Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఎట్టకేలకు.. శ్రేయస్‌ అయ్యర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 6, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shreyas.jpg

వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్‌ స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఎట్టకేలకు బ్యాట్‌ ఝులిపించాడు. దులిప్‌ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్‌లో.. రెండో ఇన్నిం గ్స్‌లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.

బంగ్లాతో సిరీస్‌లో చోటు దక్కాలంటే..
కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే క్రమంలో ఈ సిరీస్‌ భారత్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్‌ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్‌బాల్‌ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

వరుస మ్యాచ్‌లలో విఫలం
అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ టోర్నీలో ఆడిన అయ్యర్‌.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్‌ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఇండియా-డి జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.

ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్‌కుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ పొరల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

అక్షర్‌ ఆల్‌రౌండ్‌ షోతో
ఇక కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్‌ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్‌ పెట్టారు. పేసర్లు హర్షిత్‌ రాణా(4/33), అర్ష్‌దీప్‌ సింగ్‌(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌(2/46), సారాంశ్‌ జైన్‌(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్‌ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

బ్యాట్‌ ఝులిపించిన శ్రేయస్‌ అయ్యర్‌
ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్‌ దూబే(5) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.

అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన శ్రేయస్‌.. రుతురాజ్‌ గైక్వాడ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉండటం విశేషం. టీ బ్రేక్‌ సమయానికి దేవ్‌దత్‌ పడిక్కల్‌ 42, రికీ భుయ్‌ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 ప‌రుగుల‌కు భార‌త్‌-బి ఆలౌట్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Shreyas Iyer
Duleep Trophy 2024
Anantapur
Axar Patel
half century
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

విషాదం.. రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

విషాదం.. రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఏపీలో భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు

ఏపీలో భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.