Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

నయా రాకెట్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 11, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rocket.jpg

భారత టెన్నిస్‌లో నిశ్శబ్ద చాంపియన్‌గా ఎదిగిన దక్షిణేశ్వర్‌

నెదర్లాండ్స్‌తో డేవిస్‌కప్‌ పోరులో అసాధారణ ప్రదర్శన

బరిలోకి దిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం

తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయని చెన్నై ప్లేయర్‌  

సాక్షి క్రీడా విభాగం :   దక్షిణేశ్వర్‌ సురేశ్‌... గతేడాదే డేవిస్‌కప్‌లో అరంగేట్రం చేశాడు. తొలి ప్రయత్నంలోనే బోణీ కూడా కొట్టాడు. అయినా మనకెవరికీ తెలియదు. తాజాగా తెలిసింది. తెలియని వారు సైతం తెలుసుకుంటున్నారు. గూగుల్‌లో ఎవరీ దక్షిణేశ్వర్‌ అని సెర్చ్‌ చేస్తున్నారు. ఇంతలా నెటిజన్ల కంటపడుతున్న అతను ఏం చేశాడో చెప్పాల్సిన పనైతే లేదు. ఎందుకంటే అతనొక సంచలనం. డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌–1లో నెదర్లాండ్స్‌ జట్టుతో భారత్‌ ఆడితే... తలపడింది... ఎదురుపడింది... ఎదుర్కొని  గెలిపించింది మాత్రం దక్షిణేశ్వరే! 

ఇందులో ఏ మాత్రం అతిశయోక్తే లేదు.  పోటీ... నైపుణ్యం నిండిన ప్రస్తుత కాలంలో దక్షిణేశ్వర్‌ ముమ్మాటికి ఓ నిశ్శబ్ద చాంపియన్‌. జూనియర్‌ సర్క్యూట్, ఏటీపీ చాలెంజర్‌... ఐటీఎఫ్‌ ... ఇలా ఎన్నో పేర్లతో టోర్నీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అన్నింటా ఆడుతూనే ఉన్నా... ఏ టోర్నీలోనూ కంటబడని తమిళనాడు యువతార ఏకంగా చాంపియన్‌గా బయటపడటమే పెద్ద విశేషం. ఒకప్పుడు ఆట కోసం కిట్‌ బ్యాగులు మోసిన భుజాలే ఇప్పుడు డేవిస్‌ కప్‌లో భారత బాధ్యతల్ని మోస్తున్నాయి. 

ఎంతో క్రమశిక్షణతో కూడిన అతని శిక్షణ, పోటీలు, విజయాలు ఇవన్నీ కూడా గమనించిన వారికి ముచ్చటేయకుండా ఉండదు. పొద్దెక్కముందే ట్రెయినింగ్‌... మధ్యలో పోటీలు... పిడికిలి బిగిస్తే విజయాలు అన్నీ కూడా ఓ క్రమపద్దతిలో కష్టపడితేనే వచ్చాయి. ఓపికగా, ఒద్దికగా అన్నింటిని భరించిన దక్షిణేశ్వర్‌ ఈ క్రమంలో క్రీడా జర్నలిస్టుల ప్రాధాన్యంలోనూ లేడు. కానీ ఒక్కసారిగా సంచలన విజయాలతోనే అందరి కళ్లముందుకు వచ్చాడు. ఏటీపీ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారమైతే డేవిస్‌కప్‌లో భారత జట్టు తరఫున నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ తర్వాత ఆర్యన్‌ షా, కరణ్‌ సింగ్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాలి. 

అయితే భారత నాలుగో ర్యాంకర్‌గా ఉన్న దక్షిణేశ్వర్‌ ఆటతీరుపై నమ్మకంతో భారత జట్టు నాన్‌ప్లేయింగ్‌ కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ ఈ తమిళనాడు పొడగరికి ఏకంగా మూడు మ్యాచ్‌లు (సింగిల్స్, డబుల్స్, రివర్స్‌ సింగిల్స్‌) ఆడే అవకాశం ఇచ్చాడు. రోహిత్‌ రాజ్‌పాల్‌తోపాటు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అంచనాలకు మించి రాణించిన దక్షిణేశ్వర్‌కు భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.   

తొలినాళ్ల ప్రయాణమిది 
తమిళనాడులోని దిండిగుల్‌ పట్టణానికి చెందిన దక్షిణేశ్వర్‌ తండ్రి సురేశ్‌ ఎక్కా కూడా టెన్నిస్‌ ప్లేయరే! రాష్ట్రానికి, దేశానికి ఆడలేదు కానీ క్లబ్‌ లెవెల్‌ ఆటగాడు సురేశ్‌. బహుశా ఈ మూలాలే దక్షిణేశ్వర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాయేమో! చెన్నైలోని కోచ్‌ లక్ష్మణ్‌ చక్రవర్తి శిక్షణలో ఓనమాలు, తర్వాత మెలకువలు నేర్చుకొని రాటుదేలాడు. 2010 నుంచి 2016 వరకు తన ఉండే ఊరి నుంచి 16 కిలోమీటర్లు కిట్‌ బ్యాగులు మోసుకొని చెన్నై వెళ్లి చక్రవర్తి ఇచ్చే రోజువారీ శిక్షణ ముగించుకొని తిరిగి బస్సులో ఇంటికి చేరేవాడు. 

