Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. అతడితో ఎఫైర్‌.. ప్రెగ్నెంట్‌ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
ADVERTISEMENT

అతడితో ఎఫైర్‌.. ప్రెగ్నెంట్‌ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 17, 2026 01:11 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
MGVVRNG.jpg

వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్లలో సర్‌ వివియన్‌ రిచర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. డెబ్బై, ఎనభైవ దశకాల్లోనే టీ20 తరహాలో దూకుడైన, విధ్వంసకర బ్యాటింగ్‌తో తనదైన శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హెల్మెట్‌ లేకుండానే మైదానంలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి.. స్టైలిష్‌గా షాట్లు బాదే ఈ ‘స్వాగర్‌’పై అప్పట్లో చాలా మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారు.

అలా పరిచయం
అందులో బాలీవుడ్‌ నటి నీనా గుప్తా కూడా ఒకరు. ఎనభైవ దశకంలో జైపూర్‌ మహారాణి ఇచ్చిన విందులో రిచర్డ్స్‌ను నేరుగా కలిసే అవకాశం వచ్చింది నీనాకు. అంతకుముందు రోజే అతడి మ్యాచ్‌ చూసిన ఆమెకు రిచర్డ్స్‌తో పరిచయం చెప్పలేని సంతోషాన్నిచ్చింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే, రిచర్డ్స్‌ వెస్టిండీస్‌కు తిరిగి వెళ్లిపోయిన తర్వాత కాంటాక్ట్‌ మిస్‌ అయింది. ఓ రోజు అనుకోకుండా ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకున్నారు. అప్పటి నుంచి స్నేహం పెరిగి ఇద్దరి మధ్య ‘బంధం’ మొదలైంది.


అప్పటికే అతడికి పెళ్లి అయిపోయింది
అలా ఇద్దరూ ఒక్కటి కాగా.. నీనా గుప్త గర్భం దాల్చింది. అయితే, అప్పటికే వివియర్‌ రిచర్డ్స్‌ వెస్టిండీస్‌కు వెళ్లిపోగా... ఆ తర్వాతే నీనాకు ఈ విషయం తెలిసింది. అయితే, అప్పటికే వివియన్‌ రిచర్డ్స్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇలాంటి తరుణంలో గర్భం కొనసాగించేందుకే నిర్ణయించుకున్న నీనా గుప్తా.. కూతురు మసాబా గుప్తాకు 1989లో జన్మనిచ్చింది. సింగిల్‌ పేరెంట్‌గా ఆమెను పెంచి పెద్ద చేసి ఫ్యాషన్‌ డిజైనర్‌గా తీర్చిదిద్దింది. 

అతడితో ఎఫైర్‌.. ప్రెగ్నెంట్‌ అని చెప్తే ఓకే అన్నాడు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలు గుర్తు చేసుకున్న నీనా గుప్తా వివియన్‌ రిచర్డ్స్‌తో తనకున్న అనుబంధం గురించి వివరించింది. దీంతో వీరి రిలేషన్‌షిప్‌ మరోసారి తెరమీదకు వచ్చింది.

ఇక తన ఆటోబయోగ్రఫీ ‘సచ్‌ కహూన్‌ తో’లోనూ నీనా గుప్తా వివియన్‌ రిచర్డ్స్‌ గురించి ప్రస్తావించింది. ‘‘వివియన్‌కు, నాకు మధ్య అఫైర్‌ నడిచింది. అలా నేను ప్రెగ్నెంట్‌ అయ్యాను. తల్లిని కాబోతున్నానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.


అయితే, తన బిడ్డను మోయాలా? లేదా? అనే విషయాన్ని వివియన్‌తో చర్చించాలని నిర్ణయించుకున్నా. నేను గర్భవతినన్న విషయం తెలిసేసరికే వివియన్‌ వెస్టిండీస్‌ చేరుకున్నాడు. ఎలాగోలా అతడి నంబర్‌ సంపాదించి ప్రెగ్నెంట్‌ అన్న విషయం చెబితే నాకు నచ్చినట్లే ముందుకు సాగమని చెప్పాడు. తన బిడ్డను నేను కనడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు’’ అని నీనా పేర్కొంది.

అందుకే పెళ్లి చేసుకోలేదు
ఇక మరో ఇంటర్వ్యూలో వివియన్‌ రిచర్డ్స్‌ను నిజంగానే ప్రేమించి ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్న నీనాకు ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడిని ఇదే ప్రశ్న అడగడానికి చాలా మంది భయపడతారు. మరి నన్నెందుకు ఇంత సులువుగా అడిగేస్తున్నారు. మేము ప్రేమించుకున్నామనే నేను అనుకుంటున్నాను.

