింగ్ మ్యాచ్‌లు నమోదైనప్పటికి విజయం కోసం ఆఖరి బంతి వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా శుక్రవారం లైకా కోవై కింగ్స్, నెల్లయ్ రాయల్ కింగ్స్ మధ్య మ్యాచ్ భారీ స్కోర్లు నమోదయ్యాయి.

నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ అజితేశ్ గురుస్వామి ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 8 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ సంచలనం.. లైకా కోవై కింగ్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 52 బంతుల్లో 90 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే 10 పరుగుల తేడాతో మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే నెల్లయ్ రాయల్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 90, సురేశ్ కుమార్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అజితేశ్ గురుస్వామి (112 పరుగులు) ఒక్కడే జట్టును గెలిపించడం విశేషం.
G Ajitesh cracks 1st hundred of #TNPL2023 👏
P.S. Full innings will be up soon on our Youtube channel.#TNPLonFanCode pic.twitter.com/PAB1BjewTc— FanCode (@FanCode) June 16, 2023
చదవండి: బజ్‌బాల్ దూకుడు; రూట్ సెంచరీ.. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్