Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఈ కప్‌లో మనమే ప్రమాదకరం

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 5, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
india_20_20wc.jpg

మంచుతో సమస్య ఉండొచ్చు 

రోహిత్, కోహ్లి బాగా ఆడుతున్నారు 

ఇక మీదటా ఆడతారు

ఆడినంత సులువుకాదు కామెంట్రీ

న్యూఢిల్లీ: ఐసీసీ మొదలుపెట్టిన తొలి టి20 ప్రపంచకప్‌నే చేజిక్కించుకున్న భారత కెప్టెన్ ధోని. తర్వాత మరో రెండు ఐసీసీ (వన్డే ప్రపంచకప్, చాంపియన్స్‌) ట్రోఫీలను అందించిన విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ‘మిస్టర్‌ కూల్‌’ ఎమ్మెస్‌ ధోని శనివారం మొదలయ్యే టి20 ప్రపంచకప్‌ గురించి వ్యాఖ్యానించాడు. 

ఇంకా కొనసాగుతున్న 38 ఏళ్ల రోహిత్‌ శర్మ, 37 ఏళ్ల విరాట్‌ కోహ్లి కెరీర్‌పై స్పందన కోరితే ఘాటుగానే జవాబిచ్చాడు. ఎక్కడా తగ్గలేదు. అన్నింటికి తగిన సమాధానాలిచ్చాడు. మైదానంలో వికెట్ల వెనక చురుకైన వికెట్‌ కీపర్‌గా, తెలివైన కెప్టెన్ వ్యవహరించిన ధోని కామెంట్రీ మాత్రం కష్టమంటున్నాడు. స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని ఇంకా ఏమన్నాడంటే... 


వయసు అడ్డంకి కాదు 
రోహిత్, కోహ్లి బాగానే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతారు. అయితే ఏంటి? ఎందుకు ఆడకూడదు? పెరిగిన వయసే అడ్డంకా? నా దృష్టిలో వయసు అసలు ప్రాతిపదికే కాదు. ప్రదర్శనే ప్రామాణికం. ఫిట్‌నెస్సే ప్రధానం. అలాంటప్పుడు వయసును పరిగణించాల్సినపనేంటి చెప్పండి. ఆ వయసులో ఉన్న వారందరూ ఒకటేనా... అందరిని ఒకేలా చూస్తామా? నా విషయమే చెబుతా... నేను 24 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాను. 

అప్పుడెవరూ మాట్లాడలేదు. పదేళ్లకు పైగానే భారత్‌కు ఆడాను. 20 ఏళ్లయినా ఇంకా (ఐపీఎల్‌) ఆడుతున్నాను. ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. కానీ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి గురించే ఎందుకు ఈ చర్చంతా! ఎంతకాలం ఆడాలనేది వాళ్లకే వదిలేయండి ఆ విషయాన్ని. ఫామ్, ప్రదర్శన బాగున్నంత కాలం ఆడతారు. ఇందులో తప్పేంటి. నొప్పి ఎవరికి?. 

ఆ అనుభవం ఒక్క సచిన్‌కే 
అనుభవమనేది ఆడుతుంటేనే వస్తుంది. ఒక్క సచిన్‌ తప్ప 20 ఏళ్లకే అనుభవజు్ఞలైన ఆటగాళ్లుండటం అరుదు. 16, 17 ఏళ్లకు అరంగేట్రం చేస్తేనో రాదు. క్రమంగా ఆడితేనే వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొంటేనే అబ్బుతుంది. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిస్తేనే అలవాటవుతుంది. అనుభవమంటే అదే. ఏదో 20, 25 మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన అనుభవజు్ఞలైపోరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉంటుందో అనే అనుభవజ్ఞున్ని చేస్తుంది. 

భారత జట్టే ప్రమాదకారి 
సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌లో మనకు ఎదురుపడే ప్రత్యర్థులకు మనతోనే ముప్పు. ఈ మెగా ఈవెంట్‌లో ప్రమాదకర జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. ఒక మేటి జట్టులో ఏమేమి ఉండాలో అవన్నీ మన బృందంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫార్మాట్‌నే పరిగణిస్తే మన టీమ్‌కు మంచి అనుభవం ఉంది. 

ఈ విశేషానుభవం మన జట్టుకు అదనపు బలంగా పనికొస్తుంది. ఎంతటి ఒత్తిడిలోనైనా ఆడగలిగే స్థయిర్యం అనుభవంతోనే వస్తుంది. అయితే నాకు జట్టుపై ఎలాంటి బెంగా లేదు కానీ మంచుతోనే ఏదైనా సమస్య ఉండొచ్చు. శీతాకాలం కాబట్టి ఇది బాగా ఇబ్బంది పెట్టొచ్చు. దీంతో టాస్‌ కీలకంగా మారుతుంది. 

కామెంట్రీ కష్టం... అందుకే దూరం 
మైదానంలో మైక్‌ పట్టుకొని మాట్లాడటం వేరు. టీవీల్లో మైక్‌ పట్టుకొని వ్యాఖ్యానించడం వేరు. అందుకే కామెంటరీ కష్టమనే అంటాను. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు దీన్ని వివరించే ప్రక్రియలో ఆడుతున్న ఆటగాళ్లను విమర్శించే వైనానికి మధ్యలో సన్నని గీత ఒకటి ఉంటుంది. దాన్ని చెరపలేం... అతిక్రమించలేం. వ్యాఖ్యాతగా మాట్లాడుతుంటే ఆ గీత ఒకటుంది అది తప్పని అనిపించదు. మ్యాచ్‌ వివరించేందుకు ఓ వైపు ఉండటానికే ఇష్టపడతారు. 

మ్యాచ్‌ సమయంలో తప్పని అనిపిస్తే వెంటనే దాన్ని బయటికి చెప్పాల్సి ఉంటుంది. సున్నితంగా విమర్శించగలితే నేర్పుండాలి. హుందాగా వ్యాఖ్యానించాలి. ఎవరినీ లక్ష్యపెట్టకుండా, నొప్పించకుండా వ్యాఖ్యానించగలిగే నైపుణ్యం కూడా ఉండాలి. నాకు ఇవేమీ లేవు. అందుకే కామెంట్రీకి దూరం. అంతెందుకు గణాంకాలు సైతం గుర్తుండాలి. నాకేమో నా గణాంకాలే తెలియవు. కొందరైతే ఇందులోనిష్ణాతులై ఉంటారు. వారైతేనే కామెంటేటర్‌ పాత్రకు న్యాయం చేస్తారు. 

నేనో మంచి స్పీకర్‌ను కాదు 
నాకు వినడం మీద ఉన్న శ్రద్ద మాట్లాడటం మీద ఉండదు. వాదించడం నా వల్ల కానేకాదు. అందుకే అనిపిస్తుంది... నేను మంచి స్పీకర్‌ను కాదు. ఎప్పటికీ కాలేను కూడా! నేను మాట్లాడేది చాలా తక్కువ. నాకు అనువైన, నా మాటలు అర్థం చేసుకోగలిగిన వారితోనే మాట్లాడతాను. అందరితోనూ మాట్లాడలేను. కానీ ఎవరు చెప్పినా వినే ఓపికైతే నాకు చాలానే ఉంది. ఎంత సేపయినా వింటాను.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
MS Dhoni
ICC
t20 world cup
Interview
India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.