Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

WC: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజాలతో..

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 7, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cwc-qualifiers-2023_0.gif

ICC Cricket World Cup Qualifiers 2023 SCO Vs NED: వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్‌కు వచ్చే రెండు జట్లేవో తేలిపోయింది. మాజీ చాంపియన్‌ శ్రీలంక ఇంతకుముందే అర్హత సాధించగా, ఇప్పుడు నెదర్లాండ్స్‌ తమ చోటును ఖాయం చేసుకుంది. తప్పనిసరిగా నెగ్గాల్సిన గురువారం నాటి ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 4 వికెట్లతో స్కాట్లాండ్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్‌ అసాధారణ రీతిలో

బ్రెండన్‌ మెక్‌ములన్‌ (106; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్‌ రిచీ బెరింగ్టన్‌ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. బాస్‌ డి లీడె (5/52) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావాలంటే 44 ఓవర్లలోనే లక్ష్యం సాధించాల్సిన స్థితిలో నెదర్లాండ్స్‌ బరిలోకి దిగింది. ఆ జట్టు 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు సాధించింది. 

బాస్‌ దంచికొట్టాడు

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బాస్‌ డి లీడె (92 బంతుల్లో 123; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... విక్రమ్‌జిత్‌ సింగ్‌ (40), సాఖిబ్‌ జుల్ఫికర్‌ (33 నాటౌట్‌) రాణించారు. 36 ఓవర్లు ముగిసేవరకు కూడా మ్యాచ్‌ స్కాట్లాండ్‌ నియంత్రణలోనే ఉంది. 8 ఓవర్లలో నెదర్లాండ్స్‌ 85 పరుగులు చేయాల్సి ఉంది. 

తర్వాతి 4 ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 4 ఓవర్లలో 45కు మారింది. ఈ సమయంలో డి లీడె ఒక్క సారిగా టి20 తరహా ఆటను చూపించాడు. వాట్‌ వేసిన ఓవర్లో 2 సిక్స్‌లు, మెక్‌ములెన్‌ వేసిన తర్వాతి ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో మొత్తం 42 పరుగులు వచ్చేశాయి. 84 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. డి లీడె రనౌటైనా, వాన్‌ బీక్‌ సింగిల్‌ తీయడంతో డచ్‌ శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి.  

తొలి డచ్‌ క్రికెటర్‌గా

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా సెంచరీ హీరో బాస్‌ డి లీడె అరుదైన రికార్డు సాధించాడు. డచ్‌ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ సరసన నిలిచాడు. వన్డేల్లో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు డి లీడె. గతంలో వివియన్‌ రిచర్డ్స్‌ (వెస్టిండీస్‌), కాలింగ్‌వుడ్‌ (ఇంగ్లండ్‌), రోహన్‌ ముస్తఫా (యూఏఈ) మాత్రమే ఈ ఘనత సాధించారు.

తొలి ప్లేయర్‌ వివియన్‌ రిచర్డ్స్‌

1987లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వివ్‌ రిచర్డ్స్‌ 119 పరుగులు చేయడంతో పాటు 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్‌తో 2005 నాటి మ్యాచ్‌లో పాల్‌ కాలింగ్‌వుడ్‌ సెంచరీ సాధించడంతో పాటు ఆరు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ కెప్టెన్‌ రోహన్‌ ముస్తఫా 2017లో పపువా న్యూ గినియాతో మ్యాచ్‌ సందర్భంగా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్‌ వికెట్‌ తీసి.. ఇప్పుడేమో

Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్‌! వీడియో వైరల్‌

View this post on Instagram

A post shared by ICC (@icc)

View this post on Instagram

A post shared by ICC (@icc)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Bas de Leede
ICC ODI World Cup 2023
ICC ODI World Cup qualifying tournament
Vivian Richards
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

T20 WC: ఐసీసీకి డచ్‌ క్రికెటర్‌ డిమాండ్‌.. కనీసం..

T20 WC: ఐసీసీకి డచ్‌ క్రికెటర్‌ డిమాండ్‌.. కనీసం..

'బాస్‌' ఆల్‌రౌండ్‌ షో.. పసికూనల పోరులో నెదర్లాండ్స్‌ గెలుపు

'బాస్‌' ఆల్‌రౌండ్‌ షో.. పసికూనల పోరులో నెదర్లాండ్స్‌ గెలుపు

చాలా బాధ‌ప‌డ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా: రోహిత్‌ శర్మ

చాలా బాధ‌ప‌డ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా: రోహిత్‌ శర్మ

రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్‌

రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్‌

పెళ్లి కాకుండానే ముగ్గురు పిల్లలు.. వారితో ఇప్పటికీ టచ్‌లోనే..

పెళ్లి కాకుండానే ముగ్గురు పిల్లలు.. వారితో ఇప్పటికీ టచ్‌లోనే..

 ఇంగ్లండ్‌కు డేంజర్‌ బెల్స్‌..  వ‌న్డే వరల్డ్ కప్‌కు డైరెక్ట్ ఎంట్రీ కష్టమే!?

ఇంగ్లండ్‌కు డేంజర్‌ బెల్స్‌.. వ‌న్డే వరల్డ్ కప్‌కు డైరెక్ట్ ఎంట్రీ కష్టమే!?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.