నిండా పదేళ్లు (9) లేకపోయినా సురపేట్‌ నుంచి మొగప్పాయిర్, అక్కడి నుంచి అన్నా నగర్, అటుపై లయోలా కాలేజ్‌ అతని టెన్నిస్‌ శిక్షణ సాగేదని కోచ్‌ చక్రవర్తి వివరించారు. ‘అదేంటో ఏమో దక్షిణేశ్వర్‌ బాల్యం నుంచే ఎవరితోనైనా సరే ఆడేందుకు ఇష్టపడేవాడు. కష్టపడేందుకు, నేర్చుకునే క్రమంలో ఆడిగేందుకు సిగ్గుపడడు. కానీ తన పనిమాత్రం నింపాదిగా, నిశ్శబ్దంగానే చేసుకునేవాడు. 

అతనిది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పెప్సీ, కోక్‌లాంటి కూల్‌డ్రింక్స్‌ తాగేవాడే కాదు. కఠినమైన క్రమశిక్షణతోనే మెలిగేవాడు. అవకాశాలేమో పరిమితంగా వస్తే, ఆర్థిక సమస్యలు అపరిమితంగా చుట్టిముట్టినా కూడా క్రమశిక్షణతోనే అధిగమించాడు. 2016లో ఫ్రాన్స్‌లో శిక్షణకు వెళ్లాడు. ఆ తర్వాతే అండర్‌–16 జాతీయ టోర్నీలో విజేతగా నిలిచాడు’ అని 65 ఏళ్ల కోచ్‌ లక్ష్మణ్‌ చక్రవర్తి తన శిష్యుడి ప్రయాణం చెబుతూ మురిసిపోయారు. 

ప్రస్తుతం అమెరికాలో... 
దక్షిణేశ్వర్‌ ఆటలో క్రమంగా రాటుదేలుతున్నా... చదువెందుకని ఏనాడు అనుకోలేదు. ఆటలో కష్టపడ్డట్లే ఉన్నత విద్య కోసం కూడా అంతే క్రమశిక్షణతో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని ‘వేక్‌ ఫారెస్ట్‌ యూనివర్సిటీ’లో కమ్యూనికేషన్స్‌ విద్యను అభ్యసిస్తున్న అతని చదువు ఈ ఏడాది మే నెలలో పూర్తవనుంది. 

ఆ తర్వాత పూర్తిగా టెన్నిస్‌పైనే దృష్టి సారించనున్నాడు. దీంతో మరిన్ని విజయాలతో 470వ ర్యాంకులో ఉన్న ఈ తమిళనాడు ప్లేయర్‌ నిలకడైన విజయాలు సాధిస్తే మరో ఏడాది తిరిగేసరికి టాప్‌–100 ర్యాంకింగ్స్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 


ఏడాది గడిచే సరికి...
గతేడాది డేవిస్‌ కప్‌లో భారత్‌... స్విట్జర్లాండ్‌తో ఆడింది. 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌ ఆడిన భారత డేవిస్‌ బృందంలో దక్షిణేశ్వర్‌ ఉన్నాడు. బరిలోకి దిగి సింగిల్స్‌లో గెలిచాడు. అలా భారత్‌ విజయంలో దక్షిణేశ్వర్‌ పాత్ర ఉంది. ఏడాది తిరిగేసరికి 22 ఏళ్ల క్రితం లియాండర్‌ పేస్‌ రికార్డునే సమం చేసిన ఘనత దక్షిణేశ్వర్‌ది! 2004లో జపాన్‌పై పేస్‌ 3 మ్యాచ్‌లాడి పేస్‌ గెలిపించాడు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత దక్షిణేశ్వర్‌ నెదర్లాండ్స్‌తో తొలి సింగిల్స్‌ ఆడి గెలిచాడు. 

రెండో రోజు డబుల్స్, రివర్స్‌ సింగిల్స్‌ వరుసగా ఆడి కూడా గెలిపించాడు. పేస్‌ తర్వాత... దక్షిణేశ్వర్‌ కంటే ముందు... సోమ్‌దేవ్, విష్ణువర్ధన్, సాకేత్‌ మైనేని, సుమిత్‌ నగాల్, యూకీ బాంబ్రీ, గుణేశ్వరన్, శ్రీరామ్‌ బాలాజీ, జీవన్‌ నెడుంజెళియన్‌ ఇలా ఎంతోమంది వచ్చారు. మెరుగైన ర్యాంకింగ్స్‌లో నిలిచారు. డేవిస్‌ కప్‌ ఆడారు. కానీ దక్షిణేశ్వర్‌ ర్యాంకింగ్స్‌లో వెనుకబడినా... భారత్‌ను ముందుండి గెలిపించే ప్రదర్శనైతే చేయలేదు.    

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
dakshineswar
Suresh
davis cup
India
Netherlands
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.