కలిసి ఉన్న కొంతకాలంలోనే మాకు ఎన్నో మధురు జ్ఞాపకాలు మిగిలాయి. నటిగా ఉండటం నాకిష్టం. వివియన్‌ను పెళ్లి చేసుకుని నేను విండీస్‌కు వెళ్లలేను. అతడు కూడా నా కోసం తన కెరీర్‌ వదులుకుని ఇండియాకు రాలేడు. అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు’’ అని నీనా తెలిపింది.  

మసాబాకు సారీ చెప్తూనే ఉంటా
అదే విధంగా.. ‘‘ఏదేమైనా నేను పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాల్సి కాదు. ప్రతీ బిడ్డకు తల్లి.. తండ్రి.. ఇద్దరి ప్రేమా అవసరం. నేను నా కూతురు మసాబాకు ఈ విషయంలో రోజూ క్షమాపణలు చెబుతూ ఉంటా. తండ్రి లేకుండా పెరిగే క్రమంలో తను చాలా బాధ పడింది. కానీ నాపై మాత్రం ఆమెకు ప్రేమ తగ్గలేదు’’ అని నీనా గుప్తా ఉద్వేగానికి లోనైంది.


కాగా మసాబాకు తండ్రి వివియన్‌ రిచర్డ్స్‌తో మంచి అనుబంధం ఉంది. వీలు చిక్కినప్పుడల్లా మసాబా తన తండ్రిని కలుసుకుంటూ ఉంటుంది. నీనా, ఆమె భర్త సైతం అతడితో స్నేహంగానే ఉంటారు. మసాబా పెళ్లిలో వీరు ముగ్గురు కలిసి కనిపించడం విశేషం.

ఎవరి జీవితాల్లో వారు బిజీ
ఇదిలా ఉంటే.. నీనా గుప్తా తనకు 49 ఏళ్ల వయసు ఉన్నపుడు 2008లో వివేక్‌ మెహ్రా అనే వ్యక్తిని పెళ్లాడింది. అమెరికాలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం జరిగింది. మరోవైపు.. వివియన్‌ రిచర్డ్స్‌- మిరియం రిచర్డ్స్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. నీనాతో రిలేషన్‌షిప్‌ తర్వాత వివియన్‌- మిరియం మధ్య విభేదాల కారణంగా కొన్నాళ్లు దూరంగా ఉన్నట్లు సమాచారం.


కాగా 74 ఏళ్ల వివియన్‌ రిచర్డ్స్‌ 1974- 1991 మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. వెస్టిండీస్‌ తరఫున 121 టెస్టుల్లో 8540, 187 వన్డేల్లో 6721 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌. తన అద్భుతమైన ఆట తీరుతో సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌గా ఖ్యాతిగాంచాడు.

చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్‌.. విలువ ఎంతంటే?

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Vivian Richards
Viv Richards
West Indies
Neena Gupta
masaba gupta
Off the field
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మా దారులు వేరయ్యాయి: భారత క్రికెటర్‌ పెళ్లి రద్దు

మా దారులు వేరయ్యాయి: భారత క్రికెటర్‌ పెళ్లి రద్దు

పంత్‌కు పిలుపు దక్కేనా!

పంత్‌కు పిలుపు దక్కేనా!

అంబానీ ఇంట పూజ.. ప్రత్యేక ఆకర్షణగా సారా, సానియా.. వీడియో

అంబానీ ఇంట పూజ.. ప్రత్యేక ఆకర్షణగా సారా, సానియా.. వీడియో

విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...

విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...

పిల్లాడి చేష్టలు!.. పంత్‌పై వేటు.. తొలిసారి స్పందించిన యజమాని

పిల్లాడి చేష్టలు!.. పంత్‌పై వేటు.. తొలిసారి స్పందించిన యజమాని

PhD స్టూడెంట్‌తో పెళ్లి బంధంలోకి క్రికెటర్‌

PhD స్టూడెంట్‌తో పెళ్లి బంధంలోకి క్రికెటర్‌

మరిన్ని వార్తలు

పాకిస్తాన్‌ దిగ్గజం‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌.. పాక్‌ ప్లేయర్లకు అవమానం!

పాకిస్తాన్‌ దిగ్గజం‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌.. పాక్‌ ప్లేయర్లకు అవమానం!

అతడి కోసం త్యాగం చేశాడు.. భయ్యా గొప్పోడు: అభిషేక్‌

అతడి కోసం త్యాగం చేశాడు.. భయ్యా గొప్పోడు: అభిషేక్‌

బ‌ట్ల‌ర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్‌

బ‌ట్ల‌ర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్‌

టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి.. ఎవరంటే?

టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి.. ఎవరంటే?

బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్‌ మ్యాచ్‌?

బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్‌ మ్యాచ్‌?

'వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్‌కు సెట్ కాడు'

'వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్‌కు సెట్ కాడు'

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Jagati Publications Limited.