Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పడిక్కల్‌ పోరాటం

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 14, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
33.jpg

భారత ‘డి’ బ్యాటర్‌ సెంచరీ మిస్‌

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ‘డి’ 183 ఆలౌట్‌

భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 115/1  

సాక్షి అనంతపురం: ఓపెనర్లు ప్రథమ్‌ సింగ్‌ (82 బంతుల్లో 59 బ్యాటింగ్‌), కెపె్టన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ శతకాలు బాదడంతో భారత్‌ ‘డి’తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ‘ఎ’ 28.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆరంభం నుంచి సాధికారికంగా ఆడిన ఈ జంట తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగియడానికి ముందు భారత్‌ ‘డి’ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బౌలింగ్‌లో మయాంక్‌ ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 288/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ ‘ఎ’ మరో రెండు పరుగులు జోడించి 290 వద్ద ఆలౌటైంది. షమ్స్‌ ములానీ (187 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు మాత్రమే జత చేయగలిగాడు.

 భారత్‌ ‘డి’ బౌలర్లలో హర్షిత్‌ రాణా 4... విద్వత్‌ కావేరప్ప, అర్‌‡్షదీప్‌ సింగ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ‘డి’ 52.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. దేవదత్‌ పడిక్కల్‌ (124 బంతుల్లో 92; 15 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత్‌ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్, అఖీబ్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్‌ ‘ఎ’... రెండో ఇన్నింగ్స్‌ స్కోరుతో కలుపుకొని ఓవరాల్‌గా 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్‌ ‘ఎ’ మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. 

పడిక్కల్‌ ఒక్కడే... 
భారత్‌ ‘డి’ తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ ఒక్కడే ఆకట్టుకున్నాడు. కెపె్టన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (0) డకౌట్‌ కాగా.. వికెట్‌ కీపర్‌ సంజూ సామ్సన్‌ (5), అథర్వ (4), యశ్‌ దూబే (14), రికీ భుయ్‌ (23), సారాంశ్‌ జైన్‌ (8), విఫలమయ్యారు. ఒక ఎండ్‌లో పడిక్కల్‌ క్రీజులో పాతుకుపోగా... మరో ఎండ్‌ నుంచి అతడికి సహకారం అందించేవారే కరువయ్యారు. సహచరులతో ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా... పడిక్కల్‌ మాత్రం జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సామ్సన్‌ మరోసారి అంచనాలు అందుకోలేకపోగా... మెరుగైన ఆరంభం దక్కించుకున్న ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌... ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో హర్షిత్‌ రాణా (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్‌ ‘డి’183 పరుగులు చేయగలిగింది.

స్కోరు వివరాలు 
భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 288 ఆలౌట్‌; భారత్‌ ‘డి’ తొలి ఇన్నింగ్స్‌: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్‌ 4; యశ్‌ దూబే (సి) కుశాగ్ర (బి) అఖీబ్‌ 14; శ్రేయస్‌ (సి) అఖీబ్‌ (బి) ఖలీల్‌ 0; పడిక్కల్‌ (సి) కుశాగ్ర (బి) ప్రసిధ్‌ కృష్ణ 92; సంజూ సామ్సన్‌ (సి) ప్రసిధ్‌ కృష్ణ (బి) అఖీబ్‌ 5; రికీ భుయ్‌ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్‌ 23; సారాంశ్‌ (ఎల్బీ) తనుశ్‌ 8; సౌరభ్‌ (సి) శాశ్వత్‌ (బి) అఖీబ్‌ 1; హర్షిత్‌ రాణా (బి) ములానీ 31; అర్‌‡్షదీప్‌ (రనౌట్‌) 0; విద్వత్‌ కావేరప్ప (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: (52.1 ఓవర్లలో ఆలౌట్‌) 183. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–44, 4–52, 5–96, 6–122, 7–141, 8–154, 9–170, 10–183. బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 8–0–39–3; ప్రసిధ్‌ కృష్ణ 11–4–30–1; అఖీబ్‌ ఖాన్‌ 12–2–41–3; తనుశ్‌ కొటియాన్‌ 12–5–22–1; షమ్స్‌ ములానీ 9.1–1–50–1. 

భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: ప్రథమ్‌ సింగ్‌ (బ్యాటింగ్‌) 59; మయాంక్‌ అగర్వాల్‌ (సి అండ్‌ బి) శ్రేయస్‌ అయ్యర్‌ 56; మొత్తం: (28.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి) 115. వికెట్ల పతనం: 1–115, బౌలింగ్‌: హర్షిత్‌ రాణా 3–0–12–0; విద్వత్‌ కావేరప్ప 3–0–18–0; సౌరభ్‌ కుమార్‌ 11–1–46–0; అర్‌‡్షదీప్‌ సింగ్‌ 4–0–21–0; సారాంశ్‌ జైన్‌ 7–1–18–0; శ్రేయస్‌ అయ్యర్‌ 0.1–0–0–1.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Duleep Trophy 2024
Devdutt Padikkal
Shreyas Iyer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

షాకింగ్‌.. శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14కోట్లు

షాకింగ్‌.. శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14కోట్లు

కెప్టెన్ గా  శ్రేయస్... ఆనందంతో అయ్యర్ తండ్రి డాన్స్ వైరల్ అవుతున్న వీడియో

కెప్టెన్ గా శ్రేయస్... ఆనందంతో అయ్యర్ తండ్రి డాన్స్ వైరల్ అవుతున్న వీడియో

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.